Home /News /andhra-pradesh /

TIRUPATI JANASENA DIFFERENT PROTEST IN TIRUPATI FOR CM JAGAN TOUR THIS MONTH BE AWARE OF CAR OWNERS NGS

CM Jagan: జగనన్న వస్తున్నాడు కార్లు జాగ్రత్త.. సీఎం తిరుపతి పర్యటనలో వినూత్న ప్రదర్శన

సీఎం జగన్ ఉన్నారు జాగ్రత్త

సీఎం జగన్ ఉన్నారు జాగ్రత్త

CM Jagan: ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ కాన్వాయ్ ఇస్యూ సంచలనంగా మారింది. కొందరు అధికారుల ఓవర్ యాక్షన్ తో ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తిరుపతి పర్యటనకు వస్తున్న సమయంలో విపక్షాలు వినూత్న నిరసనకు దిగుతున్నాయి.. ప్రత్యేక దండోరా వేయిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  CM Jagan: ఇటీవల ఓ కుటుంబం తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో అధికారులు షాకిచ్చారు. మధ్యలో టిఫిన్ చేసేందుకు కారు ఆపగా.. అక్కడికి వచ్చిన కానిస్టేబుళ్లు.. సీఎం కాన్వాయ్ (CM Convey) లోకి కారుకావాలంటూ తీసుకెళ్లిపోయారు. దీంతో నడిరోడ్డుపై మహిళలు, చిన్నపిల్లలతో నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. శ్రీవారి దర్శనంకు వెళ్తున్న భక్తులపై ఇలా ఒంగోలు (Ongle) ఆర్టివో అధికారుల ఓవరాక్షన్ పెను దుమారమే రేపింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి (AP Government) డ్యామేజ్ అయ్యింది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సీఎం జగన్ (CM Jagan) ఈ నెల 5వ తేదీన తిరుపతి (Tirupati) పర్యటనకు రానున్నారు. ఇదే సమయంలో జనసేన తిరుపతిలో కొత్త తరహా ప్రచారం ప్రారంభించింది.

  తిరుపతి నగరంలోని బైరాగి పట్టెడ పార్క్ దగ్గర జగనన్న వస్తున్నాడు కార్లు జాగ్రత్త అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి ప్రధాన కారణం.. వారం క్రితం సీఎం జగన్ ఒంగోలు పర్యటన సమయంలో చోటు చేసుకున్న కాన్వాయ్ ఉదంతమే. రవాణా శాఖ అధికారులు బలవంతగా ఆ కుటుంబం తిరుపతికి మాట్లాడుకున్న వాహనాన్ని బలవంతంగా తీసుకోవడమే. దీని పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీని పైన స్వయంగా సీఎంఓ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

  ఇదీ చదవండి : పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న గ్యాంగ్ రేప్.. హోం మంత్రి రాజీనామాకు డిమాండ్.. ముగ్గురి అరెస్ట్

  ఆ ఘటనకు బాధ్యులుగా చేస్తూ.. సహాయ వెహికల్ ఇన్స్పెక్టర్ తో పాటుగా హోం గార్డును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఆ ఇష్యూ సద్దుమణగలేదు.. విపక్షాలు సమయం వచ్చినప్పుడల్లా దాన్ని ప్రధాన విమర్శనాస్త్రంగా చేసుకుంటున్నాయి. ఇక ఈ నెల ఐదవ తేదీన తిరుపతిలో సీఎం పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అలిపిరిలో చిల్డ్రన్స్‌ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌కి శంకుస్థాపన చేస్తారు. తరువాత టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి ప్రారంభించనున్నారు. విద్యా కానుక బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు.

  ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 13 మెడికల్ కాలేజీలు మంజూరు.. ఢిల్లీ టూర్ లో సీఎం జగన్

  మరోసారి ఒంగోలు లాంటి ఘటన రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని జనసేన నాయకులు విమర్శిస్తున్నారు. సీఎం జగన్ తిరుపతికి వస్తున్నారని.. అయితే సీఎం కాన్వాయ్‌కు సంబంధించి ఏ ఒక్క ట్రాన్స్‌పోర్టు అధికారి కూడా అందుబాటులో లేరని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ట్రావెల్స్ వారికి సంబంధించి 2 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని.. దీంతో ఎవ్వరూ సీఎం కాన్వాయ్‌కు కార్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరని గుర్తు చేస్తున్నారు.  తిరుపతి స్థానిక ప్రజలు, తిరుమలకు వస్తున్నభక్తులు సీఎం పర్యటన సమయంలో కార్లలో రావద్దని జనసేన నేతలు సూచిస్తున్నారు. జనసేన నేతల ప్రచారం సోషల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు దీనికి వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. సీఎం జగన్ ప్రతీ బహిరంగ సభలో చంద్రబాబుతో పాటుగా జనసేన అధినేత పవన్ ను సైతం దత్తపుత్రుడు అంటూ విమర్శిస్తున్నారు. తనను దత్తపుత్రుడు అంటే తాను సీఎం జగన్ ను సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు జనసేన చేస్తున్న తాజా ప్రచారంతో ఈ రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Janasena, Tirupati

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు