హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati: తిరుపతిలో స్టార్ హీరో సినిమా షూటింగ్... గుండాల కోనలో భారీ సెట్టింగ్..!

Tirupati: తిరుపతిలో స్టార్ హీరో సినిమా షూటింగ్... గుండాల కోనలో భారీ సెట్టింగ్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సినిమా షూటింగ్ లకు వేదికగా తిరుపతి మారుతోంది. భారతీయుడు-2 చిత్రం 6  రోజుల పాటు ఈ గుండాల కోన వద్దనే చిత్రీకరించారు. పక్క పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా ఈ స్పాట్ లో సెట్టింగ్స్ వేశారు. గుండాల కొనాలో సైతం చిత్రాన్ని చిత్రీకరించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

సినిమా షూటింగ్ లకు వేదికగా మారుతోంది ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి. తిరుమల తిరుపతి దేవస్థానంకు నిత్యం వేలాది భక్తులు తరలివస్తుంటారు. సామాన్య భక్తులతో పాటు... సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా తిరుమలకు వస్తుంటారు. అయితే ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి సినిమా షూటింగులకు అడ్డాగా మారుతుంది. నట విశ్వరూపం  కమలహాసన్ భారతీయుడు-2 సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది.

శ్రీవారి పాదాల చెంత వెలసిన నగరం తిరుపతి . ఇక్కడ ఎన్నో జీవ వైవిధ్య సంపదలు., కన్నులకు పండుగను ఇచ్చే పచ్చని కొండలు., సుందర జలపాతాలు ఉన్న ప్రాంతంగా ప్రాచుర్యం పొందింది తిరుపతి. జిల్లాలో అధిక భాగం ఉన్న కొండల్లో నిత్యం ధారలుగా జాలువారే జలపాతాలను చుసేందుకు పర్యాటకులు., స్థానికులు అధికంగా చొరవ చూపుతారు. ముఖ్యంగా తలకోన., మూలకోన., కైలాస కోన., కైగల్ వాటర్ ఫాల్స్ అంటూ ఎన్నో ఈ జిల్లాలో ఉన్నాయి.

ప్రస్తుత సినీ పరిశ్రమ అధికభాగం విదేశాల్లో షూటింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు సినీ బృందం. నేటివిటీకి సంభంధం లేకుండా....కథకు తగ్గట్టు లేని సమయంలో సైతం విదేశాల్లో ఎన్నో సినిమాలు తీస్తున్నారు. ప్రస్తుతం సినిమాల్లో సైతం నేటివిటీ కోరుకుంటున్నారు ప్రేక్షక దేవుళ్ళు. అందుకు తగట్లు ఏర్పాట్లను సైతం చేస్తున్నారు.

ప్రస్తుతం తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో యాక్షన్ కింగ్ మోహన్ బాబు ., మంచు మనోజ్., మంచు విష్ణు సినిమాలు అధికంగా నిర్మాణం అవుతుంటాయి. లొకేషన్ బాగుంటే సినిమా  లోకల్ నేటివిటీకి తగ్గట్లు సినిమా నిర్మాణం చేయొచ్చు అంటూ కొందరు దర్శకులు రుజువు చేస్తున్నారు. తాజాగా తిరుపతి షూటింగ్ స్పాట్గా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇక తిరుపతికి సమీపంలోని రాయలచెరువు., రామచంద్రపురం సమీపంలో సినిమాల సందడి కనిపిస్తోంది. చుట్టూ కొండలు., కొండల క్రింద పచ్చని వ్యవసాయం సాగుతుండటమే కాకుండా ఇక్కడ గుండాల కోన అందాలు దర్శకుల కళ్ళను ఆకర్షించడంతో షూటింగ్ చేస్తున్నారు.

తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్నా భారతీయుడు-2 చిత్రం 6  రోజుల పాటు ఈ గుండాల కోన వద్దనే చిత్రీకరించారు. పక్క పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా ఈ స్పాట్ లో సెట్టింగ్స్ వేశారు. గుండాల కొనాలో సైతం చిత్రాన్ని చిత్రీకరించారు. ఇక బి కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా లోకనాయకుడు కమలహాసన్ కథానాయకుడిగా తెరక్కేక్కిన శ్రీకారం సినిమా చిత్రీకర ముఖ్యమైన సన్నివేశాలన్ని రామచంద్రాపురంలోనే  చిత్రీకరించారు.

తిరుపతికి 8 కిలోమీటర్ల సమీపంలోని రామచంద్రపురం మండలం పివి పురం పంచాయతీలోని గుండాల జలపాతం సందర్శకులను ఆకర్షిస్తోంది. చుట్టూ కొండలు... దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జలపాతం అందరిని మంత్రముగ్ధులను చేస్తుంది. పివి పురం నుండి సరిగ్గా 2 కిలోమీటర్లమేర వాహనాల ద్వారా లోపలి వెళ్ళగానే ఎత్తైన కొండా వద్దకు చేరుకుంటాం. ఆ కొండ వద్ద చేరుకోగానే వాహనాలను పార్కింగ్ చేసి దాదాపు 500 మీటర్ల దూరం అటవీ ప్రాంతంలో ప్రయాణం చేస్తే గుండాల కోన వస్తుంది. ఆకాశాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చినట్లు నిత్యం ఇక్కడ జలధార పర్యాటకులకు కనువిందు చేస్తుంది. చుట్టూ కొండల నడుమ మధ్యలో జలపాతం ఉండటం అందరిని ఆకర్షిస్తుంది. తలకోన., కైలాస కోన వంటి ప్రాంతాలకు దీటుగా ఉండే ఈ ప్రాంతాన్ని సినిమా వాళ్ళు గుర్తించారని... పర్యాటక శాఖగుర్తించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.

First published:

Tags: Indian 2, Kamal haasan, Local News, Tirupati

ఉత్తమ కథలు