Home /News /andhra-pradesh /

Kuppam-Jr.NTR: కుప్పంలో చంద్రబాబుకు మరో తలనొప్పి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా చేయడానికి కారణం ఇదేనా..?

Kuppam-Jr.NTR: కుప్పంలో చంద్రబాబుకు మరో తలనొప్పి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా చేయడానికి కారణం ఇదేనా..?

చంద్రబాబు, ఎన్టీఆర్ (ఫైల్)

చంద్రబాబు, ఎన్టీఆర్ (ఫైల్)

కుప్పం (Kuppam) టీడీపీలో (Telugu Desham Party) జరుగుతున్న తాజా పరిణామాలు చంద్రబాబుకు (Chandra Babu Naidu) మింగుడు పడటం లేదట. ఇందుకు ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ Jr.NTR) అంశం. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే.. పార్టీ బలపడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయట. పార్టీలో పదే పదే అయన పేరును బలంగా వినపడటమే కాకుండా ఆయన ఫ్యాన్స్ కుప్పంలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, Tirupathi, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కుప్పం. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కుప్పం నియోజకవర్గం (Kuppam) హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి. వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవాలి. అధికార పార్టీ వ్యూహాలు పూర్తి స్థాయిలో సఫలీకృతం అయ్యాయనే చెప్పాలి. కాపు, కమ్మ ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో తిరుగులేని చంద్రుడిలా చంద్రబాబు విజయం సాధిస్తూ వస్తున్నారు. ఏ ఎన్నిక అయినా ఇక్కడ చంద్రబాబుదే ఘన విజయం. స్యయంగా వెళ్లి నామినేషన్ వేయకున్నా.., ప్రచారం చేపట్టకున్నా కుప్పంలో టీడీపీ జెండా ఎగురుతూ వచ్చేది. ఇదంతా మునుపటి మాట ఇప్పుడు అందుకు భిన్నంగా వైసీపీ పార్టీ కుప్పంలో పాగా వేసింది. ఇదంతా ఓ ఎత్తు అయితే పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు చంద్రబాబుకు మింగుడు పడటం లేదట.

  ఇందుకు ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) అంశం. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే.. పార్టీ బలపడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయట. పార్టీలో పదే పదే అయన పేరును బలంగా వినపడటమే కాకుండా ఆయన ఫ్యాన్స్ కుప్పంలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. నారా భువనేశ్వరి అంశంపై చెలరేగిన వివాదం ఆ కుటుంబంలోనే చీలికలు తెచ్చేలా చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.

  ఇది చదవండి: ఏపీలో మళ్లీ తెరపైకి కొత్త జిల్లాలు.. ప్రభుత్వ వ్యూహం ఇదేనా..?


  తన తాత స్థాపించిన పార్టీ కావడంతో 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ గెలుపు కోసం ఎన్టీఆర్ ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఓటమి తప్పలేదు. అనంతరం ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారు. అదే సమయంలో లోకేష్ తెరపైకి రావడంతో ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. ఎన్టీఆర్ ను కావాలనే పక్కనబెట్టారన్న చర్చ జోరుగా జరిగినా... ఆయన మాత్రం అవేమీ పట్టించుకోలేదు.

  ఇది చదవండి: "జగన్ మామా మమ్మల్ని ఆదుకోండి.." ఈ చిన్నారులకు వచ్చిన కష్టమేంటో తెలుసా..?


  2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ సైకిల్ పార్టీ ప్రభావం చూపకపోవడంతో ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలన్న డిమాండ్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుప్పంలో చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు బలంగా వినిపించాయి. ఆయన రాకతోనే . పార్టీ బలపడుతుందనేది తమ్ముళ్ల వాదన. ఆదివారం ఎన్టీఆర్ చిత్రంతో కూడిన భారీ జండా కుప్పంలో ఎగురవేశారు ఫ్యాన్స్.

  ఇది చదవండి: నాలుగు జోన్లుగా ఆంధ్రప్రదేశ్..? సీఎం జగన్ మాటల్లో అర్ధం ఇదేనా..?


  నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో జరిగిన దుమారంతో జూనియర్ ఎన్టీఆర్ కు సంభంధం లేకున్నా... వివాదమంతా ఆయన చుట్టే తిరుగుతోంది. భువనేశ్వరి పట్ల వైసీపీ నాయకులూ అనుచిత వ్యాఖ్యలు చేసినా జూనియర్ ఎన్టీఆర్ నుంచి సరైన స్పందన రాలేదనేది టీడీపీ నేతల వర్గాల వాదన. అందుకు ఆజ్యం పోస్తూ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమేరేపాయి. వల్లభనేని వంశీ., కోడలి నానిని కంట్రోల్ చేయాలని చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారి తీయడమే కాకుండా టీడీపీపైఅక్కసు వెళ్లగక్కే స్థాయికి చేరింది.

  ఇది చదవండి: జూ.ఎన్టీఆర్ తో స్నేహంపై కుండబద్దలు కొట్టిన కొడాలి నాని.. నందమూరి కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు..


  మొన్న జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ అభిమానులు పనిచేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఆదివారం కుప్పంలోని ఎన్ఆర్ఎం సినిమా హాల్ లో జై లవ కుశ సినిమాను స్పెషల్ షో వేయించుకున్నారు అభిమానులు. థియేటర్ వద్ద డాన్సులు వేయడమే కాకుండా.. 'బాబులకు బాబు తారక్ బాబు అంటూ' గట్టిగా నినాదాలు చేశారు. అంతేకాదు “సీఎం ఎన్టీఆర్” అంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఈ ఘటనపై టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతన్నారట. ఇదే విషయాన్ని చంద్రబాబు, నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. దీనిపై అటు చంద్రబాబుగానీ, ఇటు ఎన్టీఆర్ గానీ స్పందిస్తారా..! లేదా అన్నది వేచి చూడాలి.

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu naidu, Jr ntr, Kuppam, Tdp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు