Home /News /andhra-pradesh /

TIRUPATI LAST TWO DAYS HEAVY RUSH IN TIRUMALA WILL SATURDAY AND SUNDAY MORE INCREASE DEVOTEES NGS TPT

Tirumala: తిరుమలకు అనూహ్యంగా పెరిగిన రద్దీ.. సర్వ దర్శనానికి ఎంత టైం పడుతోంది అంటే?

 తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో పెరిగిన రద్దీ

Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో వెరిసిన శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు పొట్టెత్తారు. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. సర్వ దర్శనానికి సుమారు 15 గంటలకు పైగా పడుతోంది. అయితే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడానికి కారణం ఇదే.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India
    Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. ఆనందరూపుడై వెలసిన శ్రీవారి దర్శనానికి దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. స్వామి వారి దివ్య దర్శనం... సువర్ణ ఆశీస్సులు పొంది కోరిన కోర్కెలు తీరిన తరువాత.. తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. 


    ఇలా రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్త జనసంద్రంగా మారింది. ప్రస్తుతం ఇసుకేస్తే రాలనంత భక్త జనం ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి వెలుపల క్యూ కట్టారు. క్యూలైన్స్ లో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.


    ఇలా అనూహ్యంగా రద్దీ పెరగడానికి ప్రధాన కారణం.. వరుసగా సెలవులు రావడంతో దారులన్నీ తిరుమలవైపే ఉన్నాయి. శుక్రవారం రాఖీ పౌర్ణిమ సందర్భంగా కొండపై మరింత రద్దీ పెరిగింది. దీనికి రెండో శనివారం, ఆదివారం, స్వాతంత్ర్య దినోత్సవం ఇలా.. ఆగస్టు 15వ తేదీ వరకు సెలవులు ఉండటంతో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు.


    ప్రస్తుతం తిరుమల వెళ్లే వారికి.. అలాగే కొండపై వసతి గదులు దొరకడం కూడా కష్టంగా మారింది. చిన్న పిల్లలు, వృద్ధులతో వచ్చే వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని.. నెల రోజుల పాటు.. తప్పని సరి అనుకున్నవారు మినహా అంతా.. తిరుమల పర్యటను వాయిదా వేసుకోవడమే మంచిందని చెబుతోంది. అయినా రద్దీ తగ్గడం లేదు.


    తిరుమల కొండపైకి భక్తులు పోటెత్తుతున్నారు. అలిపిరి నడక మార్గం దగ్గర భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో ఉంది. దీంతోఅలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర వందలాది వాహనాలు బారులు తీరాయి. వచ్చే మూడు రోజుల పాటు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.


    గత రెండు రోజుల నుంచి కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. అయితే ఇవాళ, రేపు శని ఆదివారాలు కావడంతో.. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ రెండు రోజులు సర్వదర్శనానికి 20 గంటలకుపైగా సమయం పట్టొచ్చని భావిస్తున్నారు.


    ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63వేల 754 మంది దర్శించుకున్నారు. నిన్నశ్రీవారి హుండీకి 3.63 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. 30 వేల 790 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం పౌర్ణమి కావడంతో గరుడ వాహనంపై శ్రీవారు దర్శనం ఇచ్చారు.


    కరోనా కారణంగా గత రెండున్నరేళ్ల పాటు భక్తులకు.. శ్రీవారి దర్శనానికి దూరమయ్యారు. ప్రస్తుతం భక్తుల సంఖ్య క్రమేపీ పెంచిన టీటీడీ.. టైం స్లాట్ విధానంలో సర్వ దర్శనం టిక్కెట్లను జారీ చేస్తూ వచ్చింది. ఏప్రిల్ నెలలో ఒక్కసారిగా భక్తుల సంఖ్యా అమాంతం పెరిగింది. టైం స్లాట్ కౌంటర్ల వద్ద ఒక్కసారిగా తోపులాట జరగడంతో అనూహ్య రీతిలో టీటీడీ ఫిసికల్ క్యూ విధానాన్ని అమలు చేసింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు