Home /News /andhra-pradesh /

AP Municipal Elections: కుప్పంలో తమిళ దొంగఓటర్లు.. మున్సిపల్ ఎన్నికల్లో టెన్షన్ వాతావరణం..

AP Municipal Elections: కుప్పంలో తమిళ దొంగఓటర్లు.. మున్సిపల్ ఎన్నికల్లో టెన్షన్ వాతావరణం..

కుప్పంలో ఉద్రిక్తత

కుప్పంలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జరుగుతున్న రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కార్యకర్తలు, నేతలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జరుగుతున్న రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కార్యకర్తలు, నేతలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఇరుపార్టీ వర్గాలు మోహరించాయి. పోలీసులు టీడీపీ ఏజెంట్లను అడ్డుకుంటూ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే కుప్పంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు దొంగ ఓట్లు వేస్తున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

    ఇక దొంగ ఓట్లు వేసేందుకు తమిళనాడు నుంచి ప్రజలను తరలిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. 60 మంది తమిళులతో కుప్పం వచ్చిన బస్సును టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బస్సు అద్దాలను పగలగొట్టిన స్థానికులు.. డ్రైవర్ పై దాడి చేసి పోలీసులకు సమాచారమందించారు.

    ఇది చదవండి: ఏపీ రాజధానిపై త్వరగా తేల్చేస్తాం.. హైకోర్టు సీజే సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వ వాదనకు నో..



    కుప్పంతో పాటు పలుచోట్ల దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ నేతలు విజయవాడలో ఎస్ఈసీ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని.. దొంగ ఓట్లు వేయిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు అశోక్ బాబు, బొండా ఉమా, బోడె ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే టీడీపీకి కౌంటర్ గా వైసీపీకి కూడా ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని.. వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.

    ఇది చదవండి: “రాష్ట్రంలో అమ్మకానికో బడి..” జగన్ సర్కార్ పై పవన్ ఫైర్..


    తాజా పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేయడం ఎప్పుడూ చూడలేదని అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు ఇంత దారుణానికి దిగజారితే ప్రజలు తిరగబడే పరిస్థితికి వస్తుందని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేస్తోందని ఆరోపించారు. పోలీసులు కూడా దొంగలకు వంతపాడేలా వ్యవహరిస్తున్నారని.. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను అడ్డుకొని కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.

    ఇది చదవండి: ఏపీ ప్రభుత్వంపై కోర్టుకు RRR టీమ్... క్లారిటీ ఇచ్చిన దానయ్య... సీఎం జగన్ తో భేటీ...

    ఓటమి భయంతోనే వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. అధికార పార్టీకి ప్రజల మద్దతుంటే ఇలాంటి అక్రమాలకు పాల్పడాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. గెలుపు కోసం సీఎం జగన్ అడ్డదారులు తొక్కుతున్నారన్నారు.

    మీ నగరం నుండి (​తిరుపతి)

    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap local body elections, AP Politics, Chandrababu naidu, Municipal Elections, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు