Home /News /andhra-pradesh /

TIRUPATI HUSBAND KILLED WIFE AS DOUBTED THAT SHE HAS EXTRAMARITAL AFFAIR IN PRAKASHAM DISTRICT FULL DETAILS HERE PRN TPT

Wife and Husband: రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న భార్య... ఓ రోజు ఆ విషయంలో గొడవ.. చివరకు..

చిత్తూరు జిల్లాలో భార్యను హత్య చేసిన భర్త

చిత్తూరు జిల్లాలో భార్యను హత్య చేసిన భర్త

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పీలేరు మండలం ముడుపుల వేములవారిపల్లెకు చెందిన రాజశేఖర్ నాయక్ కు పదేళ్ల క్రితం రోజాతో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఏ పనిచేయకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. భార్య ఎంతచెప్పినా అతడి ప్రవర్తనతో మార్పు రాలేదు.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, Tirupathi, News18

  మూడు ముళ్ల బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భార్యాభర్తలు ఒకర్నొకరు అర్ధం చేసుకొని ముందుకు వెళ్తే జీవతం సాఫీగా సాగుతుంది. అలా కాకుండా ఇద్దర్లో ఒక్కరు దారితప్పి ప్రవర్తించినా సంసారం అనుకున్న విధంగా ముందుకు కదలదు. అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త.. భార్యాపిల్లలను చూసుకోవాల్సిందిపోయి వ్యసనాలకు బానిసయ్యాడు. అక్కడితో ఆగలేదు స్మగ్లర్ అవతారమెత్తాడు. చివరకి అనుమానంతో కట్టుకున్న భార్యను పొట్టనపెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పీలేరు మండలం ముడుపుల వేములవారిపల్లెకు చెందిన రాజశేఖర్ నాయక్ కు పదేళ్ల క్రితం రోజాతో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఏ పనిచేయకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. వ్యసనాలకు బానిసై భార్యాపిల్లలను పట్టించుకోవడం మానేశాడు. భర్తను మంచిదారిలో పెట్టేందుకు రోజా ఎంతప్రయత్నించినా ఫలితం లేదు.

  భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో రోజా తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఐతే తాను మారిపోయానంటూ భార్యను ఒప్పించిన రాజశేఖర్ ఆమెను కాపురానికి తీసుకెళ్లాడు. ఐతే అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఆశతో ఎర్రచందనం స్మగ్లర్లతో చేతులు కలిపాడు. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తూ మూడుసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. భర్త స్మగ్లర్ గా మారడాన్న ఆగ్రహంతో ఆమె రోజూ గొడవపడుతుండేది.

  ఇది చదవండి: ఆమెకు ప్రియుడు తప్ప మరో లోకం లేదట.. అందుకే కట్టుకున్నవాడిని దారుణంగా..


  ఈ క్రమంలో మరోసారి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తతో ఎలాంటి సంబంధం లేకుండా పిల్లలను చదివిస్తోంది. ఇదిలా ఉంటే అప్పుడప్పుడు రాజశేకర్ నాయక్.. భార్య దగ్గరకు వెళ్లి డబ్బులు కావాలని వేధించేవాడు. ఐతే రోజురోజుకీ భర్త ఆగడాలు పెరిగిపోవడంతో రోజా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రాజశేఖర్ నాయక్ ను గట్టిగా మందలించారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్యపై కక్ష పెంచుకున్న రాజశేఖర్.. అదునుకోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల ఉపాధి కోసం అత్త దుబాయ్ వెళ్లడంతో భార్య హత్యకు పథకం వేశాడు.

  ఇది చదవండి: ఒకరితో సహజీవనం.. మరొకరితో ఎఫైర్.. ఈ ట్రయాంగిల్ స్టోరీలో షాకింగ్ ట్విస్ట్..


  ఓ రోజు భార్య దగ్గరకు వచ్చి ఆమెకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని గొడవపడ్డాడు. ఆ తర్వాత పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాతి రోజు కత్తి తీసుకొని ఇంటికి వచ్చి రోజాను గొంతుకోసి హత్య చేసి పరారయ్యాడు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు రాజశేఖర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతడిపై గతంలో వరకట్న వేధింపుల కేసుతో పాటు మూడు ఎర్రచందనం కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.

  ఇది చదవండి: దీన్ని లవ్ స్టోరీ అనాలా..? లేక మరొకటి అనాలా..? పోలీసులకు పిచ్చెక్కిస్తున్న జంట


  ఇటీవల ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సంతమాగలూరుకు చెందిన వెంకట నారాయణకు మూడేళ్ల క్రితం కృష్ణాజిల్లా చందర్లపాడు మండలానికి చెందిన మరియమ్మతో పెళ్లైంది. ఐతే భార్యపై అనుమానం పెంచుకున్న నారాయణ.. తరచూ ఆమెతో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో నారాయణ తన దగ్గరున్న కత్తితో ఆమెను నరికి హత్య చేశాడు. అనంతం మృతదేహాన్ని కాలువలో పడేశాడు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Chittoor, Husband kill wife

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు