• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • TIRUPATI KADAPA POLICE FORMED GREEN CHANNEL TO TRANSPORT OXYGEN FOR KARNATAKA TO KADAPA DISTRICT IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Andhra Pradesh: పోలీసులు తలచుకుంటే ఏదైనా సాధ్యమే... అక్సిజన్ ఎలా తీసుకొచ్చారో చూడండి...

Andhra Pradesh: పోలీసులు తలచుకుంటే ఏదైనా సాధ్యమే... అక్సిజన్ ఎలా తీసుకొచ్చారో చూడండి...

ఆక్సిజన్ తరలిస్తున్న పోలీసులు

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత అనే మాట వినిపిస్తోంది. రుయా ఆస్పత్రి ఘటన తర్వాత ఆక్సిజన్ నిముషం లేటైనా ఎంత నష్టం జరుగుతుందో అందరికీ అర్ధమైంది.

  • Share this:
    ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత అనే మాట వినిపిస్తోంది. రుయా ఆస్పత్రి ఘటన తర్వాత ఆక్సిజన్ నిముషం లేటైనా ఎంత నష్టం జరుగుతుందో అందరికీ అర్ధమైంది. ఈ నేపథ్యంలో పలు ఆస్పత్రుల్లో చివరి నిముషంలో ఆక్సిజన్ అందడం.. రోగులు, వారి బంధువులు టెన్షన్ పడటం జరుగుతున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సకాలంలో ఆక్సిజన్ అందిస్తున్నారు. ఎక్కడికక్కడ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వందల కిలోమీటర్ల నుంచి ఆక్సిజన్ ను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు దాదాపు నాలుగుసార్లు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ తరలించారు. తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆక్సిజన్ కొరత ఏర్పడగా.. ఏకంగా 330 కిలోమీటర్ల దూరం నుంచి ఎలాంటి ఆలస్యం లేకుండా ఆక్సిజన్ తరలించారు. కడప నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడే అవకాశముండటంతో కర్నాటక రాష్ట్రంలోని తోరణగల్లు జిందాల్ ఫ్యాక్టరీ నుండి కడపకు ఆక్సిజన్ ట్యాంకర్ ను చేర్చారు.

    కడప జీజీహెచ్ కు కర్ణాటకలోని తోరణగల్లు జిందాల్ ఫ్యాక్టరీ నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు తక్కువగా ఉండటంతో డాక్టర్లు, రోగులు, వారి బంధువులు ఆందోళన చెందారు. తోరణగల్లు నుంచి కడపకు ట్యాంకర్ రావడానికి 9గంటల సమయం పడుతుంది. ఈలోగా ఏం జరుగుతుందోనని అందరూ టెన్షన్ పడ్డారు. విషయాన్ని కడప ఎస్పీ అన్బురాజన్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే కర్ణాటక అధికారులతో మాట్లాడిన ఆయన... తోరణగల్లు నుంచి కడప వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. మార్గమధ్యంలో ఎలాంటి అంతరాయం కల్గకుండా, ఆలస్యం కాకుండా పోలీసుల సహకారం అందించారు. జి.పి.ఎస్ ట్రాకింగ్ సిస్టంతో సంబంధాలు తెగిపోకుండా... గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎస్కార్ట్ తో ఆక్సిజన్ ట్యాంకర్ ను జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు.

     ఇది చదవండి: బ్లాక్ లో కొవిడ్ వ్యాక్సిన్..? అక్కడి నుంచే దారిమళ్లుతున్నాయా..?


    దాదాపు 330 కి.మీ దూరం ఉన్న తోరణగల్లు నుండి కడప చేరుకోవాలంటే 9 గంటల పైగా సమయం పడుతుంది. అలాంటిది ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తూ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి కేవలం 6 గంటల్లో జిల్లా పోలీసులు ట్యాంకర్ వాహనం వెంటే ఉంటూ కడపకు చేర్చారు. సాయంత్రం 5 గంటలకే ఆక్సిజన్ ట్యాంకర్ ఆస్పత్రి కి చేరడంతో ఇటు కోవిడ్ పేషెంట్లు, వారి సహాయకులు.. ఊపిరి పీల్చుకున్నారు. రిమ్స్ కు ప్రతిరోజూ రావాల్సిన ఆక్సీజన్ నిల్వల వాటాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో తెచ్చేందుకు పోలీసులు జాగ్రత్త పడ్డారు. చెక్ పోస్ట్ ల వద్ద ముందస్తు గా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ బారికేడ్ లను తొలగించడం ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగంగా ట్యాంకర్ వెళ్లేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి.

    ఇది చదవండి: ఏపీలో వ్యాక్సినేషన్ కు సీఎం జగన్ యాక్షన్ ప్లాన్.., ఆ విషయంలో మరింత ముందుకు..

    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు