హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati Woman: కొడుకు మరణంతో కోడలిపై అనుమానం.. అత్తమామలు ఏం చేశారో చూడండి..!

Tirupati Woman: కొడుకు మరణంతో కోడలిపై అనుమానం.. అత్తమామలు ఏం చేశారో చూడండి..!

ఆందోళన చేస్తున్న బాధితురాలు స్వర్ణ

ఆందోళన చేస్తున్న బాధితురాలు స్వర్ణ

Chittoor: కుటుంబ వ్యవస్థలో అత్తకోడళ్ళ మధ్య వైరం ఉండక మానదు. కొడుకు ఇంట్లో లేని సమయంలో కోడలిపై అత్త విరుచుకుపడుతున్న సందర్భాలు ఎన్నో. అత్తపై కోడలు దాష్టికానికి పాల్పడిన ఘటనలు లేకపోలేదు.

GT Hemanth Kumar, News18, Tirupati

కుటుంబ వ్యవస్థలో అత్తకోడళ్ళ మధ్య వైరం ఉండక మానదు. కొడుకు ఇంట్లో లేని సమయంలో కోడలిపై అత్త విరుచుకుపడుతున్న సందర్భాలు ఎన్నో. అత్తపై కోడలు దాష్టికానికి పాల్పడిన ఘటనలు లేకపోలేదు. ఇంటికి వచ్చిన కోడలిని కూతురితో సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత అత్తపై ఉంటే.., తల్లితో సమానంగా అత్తతో మెలగాల్సిన బాధ్యత కోడలిపై ఉంటుంది. ఇద్దరి మధ్య పరస్పర మనస్పర్థలు రావడం.., ఒకరిపై మరొకరు దూషణలకు దిగటం ఇప్పుడు సర్వ సాధారణం. కానీ కొడుకు చనిపోయిన తరువాత కోడలిపై అత్త తన పైశాచికత్వాన్ని బయటపెట్టింది. ఇంట్లోకి రావొద్దంటూ బయటకు తరిమేసింది. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ బయటకు గెంటేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chittoor District) లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... ఉమ్మడి చిత్తూరి జిల్లా పీలేరు పట్టణంలోని పాలాల విధికి చెందిన కుమార్ ఆచారి సరళ దంపతుల కుమారుడు హరి ప్రసాద్ కు హైదరాబాద్ (Hyderabad) కవాడిగుడాకి చెందిన స్వర్ణలతకు 13 ఏళ్ళ క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి పల్లవి (12), సంతోష్ (11) సంతానం. గత నాలుగేళ్లుగా హరిప్రసాద్ ఆరోగ్యాని సరిగా లేక ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారు. వైద్యం చేయించుకున్న హరి ప్రసాద్ ఆరోగ్యం కుదుట పడలేదు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇది చదవండి: ఈమె పేరు మృదుల.. పేరులో ఉన్నంత సాఫ్ట్ కాదు..! ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా..


అప్పటి నుంచి స్వర్ణ అత్తగారి ఇంటివద్దే ఉంటోంది. కొడుకు చనిపోయిన కొన్నాళ్ల నుంచి కోడలిపై అనుమానం పెంచుకున్నారు అత్తమామలు. కోడలు ఎవరితోనో ఎఫైర్ పెట్టుకుందని అనుమానం పెంచుకున్నారు. ముందుగా కన్నా బిడ్డలను దూరం చేయాలనీ సంకల్పించారు. పధకం ప్రకారం స్వర్ణ కన్నబిడ్డలకు లేని పోని మాటలు చెప్పేవారు. తల్లిగురించి పిల్లలకు చెడుగా చెప్పి ఆమెపై మనసు విరిగిపోయేలా చేశారు. మెల్లగా స్వర్ణపై వేధింపులు ప్రారంభించారు.

ఇది చదవండి: ప్రియుడుతో కలిసి భర్త హత్య.., కొడుకుతో కలిసి స్కెచ్.. చివరికి అడ్డంగా దొరికిపోయింది..


సూటిపోటి మాటలతో ఇబ్బందులకు నిత్యం వేధిస్తూ ఉండేవారు. నీవల్లే మా కుమారుడు చనిపోయాడంటూ నిందలు మోపేవారు. పిల్లల కోసం అన్నీ భరిస్తూ వచ్చిన స్వర్ణ అత్తారింటిలోనే ఉండేది. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని, పెట్టేబేడా సర్ది బయటకు తరిమేశారు. ఇంట్లోకి వెళ్లకుండా లోపల తాళాలు వేసేసారు. దీంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న స్వర్ణ అత్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. కన్నబిడ్డలనైనా తన దగ్గరకు చేర్చాలని వేడుకుంటోంది.

First published:

Tags: Andhra Pradesh, Chittoor

ఉత్తమ కథలు