Home /News /andhra-pradesh /

TIRUPATI IS SNAKE TAKING REVENGE ONE SNAKE CONTINUE BITES ONE FAMILY RECENTLY 6TH TIME HAPPEND IN CHITTOOR DISTRICT NGS

Snake Bite: ఆ కుటుంబంపై పాము పగపట్టిందా.. 45 రోజుల్లో ఆరుసార్లు పాముకాటు.? ఎందుకిలా జరుగుతోంది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Snake Bite: పాములంటే అందరికి భయమే.. కోరలు చాచి కాటు వేస్తే చాలు ప్రాణాల మీదకు వస్తుంది. ఐతే పాములు పగడపట్టి కాటువేస్తాయని అందరూ భావిస్తారు. అలాంటిది ఏమీ ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. తాజాగా ఓ కుటుంబపై పాము పగబట్టిందా అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒకే కుటుండంపై 45 రోజుల్లో పాము ఆరు సార్లు కాటు వేసింది..? మరి పాము పగబట్టకపోతే.. ఒకే కుటుంబాన్ని అన్ని సార్లు ఎందుకు కాటు వేస్తోంది.

ఇంకా చదవండి ...
  Snake Bite: పాములు పగపడుతాయా లేదా అనేది ఎప్పటికీ వివాదాస్పద వాదానే.. ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తుంటారు. పాములు ఒకరిపై పగపడితే.. సదరు వ్యక్తి చనిపోయే వరకూ వేటాడుతూనే ఉంటాయని కొందరు అంటుంటే.. హేతు వాదులు మాత్రం.. పాములకు ఏమాత్రం జ్ఞాపక శక్తి ఉండదని హేతువాదులు ఖండిస్తున్న పరిస్థితి. సినిమాలలో మాత్రం.. పాములు పగబట్టినట్టు చూపిస్తూ ఉంటారు. అప్పుడప్పుపడు ఇలాంటి వార్తలు వింటూ ఉంటాం కూడా. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ పల్లెలో మాత్రం ఓ పాము.. ఓ కుటుంబాన్ని పగబట్టిందట. ఆ ఇంట్లోని వాళ్లు తరచూ పాముకాటుకు గురవుతుండటంతో నిజంగానే నాగరాజు వారిని వెంబడిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా (Chittoor District) తిరుపపతి సమీపంలోని చంద్రగిరి (Chindragiri) మండలం దోర్నకంబాల పంచాయతీ మల్లయ్యపల్లిలో ఆది ఆంధ్రవాడకు చెందిన ఓ కుటుంబాన్ని ఓ పాము పట్టి పీడిస్తోంది. అక్కడ వెంకటేష్ వెంకటమ్మ అనే దంపతులు నివాసముంటున్నారు. వారు కుమారుడు జగదీష్, తండ్రి గురవయ్యతో కలిసి ఉంటున్నారు. గ్రామ పొలిమేరల్లో గుడిసె వేసుకొని ఊరూరా తిరుగుతూ బండిపై ఐస్ క్రీమ్ అమ్ముకొని జీవిస్తున్నారు. ఐస్ క్రీమ్ బండి తీయని సమయంలో కూలిపనులకు వెళ్తుండేవాడు. ఆ డబ్బుతోనే కుమార్తెతో పాటు కొడుకుని చదువిస్తున్నాడు. ఆ కుటుంబపై పాము పగబట్టిందని స్థానికులు చెబుతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు.

  పాము అంటేనే అందరికి వణుకుపుడుతుంది. పాము కనిపిస్తే చాలు పరుగులు పెడతారు. కానీ పాము (Snake) అంటే ఆ కటుంబ వణికిపోతుంది. 45 రోజుల వ్యవధిలో వెంకటేష్, వెంకటమ్మల కుటుంబంలో నలుగురికి ఆరుసార్లు కాటేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో మూడు సార్లు ఆస్పత్రికి కూడా వెళ్లి వచ్చారు ఆ కుటుంబ సభ్యులు.. తాజాగా రాత్రి జగదీష్‌ ఆరుబయట నిద్రిస్తుండగా అతడి కాలుపై పాము కాటేసింది. దీంతో 108కి సమాచారం అందించడంతో అతన్ని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  ఇదీ చదవండి : ఇలాంటి చేపను ఎప్పుడైనా చూశారా..? మనిషాలగే ఉండి మనిషి ప్రాణం తీస్తుంది

  ఇదే వెంకటేష్‌కు గతంలో రెండుసార్లు, తండ్రి, భార్య, కుమారుడికి ఒక్కోసారి పాము కాటేసింది. ఇప్పుడు తాజాగా జగదీష్‌ను మరోసారి కాటేసింది. తమ కుటుంబాన్ని పాము వేధించడం వారు భయాందోళనకు గురవుతున్నారు. అయితే 45 రోజుల్లో ఒకే కుటుంబాన్ని అన్ని సార్లు కాటేయడం పాము పగబట్టిందని గ్రామస్తులు చెప్పుకొంటున్నారు. కానీ పాములు పగబట్టడం లాంటివేమి ఉండవని మరి కొందరు చెబుతున్నారు.

  ఇదీ చదవండి : : మహిళా మంత్రులు పుష్పశ్రీవాణి, సుచరిత, వనిత కొనసాగుతారా? రోజా, రజని, పద్మావతిల్లో ఎవరికి ఛాన్స్?

  అయితే హేతువాదుల వ్యాఖ్యలు మంత్రి విభిన్నంగా ఉన్నాయి. పాములకు ఎలాంటి అతేంద్రియ శక్తులు, జ్ఞాపక శక్తి లేందంటూ సైన్స్ తో పాటు మారుతున్న టెక్నాలజీలో నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పాము తలపై అత్యంత విలువైన మణులు, మణిఖ్యాలు ఉంటాయని కొందరు ప్రగాఢంగా నమ్ముతుంటే.. వాటిని కొట్టిపడేసే వారే ఎక్కువ. పాములకు జ్ఞాపక శక్తి ఉంటుందా..? ఒక మనిషిపై పగ బట్టి పదే పదే కాటు వేయడానికి చూస్తోందా..? అసలు ఇల్లు దాటి బయట వస్తే నాగుపాము కాటు వేయడం ఖాయమా..? అనే ప్రశ్నకు సుబ్రమణ్యం కథ అవును అనే సమాధానం చెబుతోంది. తాను అనుభవిస్తున్న మానసిక క్షోభే ఇందుకు నిదర్శనంగా మారుతోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chittoor, Snake bite

  తదుపరి వార్తలు