హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Disha App in Delhi: ఢిల్లీలో దిశ యాప్ రక్షణ... తెలుగు యువతిని కాపాడిన ఆంధ్రా పోలీసులు...

Disha App in Delhi: ఢిల్లీలో దిశ యాప్ రక్షణ... తెలుగు యువతిని కాపాడిన ఆంధ్రా పోలీసులు...

యువతితో ఎస్పీ అన్బురాజన్

యువతితో ఎస్పీ అన్బురాజన్

Disha App: రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు, యువతులు యాప్ ను వినియోగిస్తున్నారు. తాజాగా దిశయాప్.. దేశరాజధాని ఢిల్లీలో (Delhi) ఉన్న తెలుగు యువతిని రక్షించింది.

GT Hemant Kumar, Tirupati, News18

దిశ యాప్. ఆపదలో ఉన్న మహిళలను క్షణాల్లో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యాప్. ఆపదలో ఉన్నవారు ఈ యాప్ లో పోలీసులను సంప్రదిస్తే నిముషాల్లో ఘటనాస్థలికి చేరుకొని బాధితులను కాపాడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు, యువతులు యాప్ ను వినియోగిస్తున్నారు. తాజాగా దిశయాప్ (Disha App).. దేశరాజధాని ఢిల్లీలో (Delhi) ఉన్న తెలుగు యువతిని రక్షించింది. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కడప జిల్లా (Kadapa District) పోరుమామిళ్లకు చెందిన యువతి ఉపాధ్యాయ నియామక పరీక్ష కోసం ఢిల్లీ వెళ్లింది. ఈనెల 10వ తేదీన ఏపీ ఎక్స్ ప్రెస్ (AP Express) లో విజయవాడ (Vijayawada) నుంచి ఒంటరిగా బయలుదేరింది. రైలులో ఢిల్లీకి చెందిన దంపతులు పరిచయమయ్యారు. తనకు ఢిల్లీలో స్నేహితురాలు ఉందని ఆమె ఇంటికి వెళ్తున్నట్లు వారికి చెప్పింది. 11వ తేదీ ఉదయం ఢిల్లీలో ట్రైన్ దిగిన తర్వాత ఆమె స్నేహితురాలికి ఇంటికి వెళ్లే విధంగా ఆ దంపతులు.. ఆమెను ఓ ఆటో ఎక్కించారు. యువతి వెళ్లాల్సిన ప్రాంతాన్ని ఆటోవాలాకు చెప్పారు.

మార్గ మధ్యలో ఆమెను ఆటో ఎక్కించిన దంపతులకు కాల్ చేయాలని డ్రైవర్ కోరాడు. ఐతే వాళ్ల నెంబర్ తన దగ్గర లేకపోవడంతో స్నేహితురాలికి ఫోన్ చేసి డ్రైవర్ కి ఇచ్చింది. యువతిని ఆటో ఎక్కించిన వారే మాట్లాడుతున్నారని భావించిన ఆటోడ్రైవర్.. కోడ్ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన స్నేహితురాలు.. యువతిని అప్రమత్తం చేసింది. వెంటనే ఆటో దిగిపోవాలని హెచ్చరించింది. ఆటో ఆపాలని చెప్పినా వినిపించుకోని డ్రైవర్ యువతితో గొడవపడ్డాడు. కిరాయి డబ్బులివ్వాలని నిలదీయడంతో పోలీసుల వద్ద ఇస్తానంటూ యువతి సమాధానమిచ్చింది. దీంతో ఆటోతో సహా అతడు పరారయ్యాడు.


ఇది చదవండి: మోసాల్లో ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’... వీళ్లను నమ్మితే దిమ్మతిరిగి బొమ్మ కనబడుద్ది..!


అక్కడి నుంచి తిరిగి రైల్వే స్టేషన్ కు వెళ్లిన యువతి.. 'దిశ' యాప్ ఓపెన్ చేసి జిల్లాలోని పోలీస్ అధికారుల నెంబర్లలో వెంటనే కనిపించిన జిల్లా ఎస్.పి అన్బురాజన్ ఫోన్ నెంబర్ కు కాల్ చేసి ఆపదలో ఉన్నానని రక్షించాలని వేడుకుంది. తక్షణమే స్పందించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్.., దిక్కుతోచని స్థితిలో ఉన్న యువతికి ఢిల్లీ లో ఉన్న స్వచ్చంద సంస్థ నిర్వాహకుడి ద్వారా సాయమందేలా చొరవ తీసుకున్నారు. ఢిల్లీలోని 'మిషన్ ముక్తి ఫౌండేషన్' స్వచ్చంద సంస్థ డైరెక్టర్ వీరేందర్ కుమార్ సింగ్ తో మాట్లాడిన 'దిశ' డి.ఎస్.పి రవి కుమార్.., ఆమెను పరీక్షా కేంద్రం వద్ద దించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే పరీక్ష ముగిసిన అనంతరం 11వ తేదీ రాత్రి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లి విజయవాడ వచ్చేందుకు స్వర్ణజయంతి ఎక్స్ ప్రెస్ ఎక్కించారు. ఆమె క్షేమంగా స్వస్థలం చేరుకునేవరకు పోలీసులు పర్యవేక్షించారు.

ఇది చదవండి: ప్రజల కోసమే ఈ నిర్ణయం.., సినిమా టికెట్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి


ఆపదలో ఉన్న మహిళలకు 'దిశ' యాప్ వజ్రాయుధం లాంటిదని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. జిల్లాలోని మహిళలందరూ 'దిశ' యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని ఎస్.పి సూచించారు. క్షణాల్లో పోలీసు సాయంఅందుతుందని, ఘటనా స్థలానికి చేరుకుని కాపాడతారన్నారు. జిల్లా ఎస్పి కేకేఎన్ అన్బురాజన్ సాయం జీవితాంతం మరువలేనని బాధిత యువతి తెలిపింది. జీవితాంతం పోలీసు శాఖకు రుణపడి ఉంటానని.., మహిళలు 'దిశ' యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆపదలో 'దిశ' యాప్ బ్రహ్మాస్త్రంలా పని చేస్తుందని..., 'దిశ' యాప్ తన ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవడం వల్లే దేశ రాజధాని ఢిల్లీ లో సైతం తనకు పోలీసు అధికారుల సాయం పొందగలిగానని ఆమె వివరించింది.

గతంలో కడప ఎస్పీ అన్బురాజన్.. యుథియోపియా నుంచి తన ప్రియుడి కోసం వచ్చి అతడు చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో యువతికి అండగా నిలిచారు. ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆమెను క్షేమంగా స్వదేశానికి పంపించారు.

First published:

Tags: Andhra Pradesh, AP Police, Disha App, Kadapa

ఉత్తమ కథలు