హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Krishnapatnam: కరోనా మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చిన ఆనందయ్య... మళ్లీ ఎప్పుడంటే..!

Krishnapatnam: కరోనా మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చిన ఆనందయ్య... మళ్లీ ఎప్పుడంటే..!

బొనిగి ఆనందయ్య (ఫైల్)

బొనిగి ఆనందయ్య (ఫైల్)

ప్రస్తుతం కృష్ణపట్నంలో ఆనందయ్య (Krishnapatnam Anandaiah) ఇస్తున్న ఆయుర్వేద మందు పంపిణీ నిలిచిపోయింది. దీంతో పునఃప్రారంభానికి సంబందించి పలు వార్తలు వస్తున్నాయి.

  ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కృష్ణఫట్నం ఆనందయ్య ఇచ్చే కరోనా మందు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందుపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది. ఇప్పటికే ఆయూష్ అధికారులు, టీటీడీ ఆయుర్వేద వైద్యులు దీనిని పరిశీలించారు. ఐసీఎంఆర్ కూడా అధ్యయనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మందుపై అధికారిక అధ్యయనం జరుగుతుండటం, కృష్ణపట్నంకు వేలాది మంది వస్తుండటంతో ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఐతే శుక్రవారం నుంచి మందు పంపిణీ ప్రారంభిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆనందయ్య స్పందించారు. ప్రస్తుతం ఆయుర్వేద మందును పంపిణీ చేయడం లేదని.. ప్రభుత్వం ప్రస్తుతం మందు పంపిణీని నిలిపేసిందన్నారు. అలాగే తన దగ్గర మూలికలు కూడా స్టాక్ లేవని.. ప్రభుత్వం అనుమతిచ్చిన తర్వాత.. మూలికలు అందుబాటులోకి వస్తే పంపిణీని ప్రారంభిస్తానని తెలిపారు. అప్పటివరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేశారు.

  కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో సమర్థవంతంగా పని చేస్తుందని చాలామంది నమ్ముతున్న ఆనందయ్య మందుపై అధ్యయనం కొనసాగుతోంది. తాజాగా ఈ మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తయ్యింది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు రెస్ట్రోపెక్టివ్ స్టడీని ఆయుర్వేద వైద్యులు చేసిన నివేదిక అందజేశారు. మందు తీసుకున్న 570 మందిని ఫోన్లో సంప్రదించిన వైద్యులు.. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. మలిదశ ప్రయోగాలకు అవసరమైన అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. సీసీఆర్ఏఎస్ తదుపరి ఆదేశాలు అందిన వెంటనే తర్వాతి రెండో దశ ప్రయోగాలు ప్రారంభించనున్నారు. సుజన్‌ ల్యాబ్‌లో జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. సుజన్‌ లైఫ్ ల్యాబ్‌ నుంచి 15 రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది.

  ఇది చదవండి: ఏటీఎంకు వెళ్లినప్పుడు ఇలా అస్సలు చేయకండి... లేదంటే మీ క్యాష్ గోవిందా...


  ఆనందయ్య మందుపై మరో రెండురోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు టీటీడీ పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పటికే ఆనందయ్య కుటుంబంతో మాట్లామన్న చెవిరెడ్డి.. మందుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ ఔషధం పట్ల పాజిటివ్ రిపోర్ట్ వస్తే మందు తయారీ, పంపిణీకి ముద్ధ ప్రతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వైపు ఆనందయ్య పై తీవ్ర ఒత్తిడి ఉందని.. ఆయనతో కొందరు ప్రైవేటుగా మందు తయారు చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక అధికార పార్టీ నేతలు.. ఆనందయ్యను బంధించి వారికి కావాల్సిన వారికి మందులు తయారు చేయించుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

  ఇది చదవండి: ఈ ఆకు పసరుతో కరోనా ఖతం.., వైరస్ ను సవాల్ చేస్తున్న బ్రదర్స్


  విపక్ష నేతల విమర్శలు ఎలా ఉన్నా.. ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. తనపై తీవ్ర ఒత్తిడి ఉందని.. 30 ఏళ్లుగా తాను మందు పంపిణీ చేస్తున్నానని.. కానీ ఇప్పుడు ఫార్ములా ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని.. అందుకే ప్రభుత్వం ఒత్తిడి లేకుండా చూడాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

  ఇది చదవండి: లక్ అంటే ఈ రైతుదే.., పొలంలో కోటిరూపాయల వజ్రం


  మరోవైపు ఆనందయ్య ఆచూకి తెలపాలంటూ కృష్ణపట్నం గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు.ఇప్పటికే భారీ సంఖ్యలో కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు.. ఆయన్ను అక్కడ బంధించి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. గత వారం రోజులుగా ఆనందయ్య ఆచూకీ కనపడనీయకుండా చేస్తున్నారని.. ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించి.. ఉచితంగా మందులు తాయరు చేస్తున్న ఆయన్ను ఎందుకు బంధించారని ప్రశ్నిస్తున్నారు. కృష్ణపట్నం పరిశరాల్లో చాలా చోట్ల కరోనా కేసులు లేవని.. దానికి కారణం ఆయన ఇస్తున్న మందే అంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anandaiah corona medicine, Andhra Pradesh, Ayurvedic medicine

  ఉత్తమ కథలు