హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala Temple: తిరుమలలో అనూహ్య రద్దీ.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. టీటీడీ కీలక నిర్ణయం

Tirumala Temple: తిరుమలలో అనూహ్య రద్దీ.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల (Tirumala) క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. రెండేళ్ళ తరువాత శ్రీనివాసుడి దర్శనార్ధం (Srivari Darshanam) అధిక సంఖ్యలో తిరుమలకు ఇచ్చేసిన భక్తులతో కిటకిట లాడుతున్నాయి. వీకెండ్ కావడంతో కొండపై ఊహించని రీతిలో‌ ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

తిరుమల (Tirumala) క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. రెండేళ్ళ తరువాత శ్రీనివాసుడి దర్శనార్ధం (Srivari Darshanam) అధిక సంఖ్యలో తిరుమలకు ఇచ్చేసిన భక్తులతో కిటకిట లాడుతున్నాయి. వీకెండ్ కావడంతో కొండపై ఊహించని రీతిలో‌ ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొదలుకొని, క్యూలైన్స్ పూర్తిగా భక్తులతో నిండి పోయింది. విశేష సంఖ్యలో వచ్చిన భక్తుల గోవింద నామస్మరణలతో శేషాచలం మారుమ్రోగుతున్నాయి. ఇక శ్రీ వేంకటేశ్వరుడి దర్శనార్ధం నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వివిధ రాష్ట్రాల నుండి తిరుమలకు చేరుకుంటారు. ఇలా చేరుకున్న భక్తులు క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటలు, రోజులు తరబడి వేచి ఉండి మరి స్వామి వారి ఆశీస్సులు పొందుతుంటారు.

కోవిడ్ పూర్తి స్ధాయిలో అదుపులోకి రావడంతో టిటిడి సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ టిక్కెట్లు లేకుండానే భక్తులను కొండకు అనుమతిస్తూ వస్తుంది. ఈక్రమంలో గత కొద్ది నెలలుగా భక్తుల సంఖ్య భారీగా తిరుమలలో కొనసాగుతూ వస్తుంది.. అయితే ప్రస్తుతం పదోవ తరగతి పరిక్షలు పూర్తి కావడంతో తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులతో తిరుమలగిరులు నిండి పోయింది.‌. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1,2 లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండి పోవడంతో సర్వదర్శనం క్యూలైన్ లేపాక్షి సర్కిల్ దాటుకుని షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా పాత అన్నదాన సత్రం వరకూ చేరింది.

ఇది చదవండి: రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. టీటీడీ చర్యలు.. సామాన్యులకు కష్టాలు తప్పినట్టేనా..?


పదో తరగతి పరిక్షలు పూర్తి కావడం, వారంతరాలు కావడంతో భక్తుల సంఖ్య ఏడుకొండలపై మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదీ ఏమైనప్పటికీ రెండేళ్ళ కాలంలో కోవిడ్ పూర్తి స్ధాయిలో తగ్గడంతో పాత అన్నదానం సత్రం వరకూ రావడం ఇదే మొదటి సారి. వాతావరణంలో మార్పు కారణంగా తిరుమలలో తేలికపాటి చిరుజల్లులు కురుస్తున్నా భక్తులు మాత్రం ఏమాత్రం క్యూలైన్స్ నుండి బయటక రావడం లేదు. భక్తుల రద్దీ పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్స్ వద్ద అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది చదవండి: తిరుమల శ్రీవారి చెల్లెమ్మ ఈ గంగమ్మ..! ఆ వేషంలో బూతులు తిట్టినా ఏమీ అనరు.. గంగమ్మ జాతర విశేషాలెన్నో..


భక్తుల అనూహ్యం రద్దీపై వివిధ విభాగాధిపతులతో టిటిడి ఈవో ధర్మారెడ్డి సెట్స్ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా క్యూలైన్స్ వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్నప్రసాదం, త్రాగునీరు,పాలు వంటి సౌఖర్యాలు ఏర్పాట్లు చేసారు టిటిడి అధికారులు. మరికొద్ది రోజుల పాటు భక్తుల రద్దీ ఏడుకొండలపై కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు అవసరం అయ్యే ఏర్పాట్లపై అధికారులు నిమగ్నం అయ్యారు.. భక్తుల సంఖ్య పెరగడంతో భక్తుల రద్దీ ప్రదేశాలైన అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అతిధి గృహాలు, వసతి భవనాలు, పిఏసీ-1,2,3,4,5 వద్ద పోలీసులు భధ్రత ఏర్పాట్లు కట్టిదిట్టం చేశారు. మరోవైపు చిరుజల్లు కురుస్తుండడంతో ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులకు టిటిడి విజిలెన్స్ సిబ్బంది సూచనలు చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Tirumala Temple, Tirumala tirupati devasthanam

ఉత్తమ కథలు