Home /News /andhra-pradesh /

TIRUPATI JABARDASTH JUDGE AND YSRCP MLA RK ROJA CREATES HURDLES FOR CM YS JAGAN IN THIS IMPORTANT FULL DETAILS HERE PRN

MLA Roja : రోజా చేసిన పని జగన్ ను ఇరుకున పెట్టిందా..? ప్రభుత్వంపై విమర్శలు తప్పవా..?

ఎమ్మెల్యే రోజా (ఫైల్)

ఎమ్మెల్యే రోజా (ఫైల్)

ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీవ్రంగా విమర్శలెదుర్కొంటున్న అంశం రాష్ట్రంలో రోడ్ల దుస్థితి. ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఈ సమయంలో వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే రోజా (MLA Roja) చేసిన ఓ డిమాండ్ జగన్ ప్రభుత్వాన్ని ఒకింత చిక్కుల్లో పడిందన్న చర్చ మొదలైంది.

ఇంకా చదవండి ...
    ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీవ్రంగా విమర్శలెదుర్కొంటున్న అంశం రాష్ట్రంలో రోడ్ల దుస్థితి. ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. దాదాపు ఏడాది కాలంగా టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) వంటి పార్టీలు ఈ అంశంపై పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారీ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోవడం లేదన్న విమర్శే వినిపిస్తోంది. ఈ సమయంలో వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే రోజా (MLA Roja) చేసిన ఓ డిమాండ్ జగన్ ప్రభుత్వాన్ని ఒకింత చిక్కుల్లో పడిందన్న చర్చ మొదలైంది. చెప్పాలి. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి.. గురువారం పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారులను కలిసి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందించారు.

    విజయవాడ లో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబుతో భేటీ అయ్యారు. ఇద్దరు మంత్రులో నియజకవర్గంలో సమస్యలను వివరించారు రోజా. ఇక ఐఏఎస్ కృష్ణబాబుతో నగరిలోని రోడ్ల దుస్థితిపై ర్చించారు. తన నియోజకవర్గంలోని నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా చేపట్టిన రోడ్ల పనులు అధ్వానంగా ఉన్నాయని.. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్నాయని.. గతుకుల మయమైన రోడ్లపై ప్రయాణించడం కష్టంగా ఉందన్నారమె. ప్రతి రోజూ ప్రమాదాలు జరుగుతున్నా హైవే అథారిటీ పట్టించుకోవం లేదని.. టోల్ రుసుము మాత్రం వసూలు చేస్తున్నారన్నారు. రోడ్లను తక్షణమే బాగు చేసి సక్రమంగా నిర్వహించాలని.., పిచ్చిమొక్కలు, చెలు తొలగించాలన్నారు. ఐతే సదరు రోడ్డు తమిళనాడు పరిధిలో ఉండటం మరమ్మతులకు కష్టంగా ఉందని కృష్ణబాబు వివరణ ఇచ్చారు.


    ఇది చదవండి: టీటీడీ కీలక నిర్ణయం.. 10 రోజుల పాటు వాటికి బ్రేక్.. భక్తుల కోసమేనన్న అధికారులు


    రాష్ట్రంలో వేలాది రోడ్లు గతుకులమయమయ్యాయి. రోడ్ల దుస్థితిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్న ప్రభుత్వం అభివృద్ధి పనులను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేనే రోడ్ల దుస్థితిపై ప్రజలు ధర్నా చేస్తారని చెప్పడం చర్చనీయాంశమైంది. రోడ్ల గతుకుల వల్ల హైవేకి టోల్ కట్టరని... ప్రజలు ధర్నా చేస్తారనడం ఒకింత రాష్ట్రప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్లే కనిపిస్తోంది. రోజా లాంటి వ్యక్తి ఇలా కామెంట్ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దుస్థితిపై ప్రజలు ధర్నా చేయాలని పరోక్షంగా చెప్పినట్లుందనే చర్చ జరుగుతోంది.

    ఇది చదవండి: వైసీపీలో టీడీపీ కోవర్టులు.. ఎమ్మెల్యే రోజా సంచలన ఆరోపణలు.. ఎస్పీకి ఫిర్యాదు..


    ఇదిలా ఉంటే గత ఏడాది సెప్టెంబర్ లో జనసేన పార్టీ రోడ్లపై సోషల్ మీడియా ఉద్యమం చేసిన సమయంలో అధికారులతో భేటీ అయిన సీఎం జగన్.. అక్టోబర్ తర్వాత రోడ్ల మరమ్మతులపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల మరోసారి ఈ సమస్యపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం దీనిపై దృష్టిపెట్టిన అధికారులు అంచనాలు రూపొందించేపనిలో ఉన్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, MLA Roja, Ysrcp

    తదుపరి వార్తలు