Home /News /andhra-pradesh /

Badvel By-Poll: బద్వేలు బరిలో ప్రధాన పార్టీలు.. బీజేపీ-జనసేనపై అందరి ఫోకస్..! మిత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదిరేనా..?

Badvel By-Poll: బద్వేలు బరిలో ప్రధాన పార్టీలు.. బీజేపీ-జనసేనపై అందరి ఫోకస్..! మిత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదిరేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కడప జిల్లా (Kadapa District) బద్వేలు ఉపఎన్నికకు (Badvel By-Election) నగారా మోగింది. ఏకగ్రీవానికి వైఎస్ఆర్సీపీ (YSRCP)నేతలు కసరత్తు చేస్తుంటే.. పోటీకి సై అంటూ ప్రధాన పార్టీలు కాలుదువ్వుతున్నాయి. ఐతే జనసేన-బీజేపీ అభ్యర్థిపై (Janasena-BJP Candidate) ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, Tirupati, News18

  కడప జిల్లా (Kadapa District) బద్వేలు ఉపఎన్నికకు (Badvel By-Election) నగారా మోగింది. ఏకగ్రీవానికి వైఎస్ఆర్సీపీ (YSRCP)నేతలు కసరత్తు చేస్తుంటే.. పోటీకి సై అంటూ ప్రధాన పార్టీలు కాలుదువ్వుతున్నాయి. ఐతే జనసేన-బీజేపీ అభ్యర్థిపై (Janasena-BJP Candidate) ఆసక్తికర చర్చ జరుగుతోంది. బద్వేలు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రజాప్రతినిథి మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకర్ని ఏకగ్రీవం చేసే సాంప్రదాయానికి ఇటీవల తెరపడింది. దీంతో ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ సైతం బద్వేలు ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని, మంత్రులు, సీనియర్ నేతలు తరచు నియోజకవర్గంలో పర్యటించాలని సూచించడం కూడా ఈ ఎన్నికను వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలుస్తోంది. అటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా ఇక్కడ గెలిచి వైసీపీకి షాకివ్వాలని చూస్తుండగా.. జనసేన-బీజేపీ కూటమి కూడా సై అంటోంది.

  2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ వెంకటసుబ్బయ్య ఈ ఏడాది మార్చిలో మరణించారు. కరోనా కారణంగా ఉపఎన్నికను వాయిదా వేసిన ఎన్నికల సంఘం.. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అక్టోబర్ 8 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలించనుండగా.. ఉపసంహరణకు అక్టోబర్‌ 13 వరకు అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 2న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో నియోజకవర్గంలో అధికారులు కూడా పోలింగ్‌ బూత్‌లను పరిశీలిస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలు, పోటీ చేయాలనుకున్న ఆశావాహులు కూడా వ్యూహరచన చేస్తున్నారు.

  ఇది చదవండి: ఆ విషయంలో జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత..? మొదటికే మోసం రానుందా..?  గ‌తంలో ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎవ‌రైనా చ‌నిపోతే స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధి కుటుంబ స‌భ్యుల‌కే ఏక‌గ్రీవంగా ప‌ద‌వి ఇవ్వాల‌ని తీర్మానించారు. ఈ సంప్ర‌దాయం కొంతకాలం బాగానే సాగింది. అయితే మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఏక‌గ్రీవంగా ఇచ్చే సంప్ర‌దాయానికి కొన్ని పార్టీలు పాటించే పరిస్ధితులు కనిపించడం లేదు. దీంతో ఉపఎన్నిక త‌ప్ప‌ని స‌రి కానుంది. ఈ కారణంగానే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టిడిపి పోటీలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కొంతకాలంగా రాజకీయంగానే కాకుండా ఉప ఎన్నికపై కూడా మౌనంగానే ఉన్నారు.

  ఇది చదవండి: షర్మిల విషయంలో జగన్ అంత కఠినంగా వ్యవహరించారా..? అసలు నిజం ఇదేనా..?


  కానీ టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం వామపక్షాలు, కాంగ్రెస్ తో కలసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో నేరుగా పొత్తు లేకపోయినా అవగాహన కుదుర్చుకోవాలంటున్నట్లు వినికిడి. కమ్యుబనిస్టు పార్టీలను నేరుగా కలుపుకుని వెళ్తూ.. ఈ ఎన్నిక ద్వారా కూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ ను టీడీపీ అధిష్టానం ప్రకటించిదిం. తాజాగా వైకాపా అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య భార్య సుధ పేరును వైసీపీ ఖరారు చేసింది. జనసేన-బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి.

  ఇది చదవండి: ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు... పొలిటికల్ ఎంట్రీ ఖాయమా..?


  బరిలో ఎవరు..?
  ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రకటించేశాయి. నామినేషన్లకు ఏర్పాట్లు చేసుకుంటూ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాయి. జనసేన-బీజేపీ అభ్యర్థిపైనే ఇంకా క్లారిటీ రాలేదు. ఇరు పార్టీ అగ్రనేతలు కూర్చొని త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నారు. బై పోల్‌ బరిలో జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి ఉంచాలని కూటమి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసింది కాబట్టి.., ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని జనసేన నేతలు కోరుతున్నట్లు సమాచారం. బద్వేలు అభ్యర్థిపై రెండుపార్టీలు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటమని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ పార్టీ తరపున అభ్యర్థి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.

  మీ నగరం నుండి (​తిరుపతి)

  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  ఆంధ్రప్రదేశ్
  ​తిరుపతి
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Bjp-janasena, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు