Home /News /andhra-pradesh /

Krishnapatnam Anandaiah: కృష్ణపట్నంలో హైడ్రామా... మళ్లీ ఆనందయ్య అదృశ్యం

Krishnapatnam Anandaiah: కృష్ణపట్నంలో హైడ్రామా... మళ్లీ ఆనందయ్య అదృశ్యం

శుక్రవారం రాత్రి ఇంటిదగ్గర ఆనందయ్య

శుక్రవారం రాత్రి ఇంటిదగ్గర ఆనందయ్య

ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో (Andhra Pradesh)ఎక్కడ చూసినా కృష్ణపట్నం ఆనందయ్య (Krishnapatnam Anandaiah) మందుపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి కనిపించకుండా పోయారు.

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. గత పదిరోజులుగా ఎవరినోట విన్నా ఆనందయ్య టాపిక్ తప్ప మరొకటి లేదు. దీంతో ఇప్పుడు అందరికళ్లు ఆనందయ్యపైనే పడ్డాయి. వారం రోజుల క్రితం అదృశ్యమైన ఆనందయ్య.. శుక్రవారం రాత్రి తన స్వగ్రామానికి చేరుకున్నారు. అప్పటికే ఆనందయ్య ఆచూకి చెప్పాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఐతే ఆనందయ్య ఇంటికి రావడంతో ఊపిర పీల్చుకున్న గ్రామస్తులు.. ఆయనకు రక్షణగా ఇంటిముందే నిద్రించారు. ఐతే శనివారం తెల్లవారు జామున ఆనందయ్య మళ్లీ కనిపించకుండాపోయారు. ఐతే ఆనందయ్యను పోలీసులే ఇంటి నుంచి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున ఆయన్ను కృషఅణఫట్నం పోర్టుకు తరలించినట్లు సమాచారం. ఆనందయ్యకు భద్రత కల్పించడం కోసమే తీసుకెళ్తున్నట్లు పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆనందయ్యను తరలించడంపై కృష్ణపట్నం గ్రామస్తులు మండిపడుతున్నారు. శనివారం ఉదయం కూడా ఆనందయ్య ఇంటి వద్దకు స్థానికులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు అక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు గ్రామ సరిహద్దుల్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి స్థానికులనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు.

    ఇదిలా ఉంటే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత మందు పంపిణీ చేస్తానని ఆనందయ్య ప్రకటించారు. మందు పంపిణీ చేస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతిచ్చినా.. అవసరమైన మూలికలు లభించిన తర్వాతే మందును ఇస్తామని ఆనందయ్య స్పష్టం చేశారు. ఇప్పటికే ఆనందయ్య మందుపై ఆయూష్ అధికారులు, టీటీడీ ఆయుర్వేద వైద్యులు దీనిని పరిశీలించారు. ఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని స్పష్టం చేశారు. దీంతో మందుపై అందరికీ మరింత నమ్మకం పెరిగింది. అయితే ప్రస్తుతం CCRAS అధ్యయనం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఇది చదవండి: అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికెళ్లిన ప్రియుడు.. ఇద్దరినీ అలా చూసిన అమ్మాయి తండ్రి ఏం చేశాడంటే..



    మందుపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించడంతోనే లోతుగా అధ్యయం జరుగుతోంది అన్నారు. ఇప్పటికే CCRAS తన అధ్యయనం పూర్తి చేసిందని.. నివేదిక నేటికి సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆ నివేదికలో ఏముంది అన్నది ఇప్పుడు తీవ్ర ఆసక్తి పెంచుతోంది.

    ఇది చదవండి: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. కానీ మరో హెచ్చరిక


    మరోవైపు CCRAS నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశముంది. అన్నీ బాగుంటే సోమవారం నుంచే మందును పంపిణీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆనందయ్య మందుకు ఒకసారి క్లియరెన్స్ రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆనందయ్య మందుకు విపరీతమైన డిమాండ్ వస్తున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ దందాను కూడా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

    మీ నగరం నుండి (​తిరుపతి)

    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    Published by:Purna Chandra
    First published:

    Tags: Anandaiah corona medicine, Andhra Pradesh, CORONA MEDICINE

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు