Home /News /andhra-pradesh /

TIRUPATI HUSBAND TRY TO KILL WIFE AFTER HE HAVING EXTRA MARITAL AFFAIR IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Wife and Husband: భార్యను చంపాలని మూడుసార్లు విఫలమైన భర్త... నాలుగోసారి ఏం చేశాడంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Andhra Pradesh: కట్టుకున్న భార్యను ప్రేమగా చూసుకోవాల్సిన వాడు శాడిస్టులా మారాడు. తాను దారితప్పడమే కాకుండా.. ఆమె కూడా అలాగే చేస్తోందని అనుమానించాడు.

  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  అగ్నిసాక్షిగా తాళికట్టాడు. ఏడడుగులు వేశాడు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేశాడు. కట్టుకున్న భార్యను ప్రేమగా చూసుకోవాల్సిన వాడు శాడిస్టులా మారాడు. తాను దారితప్పడమే కాకుండా.. ఆమె కూడా అలాగే చేస్తోందని అనుమానించాడు. చిన్న అనుమానం పెనుభూతమైంది. నిత్యం తాగొచ్చి ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు.. అంతేకాదు ఆమెను చంపేందుకు స్కెచ్ వేసి విఫలమయ్యాడు. చివరికి మానవమృగంలా మారి భార్యను కిరాతకంగా హతార్చాలనుకున్నాడు. కానీ చేసిపాపం అతడ్ని పట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జల్లా పీలేరు మండలం కటకాడ పల్లెకు చెందిన శైలజకు రామిరెడ్డిపల్లెకు చెందిన రాజేంద్రాచారితో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వీరి బంధానికి గుర్తుగా కుమారుడు తివిక్రమాచారి జన్మించాడు. ఐతే వ్యసనాలకు బానిసైన రాజేంద్రాచారికి నాలుగేళ్లుగే వేరే మహిళతో వివాహేతర సంబంధముంది. దీనిని ప్రశ్నించిన శైలజను తరచూ చిత్రహింసలు పెడుతుంటేవాడు. ఐతే భర్త ఎంత వేధిస్తున్నా కన్నకొడుకు కోసం అన్నీ భరిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే శైలజ కూడా వేరే వ్యక్తితే సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఆమెను అనుమానించడం మొదలుపెట్టాడు.

  ఇంటి నుంచి బయటకు వచ్చినా అనుమానంతో దూషించేవాడు. అంతేకాదు గతంలో రెండు మూడుసార్లు ఆమెను చంపేందుకు కూడా యత్నించాడు. బలవంతంగా పురుగుల మందు తాగించబోతే ఆమె తప్పించుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ నిద్రించారు. ఐతే భార్య గాఢనిద్రలోకి వెళ్లిన తర్వాత రాజేంద్రాచారిలోని మృగం నిద్రలేచింది. భార్యను ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఆమె పీకను కొరికేశాడు. దిండుతో ముఖాని అదిమిపెట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. శైలజ చనిపోయిందని భావించిన రాజేంద్ర ఆమెను దుప్పటిలో చుట్టి ఏమీ ఎరుగనట్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

  ఇది చదవండి: ఏపీలో మాస్క్ లేకుంటే రూ.20వేలు ఫైన్... ప్రభుత్వం కీలక ఉత్తర్వులు... ఎవరికంటే...!


  తెల్లారిన తర్వాత చిన్నారి ఏడుపులు విన్న చుట్టుపక్కల వారు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. శైలజ ప్రాణాలతో ఉందని గ్రహించి వెంటనే పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు. శైలజ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు రాజేంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై గృహహింస, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. భార్యను చిత్రహింసలు పెట్టడంతో పాటు చంపాలని చూసిన రాజేంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల వారు కోరుతున్నారు. మరోవైపు తల్లి ఆస్పత్రిలో ఉండటం, తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వారి కుమారుడు త్రివిక్రమాచారి ఏం జరిగిందో తెలియక దీనంగా చూస్తున్నాడు.

  ఇది చదవండి: ఇన్ స్టాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన యువతి.. ఫోటోలు డౌన్ లోడ్ చేసి అరాచకం

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Attempt ot murder, Crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు