TIRUPATI MAN AND WOMAN FILED COMPLAINTS ON EACH OTHER AFTER FACE BOOK FRIENDSHIP TURNED INTO LOVE STORY IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Shocking Love Story: దీన్ని లవ్ స్టోరీ అనాలా..? లేక మరొకటి అనాలా..? పోలీసులకు పిచ్చెక్కిస్తున్న జంట
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ (Hyderabad) కు చెందిన ఓ యువతికి తిరుపతికి చెందిన వినయ్ అనే యువకుడికి కొన్నిరోజుల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. చాటింగ్ తో మొదలైన స్నేహం... ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునేవరకు వెళ్లింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు.
ఈ రోజుల్లో సోషల్ మీడియా (Social Media) లో ఎవరికి ఎవరితో ఎలా పరిచయమవుతుందో చెప్పలేదు. కొందరు స్నేహానికే పరిమితమవుతుంటే మరికొందరు హద్దులు దాటేస్తున్నారు. అంతేకాదు ప్రేమ, సహజీవనం అంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఫేస్ బుక్ (Facebook) లో పరిచయమైన యువతికి దగ్గరయ్యాడు. ఆమె కూడా అతడికి మరింత దగ్గరైంది. ఐతే ఇద్దరికి ఒకరికి గురించి ఒకరికి నిజాలు తెలియడంతో స్టోరీలో అనుకోని ట్విస్టులు చేటు చేసుకున్నాయి. అంతేకాదు పోలీసులకు కూడా చుక్కలు చూపిస్తోంది. వివరాలోకి వెళ్తే.. హైదరాబాద్ (Hyderabad) కు చెందిన ఓ యువతికి తిరుపతికి చెందిన వినయ్ అనే యువకుడికి కొన్నిరోజుల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. చాటింగ్ తో మొదలైన స్నేహం... ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునేవరకు వెళ్లింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు.
కొన్నిరోజుల తర్వాత తనకు ఇప్పటికే పెళ్లైందని.. ఒక బాబు కూడా ఉన్నట్లు ఆమె వినయ్ కి చెప్పింది. అయినా నువ్వంటే నాకిష్టం అని వినయ్ చెప్పడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఓ రోజు వినయ్ కి డబ్బులు అవరసమవడంతో యువతి రూ.1.60 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడంతో తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి తరచూ గొడవ పడుతున్నారు. యువతి గట్టిగా నిలదీయడంతో వినయ్ పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడంతో ఆమె తిరుపతి వచ్చింది.
తిరుపతి లోని ఓ హోటల్లో రూమ్ తీసుకొని పెళ్లి విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. అదే సమయంలో తనకు గతంలోనే పెళ్లైందని.. ఒక బాబు కూడా ఉన్నట్లు వినయ్ బాంబు పేల్చాడు. ఇద్దరం విడిపోదామని తనను వదిలేయాలని వినయ్ కోరాడు. అప్పటికే అతడిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువతి.. పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో కాస్త మంచిగా నటించిన వినయ్ ఆమెను హైదరాబాద్ పంపేసి ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు.
ఈ క్రమంలో తిరుచానూరులోని వినయ్ నివాసానికి వెళ్లి అక్కడ పంచాయతీ పెట్టింది. తనకు రూ.8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంత పెద్దమొత్తం తన దగ్గర లేదని రూ.2.60లక్షలు ఇచ్చాడు. అనంతరం ఆమెతో ఎలాంటి సంబంధం లేదంటూ డాక్యుమెంట్ రాయించుకున్నాడు. అంతటితో గొడవ సద్దుమణిగిందనుకున్న వినయ్ కు.. సదరు యువతి షాకిచ్చింది. వినయ్ తనను మోసం చేశాడని చిత్తూరు జిల్లా దిశపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే వినయ్ ను పిలించిన పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు.
తర్వాత కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న యువతి.. మళ్లీ వినయ్ పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వినయ్ వల్ల తన జీవితం నాశనమైందని.. ఉద్యోగం కూడా పోయిందని గొడవ చేసింది. దీంతో ఆమెకు రూ.లక్షన్నర ఇచ్చేందుకు ఒప్పుకన్న వినయ్.. ఐదు నెలల పాటు నెలకు రూ.15వేల చొప్పున ఆమె ఎకౌంట్లో డబ్బులు వేశాడు. ఆ తర్వాత రూ.50వేలు ఇచ్చాడు.
అయినా యువతి శాంతించలేదు వినయ్ మోసం చేసాడంటూ తిరుపతిలోని పలుచోట్ల పోస్టర్లు అంటించింది. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టింది. ఆమె చేసిన పనికి కౌంటర్ గా వినయ్ కూడా సదరు యువతిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో యువతి తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పనాయుడిని కలిసి సమస్యను పరిష్కరించాలని వేడుకుంది. ఇది తెలుసుకున్న వినయ్ నిన్న తిరుపతి ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఎస్పీని ఆమే తనను వేధిస్తోందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో ఎవరికి న్యాయం చేయాలో అర్ధం కాక పోలీసులు తలపట్టుకుంటున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.