GT Hemanth Kumar, Tirupathi, News18
Kanipakam: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి (Varasidhi Vinayaka Swamy) వారు వెలసిన పుణ్యధామం కాణిపాకం (Kanipakam). నిత్యం వేలాది భక్తులతో రద్దీగా ఉండే స్వామి వారి ఆలయాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధి పనులు., కుంబాభిషేకం నిర్వహణ తరువాత వరుస వివాదాల వలయంలో ఉగిసలాడుతున్నారు అధికారులు. నెలవైన స్వామి వారి ఆలయంలో సత్యప్రమాణాలకు విధులు నిర్వహించే ఆలయ సిబ్బంది చేతివాటం., అత్యాశ వలన ఆలయ ప్రతిష్ట భంగం కలుగుతోందని భక్తులు ఆరోపించారు.. స్వామి వారి ఆలయంలో చేసే అవకతవకలు చాలదన్నట్లు వెంకన్న ఆలయంలో చేతులు పెట్టాలని చుసిన ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక బంగారు విభూది పట్టి., ఇతర ఆభరణాలు మాయమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో సంబంధిత అర్చకులపై చర్యలు తూతూ మంత్రంగా తీసుకున్నారని భక్తుల ఆరోపణ.
వరుస వివాదాలు చుట్టూ ముడుతున్నా... ఆయా విభాగాధిపతుల బదిలీలు మాత్రం కనిపించలేదు. ఆరోపణలు ఎదుర్కొన్న అర్చకులు., ఉద్యోగులపై చర్యలు మాత్రమే తీసుకున్నారు. ఘటన జరిగిన అదే సమయంలో ఇంచార్ట్లుగా ఉన్న విభాగాధిపతులపై బదిలీ వేటు వెయ్యలేదు. గతంలో ఉన్న ఈవో అంతర్గత బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొన్ని సిఫార్సుల కారణంగా.. ఆగిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వినాయక స్వామివారి మూలవిరాట్ కు నిత్యం కైంకర్యాలు నిర్వహించడానికి కావలసిన అర్చకులకంటే... తక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. కొంతమంది అర్చకులను అంత్రాలయంలోని మూలవిరాట్‌కు కైంకర్యాలు చేయడానికి., కైంకర్యాలు నిర్వహిస్తున్న అర్చక స్వాములు వివిధ విభాగాలకు తరలింపు జరగాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్న ఆలయ ఈవో ప్రక్షాళన దిశగా ఈ ప్రణాళికను రూపొందించడానికి అన్ని విధాల ఏర్పాటు చేశారని ఇంతలో వారికి ట్రాన్స్ఫర్ కావడంతో అంతర్గత బదిలీలు ఆగిపోయాయి.
ఇదీ చదవండి : శ్రీవారి విమాన గోపురానికి బంగారు తాపడం.. భక్తులను భాగస్వామ్యం చేయాలని టీటీడీ నిర్ణయం
ఇక ఆలయంలో షిఫ్ట్ విధానంలో విధులు నిర్వహించేలా కాణిపాక ఆలయంలో ప్రక్షాళన జరుగుతుందా జరగదా అనేది తేలడం లేదు. ఆలయంలో పనిచేసే చాలామంది సిబ్బది ఒకే స్థానంలో పనిచేయడం ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. అయిన వారికి ఆకుల్లో కానివారికి కంచంలో పెట్టినట్లు పరిస్థితి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.
కొన్ని సంవత్సరాలుగా వినాయక స్వామివారి మూలవిరాట్‌కు కొంతమంది అర్చకులు మాత్రమే కైంకర్యాలు నిర్వహిస్తు వస్తున్నారు. అనంతరం స్వామివారి ఆలయంలో అర్చకుల కొరత ఉన్నదని ఆలయ అధికారులు దేవాదాయ శాఖకు తెలపడంతో నూతనంగా కొంతమంది అర్చకులను దేవస్థానం అధికారులు నియమించుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాపీ లో కొంతమంది అర్చకులు మూలవిరాట్ కు కైంకర్యాలు చేయాలి.. మరో కొందరు అర్చకులు షోడస గణపతి వద్ద పనిచేయాలని ఆర్డర్ కాపీ లో ఎక్కడ ప్రత్యేకంగా లేదు. కానీ కొంతమంది అర్చకులు ఆలయ అధికారులను తమ గుప్పెట్లో ఉంచుకొని.. స్వామివారి అంతరాయం లో మూల విరాట్ కు పూజలు చేసే భాగ్యం కలుగకుండా అడ్డుకుంటున్నారట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chittoor