హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kalamkari Art: అద్భుతాలు చేస్తున్న మహిళలు.. మగవాళ్లకు ధీటుగా వ్యాపారం.. ఎక్కడో తెలుసా..?

Kalamkari Art: అద్భుతాలు చేస్తున్న మహిళలు.. మగవాళ్లకు ధీటుగా వ్యాపారం.. ఎక్కడో తెలుసా..?

డిజైన్లు వేస్తున్న కళాకారులు

డిజైన్లు వేస్తున్న కళాకారులు

Tirupati: ఇక్కడ చేతివృత్తులతో బ్రతికే కుటుంబాలే ఎక్కువ. పురుషులు కలపతో అద్భుతమైన శిల్పాలు చెక్కుతుంటే.. మహిళలు కలంకారికి ప్రాణం పోస్తున్నారు.

GT Hemanth Kumar, News18, Tirupati

కోడి కొక్కొరోకో అంటే.. సూర్యుడు ఉదయిస్తున్నాడనే సంకేతాన్ని తెలియజేస్తుంది. ప్రతి ఇంట్లో ఉదయం ప్రారంభం కావాలంటే మగువల చేతిలోని గాజుల సవ్వడి చేయాల్సిందే. ఆదిపరాశక్తి రూపం అయిన ఆడవాళ్లు.. ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో సేవలు చేస్తుంటారు. కుటుంబ భారాన్ని తమ భుజాల పై వేసుకొని ఎందరో నారి మణులు అన్ని పనుల్లోనూ దూసుకుపోతున్నారు. భర్తకు సహకారం అందిస్తున్నారు. తమకు ఉన్న పరిజ్ఞానంతో ఆర్థికంగా ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తున్నారు నేటి మహిళలు. కంపెనీల వైపు చూపు లేకుండా ఉన్న గ్రామంలోనే ఉపాధి వెతుకుంటూ ప్రాచీన కలంకారీ కళకు ప్రాణం పోస్తున్నారు. కలంకారి కళ (Kalamkari Art) పై నైపుణ్యం పొంది.., ఇతర గ్రామ మహిళలకు ఆదర్శనంగా నిలుస్తున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్న నినాదంతో ముందుకెళ్తున్నారు. నలుగురు మహిళలు కలసి కలంకారీ కళలో అద్భుతాలు సృష్టిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి జిల్లా (Tirupati District) లో మారుమూల పల్లె మాధవమాల గ్రామం. ఇక్కడ చేతివృత్తులతో బ్రతికే కుటుంబాలే ఎక్కువ. పురుషులు కలపతో అద్భుతమైన శిల్పాలు చెక్కుతుంటే.. మహిళలు కలంకారికి ప్రాణం పోస్తున్నారు. మగువలం మగవారితో సమానమే అంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. పురుషులకు సమానంగా సంపాదిస్తూ తోటి మహిళామణులకి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇది చదవండి: క్యాట్ వాక్ గురించి తెలుసు.. మరి బర్డ్ వాక్ అంటే ఎంటో తెలుసా..?


చేతివృత్తుల నైపుణ్యాభివృద్ది సంస్ధ, రాస్ స్వచ్చంద సంస్ధ ఆధ్వర్యంలో గత ఆరు నెలల క్రితం ఈ గ్రామంలో కలంకారీ వృత్తిపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు శ్రీకాళహస్తికి చెందిన కలంకారి వస్త్ర వ్యాపారి సుధీర్ సహకారం అందించారు. శిక్షణలో నైపుణ్యం ప్రదర్శించిన ఇరవై మందికి పైగా మహిళలు ప్రస్తుతం కలంకారిపై ఆధార పడి జీనోపాధి పొందుతున్నారు.‌ అంతే కాకుండా ఆర్ధికంగా రోజు రోజుకి అభివృద్ధి సాధిస్తున్నారు. వీరే కాకుండా తమ గ్రామం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళలకు కలంకారి కళపై శిక్షణ ఇస్తూ వారిని అండగా నిలుస్తున్నారు.


ఇది చదవండి: వీళ్ల చేతుల్లో ఏదో అద్భుతం ఉంది.. ఏం చెేసినా జీవం ఉట్టిపడాల్సిందే..!


ఏంఎస్సీ చదివిన వారు కూడా ఉద్యోగం రాకపోయే సరికి ఇంటికి వద్దనే ఉండి కలంకారీ కళలో రాణిస్తున్నట్లు ఇక్కడి యువతులు చెబుతున్నారు.  తమ గ్రామంలో కలంకారి కళపై శిక్ష ఇవ్వడంతో నేర్చుకున్నామని, ప్రస్తుతం శ్రీకాళహస్తి కలంకారీ వస్త్ర వ్యాపారుల వద్ద నుండి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని, వారికి కావాల్సిన విధంగా వస్త్రాలపై రంగులు అద్ది పంపుతున్నాంమని మహిళలు చెబుతున్నారు. ఇలా తమ గ్రామంలోనే ఉపాధి పొందడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. ఈ గ్రామంలో కలపతో శిల్పాలు చెక్కడం చాలా ఫేమస్.

First published:

Tags: Andhra Pradesh, Tirupati

ఉత్తమ కథలు