Wife and Husband fight: భార్యాభర్తల మధ్య ఏం జరగకూడదో అదే జరిగింది.. ఈ కథకు ఎవరూ ఊహించని క్లైమాక్స్..

ప్రతీకాత్మకచిత్రం

మూడు ముళ్ల బంధంతో ఒక్కటై దాపత్య జీవితంలో కొనసాగే వారికీ ఉండాల్సింది ఒకరిపై మరొకరరికి అపారమైన నమ్మకం. కానీ...

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  మావన సంబంధాలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. కారణం ఏదైనా ఎదుటి వారిని హత్య చేసేందుకు సైతం వెనకాడటం లేదు. భార్యభర్తల మధ్య మనస్పర్థల బీజం మొలిచి పెను తుఫానుగా మారుతోంది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై దాపత్య జీవితంలో కొనసాగే వారికీ ఉండాల్సింది ఒకరిపై మరొకరరికి అపారమైన నమ్మకం. కానీ మారుతున్న జనరేషన్ కు అనుగుణంగా నమ్మకాల్లోనూ, భార్యాభర్తల మధ్య అనురాగాలు లేకపోగా అనుమానాలు., విబేధాలు పెరుగుతూ వస్తున్నాయి. పెళ్ళై ఏడాదైనా, కలసి పదేళ్లు జీవన ప్రయాణం సాగించిన ఒకరిపై మరొకరికి నమ్మకం కుదరని పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు కాపురాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. భర్త వేరొకరితో సంభంధం పెట్టుకున్నాడని భార్య.., భార్యపై అనుమానంతో భర్త.. కట్టుకున్నవారిన చంపేస్తున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగాఎవరితోనో చనువుగా ఉందని కట్టుకున్న భర్తే.. భార్యను హతమార్చిన ఘటన వెలుగు చూసింది.

  ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా... ప్రొద్దుటూరుకు చెందిన వెంగమ్మ అలియాస్ లక్ష్మికి(30) చంద్రబాబు కొట్టాలకు చెందిన ఆదినారాయణకి పదమూడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లైంది. వీరికి ఇద్దరులు కుమారులు ఉన్నారు. ఒకరు నిఖిల్ అయితే మరొకరు రామ్ చరణ్ ఉన్నారు. దంపతులిద్దరూ కూలీ పనులు చేస్తే తప్ప పూట గడవని స్థితి. ఇద్దరు ఒకే టమోటా మండిలో కూలీగా పనిచేస్తున్నారు. ఇలా 13 ఏళ్లుగా వారి దాపత్య జీవితం డబ్బులేకున్నా సజావుగా హాయిగా సాగింది. అయితే భార్యపై భర్తకు వచ్చిన అనుమానమే ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. దంపతుల మధ్య వివాహేతర సంబంధం అనే చిచ్చు అగ్గిని రాచేసింది.

  ఇది చదవండి: సిలిండర్లో గ్యాస్ కు బదులు నీళ్లు.., ఇదేం విచిత్రమో...!


  పదమూడేళ్ల కాలంలో ఇద్దరి మధ్య ఉండాల్సిన అన్యోన్యత నమ్మకం పోయి అనుమానంతో తరచూ గొడవపడేవారు. ఇటీవల వారి మధ్య గడొడవలు తారాస్థాయికి చేరాయి. గొడవపడ్డ అనంతరం ఇద్దరూ నిద్రపోయారు. ఐతే భార్యపై కక్షతో రగిలిపోయిన ఆదినారాయణ తెల్లవారుజామున భార్యను రోకలిబండతో మోదాడు. అనంతరం కత్తితో గొంతుకోశాడు. దీంతో లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం భర్త అక్కడి నుంచి పారిపోయాడు. ఉదయం స్థానికులు ఎంతపిలిచినా లక్ష్మి స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు ఆదినారాయణపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానం, క్షణికావేశం వెరసి భార్య ప్రాణాలు కోల్పోగా.. భర్త జైలు పాలయ్యాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.  ప్రస్తుతం వారు బంధువుల సంరక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది.
  Published by:Purna Chandra
  First published: