TIRUPATI HUSBAND ATTACKED ON YOUNG MAN FOR HAVING EXTRAMARITAL AFFAIR IN CHITTOOR CITY OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Wife Affair: ఎదురింటి కుర్రాడితో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన భార్య.. వార్నింగ్ ఇచ్చినా మారలేదు.. చివరకు..
ప్రతీకాత్మకచిత్రం
అన్యోన్య దాంపత్యానికి మించిన స్వర్గం లేదని అంటారు పెద్దలు. భార్యభర్తలు నిజాయితీగా ఉన్నంత కాలం జీవితం హాయిగా సాగిపోతుంది. ఐతే ఎప్పుడైతే వారు దారితప్పారో అప్పుడు కాపురం క్షణకాలం కూడా నిలవదు. క్షణిక సుఖాల కోసం కాపురాన్ని నిప్పుల కొలిమిలా మార్చేసుకుంటున్నారు కొందరు.
అన్యోన్య దాంపత్యానికి మించిన స్వర్గం లేదని అంటారు పెద్దలు. భార్యభర్తలు నిజాయితీగా ఉన్నంత కాలం జీవితం హాయిగా సాగిపోతుంది. ఐతే ఎప్పుడైతే వారు దారితప్పారో అప్పుడు కాపురం క్షణకాలం కూడా నిలవదు. క్షణిక సుఖాల కోసం కాపురాన్ని నిప్పుల కొలిమిలా మార్చేసుకుంటున్నారు కొందరు మహిళలు. భర్తతో సఖ్యత నశించి పక్క దారి పడుతున్నారు. భర్తతో సుఖం లేదని భావించిన ఓ వివాహిత పక్క చూపులు చూసింది. అంతేకాదు ఏ భర్తకు కనపించని స్థితిలో కనిపించింది. అయినా గుండెరాయి చేసుకున్న భర్త హెచ్చరికతో భార్యను మందలించాడు. కానీ ఆ తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు (Chittoor) నగరంలోని సంతపేట ఇందిరా కాలనీలో శ్రీనివాసులు భార్యతో కలసి నివాసం ఉంటున్న. అక్కడే చిన్న హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పాషిస్తున్నాడు.
శ్రీనివాస్ ఇంటికి ఎదురు ఇంటిలో సాయి ప్రకాష్ (23) అనే యువకుడు తన తల్లితో కలసి నివాసం ఉంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన సాయిప్రకాష్ చిత్తూరు నగరంలో కంప్యూటర్ కోర్స్ ను అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉండే శ్రీనివాస్ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. వారితో నిత్యం కాలక్షేపం చేస్తూ ఉండేవాడు సాయి ప్రకాష్. ఇలా శ్రీనివాసులు భార్యతో సాయి ప్రకాష్ కు చనువు ఏర్పడింది. ఆ చనువు కాస్త.., మరింత ముదిరి అక్రమ సంబంధానికి దారి తీసింది.
భర్తకు తెలియకుండా సాయి ప్రకాష్ ను ఇంటికి పిలిపించుకుంటున్న భార్య.. అతడితో ఏకాంతంగా గడిపోది. ఇదిలా ఉంటే వీరి సంబంధాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు విషయాన్ని శ్రీనివాసులుకు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన శ్రీనివాసులు.. ప్రకాశ్ పై నిఘా ఉంచాడు. ఇలా ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో నేరుగా ఇంట్లోకెళ్లి పట్టుకున్నాడు. భార్యకు వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలా చేయవద్దని మందలించాడు. అయినా అటు సాయి ప్రకాష్ గానీ.. ఇటు శ్రీనివాసులు భార్యగానీ భర్త మాట పట్టించుకోలేదు. దీంతో స్థానిక నేతలతో ప్రకాష్ కి వార్నింగ్ ఇప్పించినా ప్రవర్తనలో మార్పురాలేదు.
చివరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా.. కేసు నమోదు చేసిన పోలీసులు సాయిప్రకాష్ ను, శ్రీనివాసుల భార్యను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ఇద్దరి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోగా మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టారు. దీంతో సాయి ప్రకాష్ పై కక్ష పెంచుకున్న శ్రీనివాసులు.. మంగళవారం రాత్రి అతడి ఇంటికి వెళ్లి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రకాష్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.