Lovers Fighting: ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు (Extramarital Affair) కామన్ అయ్యాయి. ఏ ఊళ్లో చూసినా ఇలాంటి వ్యవహారాలే కనిపిస్తున్నాయి. కుటుంబ కలహాలు, గొడవలు, దాడులు, హత్యలు ఇలా చాలా నేరాలకు ఇలాంటి సంబంధాలే కారణాలుగా నిలుస్తున్నాయి. తాత్కాలిక సుఖాలకు అలవాటు పడటం.. పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకోవడం జరుగుతోంది. దీంతో రెండు వైపుల వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పరువు కూడా పోతోంది. తాజాగా ఓ డాక్టర్ తన దగ్గర పనిచేస్తున్న మహిళతో ఎఫైర్ నడిపాడు. ఇద్దరికీ ఎక్కడో తేడా వచ్చింది. ఆమెను పట్టింకోవడం మానేశాడు. దీంతో ఇద్దరూ రోడ్డెక్కి రచ్చరచ్చ చేశారు. వాగ్వాదం కాస్తా కొట్టుకునేవరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని నెల్లూరు జిల్లాలో (Nellore District) ఓ వివాహేతర సంబంధం రోడ్డెక్కింది. నెల్లూరు నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావుకు తన దగ్గర పనిచేసత్న్న మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కొన్నేళ్లపాటు ఇద్దరి మధ్య ఎఫైర్ నడిచింది. ఐతే ఏం జరిగిందో ఏమో.. బాలకోటేశ్వరరావు.. ఆమె వద్దకు వెళ్లడం మానేశాడు. దీంతో ఆమె ఎందుకు రావడం లేదని అతని ఆస్పత్రికి వెళ్లి నిలదీసింది. తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించింది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన మహిళ కోటేశ్వరరావును చొక్కాపట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చింది. దీంతో ఇద్దరూ పరస్పరం కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే రోడ్డుపై కొట్టుకున్నారు. అనంతరం సదరు మహిళ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే రోడ్డుపై ఇద్దరూ కొట్టుకున్న వీడియో వైరల్ గా మారింది.
ఇటీవల ఇలాంటి ఘటనలో ప్రియుడు.. తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం., పెద్దకొండమర్రి గ్రామానికి చెందిన మల్లీశ్వరి.. భర్తతో మనస్పర్ధల కారణంగా పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నాళ్ళకు గ్రామా సమీపంలో ఉన్న మామిడి తోటలో కాపలా దారుడుగా ఉన్న పెద్ద పంజాణి మండలం దొరస్వామితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మరి సహజీవనం (Live in Relationship) చేసే స్థాయికి వెళ్ళింది. ఇద్దరు చిలకాగోరింకల్లా సహజీవనం చేస్తూ వచ్చారు.
కొంతకాలం వరకు బాగానే ఉన్న వారి బంధాన్ని అనుమానం అనే భూతం కమ్మేసింది. మల్లీశ్వరి ఎవరితోనో చనువుగా ఉంటోంది అంటూ తరచు గొడవకు దిగేవాడు. రోజు ఇలా గొడవపడుతున్న సందర్భంలో కోపోద్రిక్తుడైన దొరస్వామి.... చేతిలో ఉన్న కొడవలితో మల్లీశ్వరిపై దాడి చేసాడు. అక్కడ నుంచి పరారయ్యాడు దొరస్వామి. దింతో రక్తపు మడుగులో ఉన్న మల్లీశ్వరిని హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన మళ్లీశ్వరి తనువు చాలించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Extramarital affairs, Nellore Dist