MLA Roja Challenge: నువ్వు మాగాడివైతే పోటీ చేయ్.. సొంతపార్టీ నేతకు ఎమ్మెల్యే రోజా సవాల్..

ఎమ్మెల్యే రోజా (ఫైల్ ఫోటో)

వైఎస్ఆర్సీపీ (YSRCP) ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja) ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో (Nagari Assembly Constituency) మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పాలిటిక్స్ లో ఆమె దూసుకుపోతున్నా.. సొంతపార్టీ నేతలే స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

 • Share this:
  ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయల పరంగాగానీ, అధికారిక కార్యక్రమాల పరంగా గానీ అధికార పార్టీ ఎమ్మెల్యే మాటే చెల్లుబాటవుతుంది. పార్టీ పదవులు, స్థానిక సంస్థల్లో గెలిచిన తర్వాత పరిషత్ అధ్యక్షుల ఎంపిక వంటివి పూర్తిగా ఎమ్మెల్యేనే చేపడతారు. ఎమ్మెల్యే ఎవరిపేరు చెబితే వాళ్లే పీఠమెక్కుతారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేది ఇదే. కానీ వైఎస్ఆర్సీపీ (YSRCP)  ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja) ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో  (Nagari Assembly Constituency) మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పాలిటిక్స్ లో ఆమె దూసుకుపోతున్నా.. సొంతపార్టీ నేతలే స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మున్సిపల్, పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పార్టీలోని మరోవర్గం పనిచేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. మున్సిపల్ ఎన్నికల్లో రోజా ఆధిపత్యానికి గండికొట్టేందుకు రెబల్స్ ను బరిలోకి దించినా ఆమె మాత్రం తన వాళ్లను గెలిపించుకొని సత్తా చాటారు.

  ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ (AP Parishat Elections) ప్రతిపక్షం నుంచి కాకుండా అధికార పక్షం నుంచే రోజాకు ఎదురుగాలి వీస్తోంది. నగరి పరిధిలోని నిండ్ర మండల పరిషత్ ఛైర్మన్ ఎన్నిక వివాదాస్పదమవుతోంది. నిండ్రలో రోజాకు వ్యతిరేకంగా వైసీపీ నేత చక్రపాణి రెడ్డి పనిచేసత్డటం తీవ్రకలకలం రేపింది. చక్రపాణి రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు. నిండ్రలో ఎంపీపీ అభ్యర్థులుగా ఇటు రోజా, అటు చక్రపాణి రెడ్డి తమ వర్గంవారిని గెలిపించుకున్నారు. ఎంపీపీ ఎన్నిక రోజు తీవ్రదుమారమే రేగింది.

  ఇది చదవండి: గుడివాడ సెంటర్లో తేల్చుకుందాం..! కొడాలి నానికి వంగవీటి రాధ సవాల్..? ప్రచారంలో నిజమెంత..?

  ఎంపీపీ ఎన్నిక కోసం ఎమ్మెల్యే హోదాలో రోజా విప్ జారీ చేయగా చక్రపాణి వర్గం స్వీకరించేందుకు నిరాకరించింది. నిండ్రలో మొత్తం ఎనిమిది ఎంపీటీసీ స్థానాలుండగా.. ఏడుగురు వైసీపీ తరపున గెలిచారు. ఒకటి టీడీపీ దక్కించుకుంది. మొత్తం ఎనిమిది మందిలో ఐదుగురు చక్రపాణి రెడ్డి వైపు ఉండగా.. టీడీపీ ఎంపీటీసీ, ఇద్దరు వైసీపీ, ఒక కో ఆప్షన్ సభ్యుడు కలిపి నలుగురు రోజావైపున్నారు.

  ఇది చదవండి: డ్రగ్స్ తో వైసీపీ ఎమ్మెల్యేకి లింక్.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..


  శనివారం ఎంపీపీ ఎన్నికకు మండల పరిషత్ కార్యాలయంలో జేసీ ఆధ్వర్యంలో సమావేశమవగా.. విప్ తీసుకునేందుకు చక్రపాణి వర్గానికి చెందిన ఎంపీటీసీలు నిరాకరించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యేని కాదని ఇలా చేయడంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు చక్రపాణి రెడ్డితో వాగ్వాదానికి దిగిన రోజా.. “నువ్వు మగాడివైతే ఇండిపెండెంట్ గా పోటీ చేయ్” అని సవాల్ చేశారు. అంతేకాదు వెన్నుపోటుదారులు తమకు వద్దంటూ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ అసెంబ్లీ తరహాలో నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అధకారులు సర్దిచెప్పినా ఎవ్వరూ వెనక్కితగ్గలేదు. ఐతే రోజాలాంటి ఎమ్మెల్యే నేరుగా రంగంలోకి దిగినా వ్యవహారం కొలిక్కిరాకపోవడం చర్చనీయాంశమైంది.

  ఇది చదవండి: ఏపీకి తుఫాన్ ముప్పు... ఈ జిల్లాలు అలర్ట్... మూడు రోజులు జాగ్రత్త..


  విజయపురం మండలంలో ఎంపీపీ అభ్యర్థి ఎన్నికలో మెదలైన వర్గపోరు నిండ్ర మండలంలో తారస్థాయికి చేరుకుంది. విజయపురం ఎంపీపీగా రాజుల వర్గానికి చెందిన లక్ష్మీపతి రాజును అభ్యర్థిగా అనుకున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ ప్రతిపాదనకు రోజా అడ్డుకట్ట వేశారు. ఓ దళిత మహిళను ఎంపీపీని చేయాలన్న పట్టుదలతో ముందుకెళ్లారు. తాను ప్రతిపాదిచిన జమునను ఎంపిపిగా గెలిపించుకున్నారు రోజా. ఆ సమయంలో ఎవరు నోరు మెదపక పోయినా.. నిండ్రలో మాత్రం వర్గపోరు బహిర్గతం అయింది.

  ఇది చదవండి: టీడీపీ-జనసేన మధ్య కుదిరిన పొత్తు.. వైసీపీకి చెక్ పెట్టేందుకే..!


  ఆశించిన విధంగా మంత్రిపదవి రాకపోయినా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళ్తున్న రోజాకు.. సొంతపార్టీ నేతల నుంచే అడ్డంకులు ఎదురవుతుండటంతో ఆమె ఒంటరిపోరు సాగిస్తుందనే చెప్పాలి. తనపై గ్రూపు రాజకీయాలు చేస్తున్నావారికి రోజానే చెక్ పెడతారా..? లేక సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి తన హవాను కొనసాగిస్తారా..? అనేది వేచి చూడాలి.
  Published by:Purna Chandra
  First published: