చిన్నచిన్న అనుమానాలే ప్రాణాలు తీస్తున్నాయి. ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి. అన్యోన్యంగా దాంపత్య జీవితంలో అనుమానం పెనుభూతంలా మారుతోంది. కొందరు తమను నమ్మి వచ్చిన వారిని హతమార్చేందుకు సైతం వెనుకాడటం లేదు. క్షణికావేశంతో కట్టుకున్న భార్యను, పిల్లలను కడతేరుస్తున్న ఘటనలను మనం చూస్తున్నాం. వాళ్లిద్దరూ మూడు ముళ్ళు, ఏడు అడుగులతో అగ్ని సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. ఏడు నెలలుగా హాయిగా సాగిన వారి దాంపత్య జీవితంలోనే అనుమానం అనే పెనుభూతం ప్రవేశించింది. వందేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేలా చేసింది. అనుమానంతో రగిలిన పోయిన భర్త.. నిండు నూరేళ్లు కలసి జీవించాల్సిన భార్యను దారుణంగా హత్య చేశాడు. అక్కడితో ఆగాడా.. తన పైశాచికత్వాన్ని చూపించేలా... రక్తపుమడుగులో ఉన్న భార్య మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ కసాయి భర్తను చూసిన పోలీసులే షాక్ కు గురయ్యారు. వీడు కిరాతకుడుకు కాదు అంతకుమించిన వాడు అని చెప్పుకుంటున్నారు. అంతటి కక్షతో భార్యను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది..? హత్య చేసేటప్పుడైనా ఏడడుగులు వేసిన సంగతి మరిచాడా..?
వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన హరికి మంజులతో ఏడు నెలల క్రితం పెళ్లైంది. అమ్మాయి తరపువారు భారీ హంగులతో వీరి వివాహ వేడుకలు వారి శక్తికి తగ్గట్టు జరిపించారు. పెళ్ళైన రెండు నెలలు వరకు వారి జీవితం సాఫీగానే సాగింది. భార్య మెడలో తాళికట్టిన మూడు నెలలకే భార్యపై అనుమానం పెంచుకున్నాడు హరి. వేరేవరితోనో అక్రమ సంభంధం ఉందనుకొని నిత్యం మంజులతో గొడవకు దిగే వాడు. పెళ్ళయిన నాటి నుంచి నేటి వరకు నిత్యం వారి ఇంటి నుంచి అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయని ఇరుగు, పొరుగునున్న వారు చెబుతున్నారు. ఐతే రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి గొడవపడ్డ భార్యాభర్తలు... ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించారు.
ఐతే భార్యపై గొడవపడి ఆమెపై కక్ష పెంచుకున్న హరి.. తెలవారు జామున భార్య పాలిట కాలయముడయ్యాడు. గాఢనిద్రలో ఉన్న భార్యను కత్తితో పీకకోసి హత్య చేశాడు. దీంతో నిద్రలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఐతే అక్కడితో అతని పైశాచికత్వానికి ఫుల్ స్టాప్ పడలేదు. భార్య రక్తాన్ని ఒంటికి పూసుకొని.. ఆమె మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇరుగుపొరుగు ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని మంజుల భర్త హరిపై కేసు నమోదు చేశారు. మరోవైపు కన్నకూతురు జీవితం అర్ధాంతరంగా ముగియడంతో మంజుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.