Janasena Supports YSRCP: ఆ విషయంలో వైసీపీకి జనసేన సపోర్ట్.. స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్..

బద్వేలు ఉపఎన్నిక నుంచి తప్పుకున్న జనసేన

త్వరలో జరగనున్న కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికపై (Badvel By Election) జనసేన పార్టీ (Janasena Party) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ పోటీ చేయాలని పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) కొన్ని రోజులుగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party).. జనసేన పార్టీకి (Janasena Party) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇటు వైసీపీ మంత్రులు, అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), ఇతర నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో రాజకీయాలు వేడెక్కాయి. రోడ్ల దుస్థితిపై జనసేన పోరాటం ప్రారంభించడం, సినిమా టికెట్ల విషయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో రెండు పార్టీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో ఓ విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీకి పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. ఆ అంశంలో జనసేన పూర్తి సహకారం అందిస్తుందని పవన్ ప్రకటించారు. అదే త్వరలో జరగబోయే బద్వేలు ఉపఎన్నిక (Badvel By Election). బద్వేలు ఉపఎన్నిక పోటీ నుంచి జనసేన తప్పుకుంటున్నట్లు స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

  శనివారం అనంతపురం జిల్లా కొత్తచెరువు వద్ద శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి, ఇతర అంశాల్లో వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కల్యాణ్.. బద్వేలు ఉపఎన్నిక విషయంలో వైసీపీకి మద్దతు పలికారు. ఉపఎన్నికలో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధ పోటీ చేస్తున్నందున పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పవన్ తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పోటీ చేద్దామని పార్టీ నేతల నుంచి ఒత్తిడి వచ్చినా దివంగత ఎమ్మెల్యేని గౌరవించడం కోసం తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఉపఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని పవన్ వైసీపీకి సూచించారు.

  ఇది చదవండి: కాపులకు పవన్ కల్యాణ్ హితబోధ.. ఆ ముగ్గురిపై ఆసక్తికర వ్యాఖ్యలు


  బద్వేలు ఉపఎన్నికపై మిత్రపక్షాలైన బీజేపీ-జనసేన ముఖ్యనేతలు చర్చించిన అనంతరం పోటీ చేసే అవకాశాన్ని జనసేనకు ఇచ్చారు. పవన్ ప్రకటన నేపథ్యంలో ఈ ఎన్నికలో జనసేన అభ్యర్థిని నిలబెట్టడం లేదన్నది స్పష్టమైంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మాత్రం పోటీకి సై అంటోంది. ఇప్పటికే తమ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ ను ప్రకటించింది. ఈ ఉపఎన్నికలో గెలిచి వైసీపీకి షాకివ్వాలని టీడీపీ భావిస్తోంది.

  ఇది చదవండి: రోజా కుమార్తె అన్షుకి అరుదైన గౌరవం... తల్లికి తగ్గ తనయ అనిపించుకుందిగా..


  అక్టోబర్ 30న పోలింగ్
  2019లో బద్వేలులో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకటసుబ్బయ్య.. ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతిచెందారు. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8, ఉప సంవసంహరణకు అక్టొబర్ 13గా పేర్కొంది. 30 ఎన్నికలు నిర్వహించనుండగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. తిరుపతి ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలను ఆకర్షించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బద్వేలు ఉపఎన్నిక అందరి దృష్టిని ఆకర్షించనుంది.
  Published by:Purna Chandra
  First published: