Home /News /andhra-pradesh /

TIRUPATI HUSBAND BRUTALLY KILLED WIFE IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Chittoor Woman: భార్య తరచూ పుట్టింటికి వెళ్తుందని అనుమానించాడు.. అక్కడితో ఆగాడా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chittoor: దాంపత్య జీవితం నాశనం అవ్వడానికి అనుమానం ఒక్క కారణం అయితే మద్యం మరో సాకుగా మారుతోంది. కష్టాల్లోలైన... సుఖాల్లోలైన కలిసి నడుస్తామని అగ్ని సాక్షిగా వివాహం చేసుకొని వివాదాలు నెలకొన్న నేపథ్యంలో అర్ధాంతరంగా జీవితాలను కటకటాల పాలు చేసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, News18, Tirupati

    దాంపత్య జీవితం నాశనం అవ్వడానికి అనుమానం ఒక్క కారణం అయితే మద్యం మరో సాకుగా మారుతోంది. కష్టాల్లోలైన... సుఖాల్లోలైన కలిసి నడుస్తామని అగ్ని సాక్షిగా వివాహం చేసుకొని వివాదాలు నెలకొన్న నేపథ్యంలో అర్ధాంతరంగా జీవితాలను కటకటాల పాలు చేసుకుంటున్నారు. భార్య అలిగి పుట్టింటికి వెళ్లి అక్రమ సంభంధం పెట్టుకుందనే అనుమానం ఓ వైపు.., మద్యానికి బానిసవడం ఓ వైపు వెరసి కిరాతకుడిలా మారాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) గంగాధర నెల్లూరు మండలం, నల్లరాళ్ళపల్లెలో నివాసం ఉంటున్న చిన్నబ్బ మందడి కుమార్తె మోహన అలియాస్ రోజా(25)కు చిత్తూరు మండలం, వి.ఎన్.పురం గ్రామానికి చేందిన బాలయ్య కుమారుడు ప్రకాష్ తో 2020లో పెద్దలు వివాహం జరిపించారు..

    అయితే వివాహం అయినా కొద్ది రోజుల వరకూ ప్రకాష్ భార్య రోజాను‌ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.‌ గ్రామంలో తెలిసిన వారి ఇంటికి వెళ్ళినా అక్కడికి వెళ్ళొద్దంటూ ప్రకాష్ భార్యను మందలించేవాడు.‌ ఎవరితోనూ మాట్లాడించే వాడు‌ కాదు. దీంతో వారంలో ఓసారి రోజా అమ్మగారింటికి వెళ్ళేది. ‌అదే సమయంలో‌ భర్త ప్రకాష్ ను పిలిచినా వెళ్ళేవాడు కాదు. తరచూ భార్య అమ్మగారింటికి వెళ్ళి ఏదో చేస్తుందని అనుమానం‌ పెంచుకున్న ప్రకాష్ తరచూ మద్యం తాగేవాడు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో రోజాను మానసికంగా వేధింపులకు గురి చేసేవాడు. భర్త వేధింపులు భరించలేని రోజా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఐతే కొడుకును మందలించిన ప్రకాష్ తండ్రి.. కోడలికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో భార్యను చిత్రహింసలకు గురచేసేవాడు.

    ఇది చదవండి: వితంతువుపై కన్నేసిన కీచకుడు.. అతడికే సపోర్ట్ చేసిన తల్లి.. చివరకు ఏమైందంటే..!


    ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో భార్యతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత నిద్రపోతున్న భార్య తలపై బండరాయితో మోది, మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా సమీపంలోని నీవా నదిలో పడేశాడు. తర్వాతి రోజు గుర్తుతెలియని మృతదేహంగా భావించిన ఎన్.ఆర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. డెడ్ బాడీపై ఉన్న మంగళసూత్రం, మెట్టెలు, దుస్తుల ఆధారంగా విచారణ జరిపారు. విషయం తెలుసుకున్న అత్తమామలు.. ఆ మృతదేహం రోజాదేనని గుర్తించు. దీంతో రోజా భర్త ప్రకాష్ పై అనుమానంతో అతడికోసం గాలించగా అప్పటికే పరారయ్యాడు. ఈనెల 23న ఠాణా చెక్ పోస్ట్ వద్ద అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు