హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cheating Marriage: భయంకరమైన నిజాన్ని దాచి ఆమెకు పెళ్లి చేశారు.. ఏడాదిలోపే ఆమె జీవితం చీకటిమయమైంది..

Cheating Marriage: భయంకరమైన నిజాన్ని దాచి ఆమెకు పెళ్లి చేశారు.. ఏడాదిలోపే ఆమె జీవితం చీకటిమయమైంది..

నెల్లూరులో కోడలికి అత్తమామల వేధింపులు

నెల్లూరులో కోడలికి అత్తమామల వేధింపులు

Marriage: వధువరులకు సంబంధించిన నిజాలు దాచిపెట్టి పెళ్లిళ్లు చేయడం ఆ తర్వాత అవి తెలిసి వందేళ్ల భవిష్యత్తు అంథకారంలో కూరుకుపోవడం లాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి.

GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

నూరు అబద్దాలు చెప్పైనా ఓ పెళ్లి (Marriage) చేయాలంటారు పెద్దలు. కానీ ప్రస్తుత నెలకొన్న పరిస్థితుల్లో ఒక అబద్దం చెప్పి పెళ్లి చేసినా జీవితాలు తలకిందులవుతున్నాయి. వధువరులకు సంబంధించిన నిజాలు దాచిపెట్టి పెళ్లిళ్లు చేయడం ఆ తర్వాత అవి తెలిసి వందేళ్ల భవిష్యత్తు అంథకారంలో కూరుకుపోవడం లాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. అలా ఓ చేదు నిజాన్ని దాచిపెట్టి కొడుక్కి పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఏ పాపం చేయని యువతి జీవితాన్ని నాశనం చేశారు. కొడుకు అనారోగ్యాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు. తీరా అతడు చనిపోయిన తర్వాత కోడల్ని బయటకు గెంటేశారు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంకు చెందిన విజయేంద్ర రెడ్డికి చిత్తూరు జిల్లా తిరుపతి (Tirupati) కి చెందిన ఊహా రెడ్డితో ఏడాది క్రితం పెళ్లైంది.

పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో అమ్మాయి తలవంచి తాళి కట్టించుకుంది. ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకున్న ఊహకు ఆ కలలు కల్లలే అని అర్ధమవడానికి ఎంతోకాలం పట్టలేదు. పెళ్లైన కొన్నాళ్లకే విజయేంద్ర అనారోగ్యం బారినపడ్డాడు. అతడికి రెండు కిడ్నీలు పాడైపోయి మంచానపడ్డాడు. ఈ విషయం పెళ్లికి ముందే తల్లిదండ్రులకు తెలిసినా నిజాన్ని దాచిపెట్టి మరీ కొడుక్కి పెళ్లిచేశారు.

ఇది చదవండి: నా భార్య చనిపోయింది... మీ అమ్మను పంపిస్తావా అన్నాడు.. ఒళ్లు మండిన కొడుకు ఏం చేశాడంటే..!


అత్తమామలు అబద్ధం చెప్పి పెళ్లిచేశారన్న విషయం తెలుసుకున్న ఊహ బాధను దిగమింగుకొని కాపురం చేసింది. ఈక్రమంలో భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలు చేయి పడిపోయింది. కొన్నిరోజులకు భాధను భరించలేక విజయేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోయే నాటికే ఊహ గర్భవతి. భర్త తోడు కావాల్సిన సమయంలోనే ఆమె తన సర్వస్వాన్ని కోల్పోయింది.


ఇది చదవండి: నమ్మకంతో పనిచేయాల్సిన ఉద్యోగం అతడిది... రాత్రికి రాత్రే కోటీశ్వరుడవ్వాలనుకున్నాడు.. కట్ చేస్తే..


ఆరు నెలల తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్తను తన కూతురిలో చూసుకుంటూ కాలం గడిపింది. ఐతే పాపను తీసుకొని అత్తింటికి వచ్చిన ఊహకు అనుకోని ఘటన ఎదురైంది. భర్తను కోల్పోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న కోడల్ని, అప్పుడే జన్మించిన మనవరాలిని అక్కున చేర్చుకోవాల్సిన అత్తమామలు వారిపై దాడికి దిగారు.

ఇది చదవండి: స్నేహానికి అడ్డొస్తుందని ఫ్రెండ్ భార్యను ఇలా చేశాడేంటి..? మరీ అంత నీచమా..?


కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా ఊహమాత్రం అక్కడే బైఠాయించింది. గతంలో కూడా ఆమెకు ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు పోలీసులను ఆశ్రయించగా ఆమెకు నిరాశ ఎదురైంది. అబద్ధం చెప్పి తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు ఇప్పుడు తనకు, తన పాపకు అన్యాయం చేస్తున్నారని ఊహ వాపోతోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతోంది.

ఇది చదవండి: తండ్రిలేని వాడని చేరదీసిన మేనత్త.. కానీ వాడు అలా చేస్తాడని ఊహించలేకపోయింది..


గతంలో చిత్తూరు జిల్లాలో డాక్టర్ గా చేస్తున్న యువతి తల్లిదండ్రులకు యువతి తల్లిదండ్రులు అబద్ధాలు చెప్పి ఓ జల్సారాయుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పనిపాట లేకుండా తిరుగుతున్న భర్త ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలపెట్టాడు. చిత్రహింసలు తట్టుకోలేక యువతి పోలీసులను ఆశ్రయించింది.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Female harassment, Nellore

ఉత్తమ కథలు