TIRUPATI IF YOU TASTE APPAM DOSA IN RENIGUNTA YOU MUST NOT SPIT SALIVA IN YOUR MOUTH TPT PVN
అప్పం దోస అంటే మనకు గుర్తుకు వచ్చేది కేరళ..రేణిగుంటలో అప్పం దోస రుచి చూస్తే నోట్లో లాలాజలం ఊరక తప్పదు
ప్రతీకాత్మక చిత్రం
Appam Dosa : అప్పం దోస అంటే మనకు గుర్తుకు వచ్చేది కేరళ. అయితే మన ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంటలో దొరికే అప్పం దోస రుచి చూస్తే నోట్లో లాలాజలం ఊరక తప్పదు. ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో రకమైన వంటకాలు చాలా ప్రచుర్యాని పొంది ఉంటాయి.
Appam Dosa : అప్పం దోస అంటే మనకు గుర్తుకు వచ్చేది కేరళ. అయితే మన ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంటలో దొరికే అప్పం దోస రుచి చూస్తే నోట్లో లాలాజలం ఊరక తప్పదు. ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో రకమైన వంటకాలు చాలా ప్రచుర్యాని పొంది ఉంటాయి. కొన్ని వరల్డ్ వైడ్ ఫేమస్ అయితే.... కొన్ని ఆయా ప్రాంతాలకు పరిమితమై విపరీతంగా అమ్ముడుపోతుంటాయి. కొంతమంది భోజన ప్రియులు బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు.వింతైన, రుచికరమైన ఆహారం కోసం అన్వేషణ సాగిస్తుంటారు. ఎన్నో రెస్టారెంట్లు., మరెన్నో ఫైవ్ స్టార్ హోటల్స్ లో లభించని కొన్ని ప్రత్యేక వంటకాలు మనకి నోరూరించేలా చేస్తాయి. ఆత్రేయ పురం పుతారేకులు., కాకినాడ మడత ఖాజా., పుల్లారెడ్డి నేతి మిఠాయిలు వంటివి ఫేమస్. అంతేకాదు హైద్రాబాద్ ధామ్ బిరియని., చెన్నై తలపాకట్టు మటన్ అంటూ లిస్ట్ పెరుగుతూనే పోతుంది. తిరుపతికి సమీపంలోని రేణిగుంటలో కేరళ స్టైల్ లో అప్పం దోషాలు ఎంతో ఫేమస్. బయట ఎగ్ దోషాలకు భిన్నమైన రుచులతో నోరూరించే అప్పం దోషాల స్పెషల్ ఏంటో చూద్దాం...!!
వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో యాత్రికులు తిరుమలకు చేరుకుంటారు. తిరుమలకు రావాలంటే కచ్చితంగా తిరుపతికి చేరుకోవాల్సిందే. రైళ్ల మార్గం నుంచి వచ్చే యాత్రికులు సగభాగం రెనుగుంట మీదుగా తిరుపతికి చేరుకుంటారు. అందులోనూ రైల్వే జుంక్షన్ రేణిగుంట కావడంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇక్కడ అగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ నుంచే కాక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి యాత్రికులు వస్తుంటారు. రేణిగుంట రైల్వే స్టేషన్ పక్కన గత 26 ఏళ్లుగా ఓ కుటుంబం టిఫిన్ సెంటర్ను నిర్వహిస్తోంది. ఇక్కడ అప్పం దోసె ప్రత్యేకం. వాళ్ల ఇంటి పేరే అప్పాలు అని పెట్టేసుకున్నారు అంటే.. ఆ అప్పం దోసె వారికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో అర్థమవుతుంది.
అప్పం దోషాలు అంటే తమిళనాడు., కేరళలో ఎంతో ఫేమస్. అక్కడి వసూలు అప్పం దోషాలను లొట్టలు వేసుకొని తింటుంటారు. తెలుగి రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్., తెలంగాణలో అప్పం దోషలు పెద్దగా కనపడవు. రేణిగుంటలో మాత్రం తెలుగు ఫ్లేవర్., అభిరుచులకు తగ్గట్టుగా నోరూరించే అప్పం దోషలు ఎంతో ఫేమస్. మామూలుగా చాలా టిఫిన్ సెంటర్లలో గ్యాస్ పొయ్యి ఉపయోగించే టిఫిన్ తయారు చేస్తారు. కానీ, ఇక్కడ కట్టెల పొయ్యి వాడటం వలన ఈ అప్పంకి అంత రుచి ఉంటుందని అంటుంటారు. టిఫిన్ సెంటర్ను ఎలా గుర్తు పట్టాలని అని సంసాయించాల్సిన అవసరం లేదు. ఆ టిఫిన్ సెంటర్ కు ఎలాంటి బోర్డు ఉండదు. రేణిగుంట వెళ్లి అప్పాలమ్మ హోటల్ అని చెబితే చాలు ఎవరైనా చూపిస్తారు. అంత ఫేమస్ ఈ అప్పం. ఇక్కడ సాదా అప్పం, కరివేపాకు అప్పం, కారం అప్పం, కోడిగుడ్డు అప్పం.. ఇలా రకరకాల అప్పాలు దొరుకుతాయి. దీనితో పాటు చికెన్, మటన్, పాయా, నాటుకోడి వంటి నాన్ వెజ్ కూడా ఉంటుంది.
ఉదయం ఆరు గంటలకి మొదలయ్యే ఈ టిఫిన్ సెంటర్.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అప్పం దోసె తినడానికి రేణిగుంట చుట్టుపక్కల ప్రాంతాలు అయిన తిరుపతి, కాళహస్తి నుంచి కూడా వస్తుంటారు. సినీ ప్రముఖులు అయిన మంచు లక్ష్మీ, విష్ణు, మనోజ్ అయితే ఈ అప్పం తిని తిరుపతికి వెళ్తారు అని టిఫన్ నిర్వాహలు చెబుతున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి తిరుపతి వెళ్లినప్పుడు ఇక్కడ అప్పం దోసె తిని వారితో సెల్ఫీ కూడా తీసుకున్నారు. కాబట్టి, ఈసారి తిరుపతి వెళ్లినప్పుడు రేణిగుంటలో దిగి అప్పం దోసె రుచి చూడటం మరిచిపోకండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.