Wife Murder: లక్షలు సంపాదించే భార్యను చంపేశాడు... తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్.. చివరికి ఎలా చిక్కాడంటే..!

సంతోష్ రెడ్డి, భువనేశ్వరి (ఫైల్)

భార్య డెడ్ బాడీని సీక్రెట్ గా తీసుకెళ్లి దహనం చేశాడు. కానీ అతడు చేసిన చిన్న తప్పు పోలీసులకు పట్టించింది.

 • Share this:
  GK హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  ఆమె ఓ అనాథ. అయినప్పటికీ బాగాచదువుకోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కొలువు సంపాదించింది. ఓ వ్యక్తి పెళ్లిచేసుకుంటానని ముందుకు రావడంతో పొంగిపోయింది. అతడితో తాళికట్టించుకొని, ఏడు అడుగులు వేసింది. ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకొంది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. భర్త తన సైకోయిజంతో ఆమెను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. డబ్బు కోసం నిత్యం వేధిస్తున్నాడు. భార్య కష్టంతో వచ్చిన డబ్బులను హాయిగా ఖర్చుపెట్టడమే కాకుండా.. ఆమెను హతమార్చి ఎవరూ చేయనంత హడావిడి చేశాడు. చేసిన పాపం ఊరికే పోదు కదా వారం తిరిగేసరికి కటకటాల్లోకి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే. మారేంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పీపుల్ అగైనెస్ట్ కరప్షన్ అనే పార్టీని స్థాపించాడు. కడప జిల్లా బద్వేల్ లో ఈ పార్టీ పెట్టుకొని డబ్బుల కోసం నానా అడ్డదారులు తొక్కడం మొదలెట్టాడు. ఒకానొక దశలో మాజీ ఐఏఎస్ అధికారి స్థాపించిన లోక్ సత్త పార్టీ తరపున బద్వేల్ లో పోటీకి దిగాడు. ఘోరపరాభవం ఎదుర్కొన్నాడు.

  సోషల్ సర్వీస్ అంటూ హడావిడీ చేస్తూ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణతో పరిచయం ఏర్పడింది. వాటిని కూడా తెగప్రచారం చేసుకున్న శ్రీకాంత్ రెడ్డి... తన పాపులారిటీని పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. వెంటనే రంగంలోకి దిగి తిరుపతిలోని ఓ అనాధ శరణాలయంలో బాగా చదువుకున్న భువనేశ్వరిని పెళ్లిచేసుకున్నాడు. విద్యావంతురాలు కావడంతో తిరుపతి నుంచి మకాం హైదరాబాద్ కు షిఫ్ట్ చేసాడు. లక్షల్లో జీవితం కావడంతో భువనేశ్వరి సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి వెళ్ళడానికి శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి అడ్డు చెప్పలేదు.

  ఇది చదవండి: కూతురు ప్రేమను అంగీకరించని యువకుడు... అమ్మాయి తండ్రి చేసిన దారుణానికి షాకవ్వాల్సిందే..


  తాను రాజకీయాల్లో ఉన్నానని కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలని భువనేశ్వరికి నమ్మబలికాడు. అందుకు అంగీకరించిన ఆమె..., కుటుంబ భారాన్ని తనపై వేసుకుంది. అనాథ అయినప్పటికీ తనకు ఓ తోడు దొరికాడని సంబర పడింది. ఆమె ఆనందనం ఎన్నో రోజులు నిలబడలేదు. డబ్బులు ఇవ్వకపోతే నమ్మివచ్చిన భార్యను నోటికి వచ్చినట్లు మాట్లాడేవాడు. తాగొచ్చి బెల్టుతో ఒళ్ళు హూనం అయ్యేలా కొట్టేవాడు. అన్ని సహించుకొని వస్తుంది.

   ఇది చదవండి: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. జిల్లాల వారీగా కొత్త టైమింగ్స్ ఇవే..!


  ఇంతలో కరోనా లాక్ డౌన్ కావడంతో భువనేశ్వరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చారు. దీంతో శ్రీకాంత్ రెడ్డి కాపురాన్ని తిరుపతికి మార్చాడు. గత మూడు నెలలుగా భువనేశ్వరికి నిత్యం నరకం చూపిస్తున్నాడు. ఐతే గత మంగళవారం రాత్రి వేధింపులు మితిమీరడంతో డబ్బులిచ్చేది లేదని తెగేసిచెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన శ్రీకాంత్ రెడ్డి మద్యం మత్తులో భార్యను హత్య చేశాడు. వెంటనే క్యాబ్ బుక్ చేసి డ్రైవర్ సాయంత్రం మృతదేహాన్ని ఇంటి నుంచి రుయా ఆస్పత్రిలోని మెడిసన్ గోడౌన్ వెనుకవైపుకు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి కావడంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తన భార్యకు కరోనా డెల్టా వేరియంట్ సోకి చనిపోయిందని.. మృతదేహాన్ని రుయా సిబ్బందే ఖననం చేశారని బంధువులను నమ్మించాడు. అంతేకాదు హత్యచేసిన తర్వాతి రోజు రుయా ఆస్పత్రిలో హడావిడి చేశాడు. దీంతో బంధువులు కూడా భువనేశ్వరి కరోనా సోకి చనిపోయినట్లు నమ్మేశారు.

  Telangana Inter Results 2021: ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు... News18లో చూసుకోండి


  ఐతే భార్యను చంపేసిన మరుసటిరోజు కాలిన శవం, సూట్ కేసు కలకలం రేపిందు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారం వ్యవధిలోనే నిందితుడు శ్రీకాంత్ ను పట్టుకొని విచారణ చేపట్టారు. నిందితుడిపై గతంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ సలహా దారుడు సజ్జల పిఎ అంటూ ఓ ఎన్ఆర్ఐ వద్ద 30 లక్షలు కాజేసినట్లు బద్వేల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ తర్వాత కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు విచారణలో తేలింది.
  Published by:Purna Chandra
  First published: