శ్రీవారి లడ్డూ తయారీకి 'ఆవిన్' నెయ్యి...టీటీడీతో తమిళనాడు డైరీ ఒప్పందం

ప్రస్తుతం నెయ్యి టెండర్‌ని అవిన్ దక్కించుకుంది. లడ్డూ తయారీకి 7 లక్షల 24 వేల కిలోల నెయ్యిని సరఫరా చేయనుంది ఆవిన్ సంస్థ. దీని ద్వారా దాదాపు రూ. 23 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

news18-telugu
Updated: February 12, 2019, 10:13 PM IST
శ్రీవారి లడ్డూ తయారీకి 'ఆవిన్' నెయ్యి...టీటీడీతో తమిళనాడు డైరీ ఒప్పందం
లడ్డూ ప్రసాదం
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా తిరుమల దేవస్థానానికి ఎంతటి పేరు ప్రఖ్యాతులున్నాయో...శ్రీవారి లడ్డూ కూడా అంతే ఫేమస్..! నాణ్యమైన, రుచికరమైన ఆ ప్రసాదాన్ని వెంకన్న భక్తులు ఇష్టంగా తింటారు. లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం అదృష్టంగా భావిస్తుంటారు చాలా మంది భక్తులు. ఐతే లడ్డూ తయారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. లడ్డూ తయారీకి కపై ఆవిన్ నెయ్యిని వినియోగించనున్నారు. ఈ మేరకు తమిళనాడు సహకార పాల ఉత్పత్తిదారుల సంఘంతో ఒప్పందం చేసుకుంది.

నెయ్యి కోసం టీటీడీ ఏటా రెండుసార్లు టెండర్లు వేస్తుంది. ఒక్కో టెండరు వ్యవధి ఆరు మాసాలు పాటు ఉంటుంది. అముల్ పాల సంస్థ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద సంస్థగా పరిగణించే కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎమ్ఎఫ్) 2015 వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు టీటీడీకి నెయ్యిని సరఫరా చేసింది. ఆ తర్వాత బిడ్ మహరాష్ట్ర కంపెనీకి వెళ్లింది. ఇక ప్రస్తుతం నెయ్యి టెండర్‌ని అవిన్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో లడ్డూ తయారీకి 7 లక్షల 24 వేల కిలోల నెయ్యిని సరఫరా చేయనుంది ఆవిన్ సంస్థ. దీని ద్వారా దాదాపు రూ. 23 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఆవిన్ డైరీ.. తమిళనాడులో చాలా ఫేమస్..! తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లిమిటడ్ ఆ సంస్థను నిర్వహిస్తోంది. ఆవిన్ సంస్థ రోజూ దాదాపు 32 లక్షల లీటర్ల పాలను గ్రామీణ డెయిరీ నిర్వాహకుల నుండి సేకరిస్తోంది. 23 లక్షల 50 వేల లీటర్ల పాలను ప్యాకెట్‌ల రూపంలో విక్రయిస్తోంది. మిగిలిన పాలను పాలకోవ, నెయ్యి, మిల్క్‌షేక్, స్వీట్లు తదితర పాల ఉత్పత్తి తయారీకి వినియోగిస్తుంది. ఆవిన్ ఉత్పత్తులకు తమిళనాడుతో పాటు హంకాంగ్, ఖతార్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.

కాగా, తిరుపతిలో ప్రతి రోజూ లక్షా 50వేల లడ్డూ ప్రసాదాలను తయారుచేస్తారు. అందుకోసం లడ్డూపోటులో 200 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తారు. లడ్డూ తయారీ కోసం ప్రతి రోజు 10 టన్నుల మైదా పిండి, 10 టన్నుల చక్కెర, 700 కేజీల జీడిపప్పు, 150 కేజీల యాకులు, 300-500 లీటర్ల నెయ్యి, 500 కేజీల షుగర్ క్యాండీలు, 540 కేజీల ఎండు ద్రాక్ష వినియోగిస్తారు. తిరుపతి లడ్డూలను బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా ఉండేందుకు 2008లో జియోగ్రాఫికల్ ఇండికేష్ (జీఐ) ట్యాగ్‌కు దరఖాస్తు చేసింది టీటీడీ. 2009లో చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగం శ్రీవారి లడ్డూపై టీటీడీకి హక్కులను కల్పించింది. దీని ప్రకారం తిరుమల లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ తప్ప ఎవ్వరూ తయారుచేయడానికి వీల్లేదు


Published by: Shiva Kumar Addula
First published: February 12, 2019, 10:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading