Andhra Pradesh: చిన్నారులపై కీచకపర్వం.. వీడికి ఏ శిక్ష వేసినా తప్పులేదు..

ప్రతీకాత్మక చిత్రం

ఎంతో చలకీగా అక్కడ పనులు చేస్తూ ఆడుకుంటున్న చిన్నారులపై ఈశ్వరయ్య కన్నుపడింది.

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  అభం శుభం తెలియని పసిప్రాయం వారిది. ఆటపాటలతో బోసి నవ్వులు నవ్వుకుంటూ.. ఎలాంటి బేధాలు లేకుండా ఆడుకోవడమే వారికి తెలిసింది. పెద్దలు అరిస్తే బుంగ మూతి పెట్టుకోవడం., లాలిస్తే అంబారీ ఎక్కడం మాత్రమే వారి నైజం. అలాంటి పసిమొగ్గలను బాల్యంలోనే నలిపేస్తున్నారు కొందరు కీచకులు. లోకంపోకడ తెలియని వారిపై కామవాంఛ తీర్చుకొంటున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా నిత్యం ఏదొక మూల చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందరో మృగాళ్లకు శిక్ష పడుతున్నా కనువిప్పు కావడం లేదు. చిన్నారులు కనిపిస్తే చాలు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి కామంతో అత్యాచారం చేస్తున్నారు. సొంత బంధువులైనా., దూరపు చుట్టాలైనా, తెలిసిన వారైనా సరే వారితో పిల్లలను పంపాలంటే ఒక్క క్షణం ఆలోచించాల్సి దుస్థితి. సమీప బంధువే కదా అని సహాయానికి ఇద్దరు చిన్నారులను పంపితే ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

  ధర్మవరం పట్టణంలోని శివనగర్ కు చెందిన ఈశ్వరయ్య అనే వ్యక్తి ప్రస్తుతం తన ఇంటిని మరమత్తులు చేయిస్తున్నాడు. ఈనెల 12వ తేదీన మరమ్మతుల పనులు చేస్తున్న సమయంలో కార్మికులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు వేరొక కాలనీలో ఉన్న సమీప బంధువు పిల్లలైన అక్కాచెల్లెళ్లను తన బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లాడు. తెలిసిన వాడే కావడంతో తల్లిదండ్రులు కూడా అతడితో పంపారు. ఎంతో చలకీగా అక్కడ పనులు చేస్తూ ఆడుకుంటున్న చిన్నారులపై ఈశ్వరయ్య కన్నుపడింది. పనిచేసిన కూలీలు వెళ్లిపోయిన వెంటనే తన మదిలో పుట్టిన పాడు ఆలోచనను ఆచరణలో పెట్టాడు. చిన్నారులిద్దరిపైనా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం వారిని బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లి ఇంటివద్ద విడిచిపెట్టాడు.

  ఇది చదవండి: ఇదెక్కడి విడ్డూరం..? పెంపుడు కుక్కకు కాంస్య విగ్రహం, పిండ ప్రదానం..


  మరుసటి రోజు మళ్లీ వచ్చిన ఈశ్వరయ్య వారిలో పెద్ద బాలికను బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అదే సమయంలో చిన్న కుమార్తె అతడితో వెళ్ళకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. నువ్వెందుకు వెళ్లలేదని తల్లి ఆ పాపను ప్రశ్నించగా.. జరిగిన అకృత్యాన్ని తల్లికి వివరించింది. దీంతో పాపను ఎలాగైనా కాపాడాలని పరుగులు పెట్టింది. అంతలోనే ఈశ్వరయ్య బాలికను తీసుకొని ఇంటికి వచ్చాడు. దీనిపై బాలిక తల్లి ఈశ్వరయ్యను ప్రశ్నించగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక నొప్పిగా ఉందని చెప్పడంతో పాపను ఆస్పత్రికి తరలించారు.

  ఇది చదవండి: ఏలూరు కార్పొరేషన్ ఫలితాలకు గ్రీన్ సిగ్నల్... కౌంటింగ్ ఎప్పుడంటే..


  చిన్నారుల తల్లి ఈశ్వరయ్యపై ధర్మవరం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పోక్సో చట్టంకింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై అకృత్యానికి పాల్పిడిన ఈశ్వరయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: