ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఘోరం జరిగింది. కలసపాడు మండలం, మామిళ్లపల్లె వద్ద ఉన్న ముగ్గురాని గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. పేలుడు జరిగిన సమయంలో క్వారీలో 20 మందికి పైగా కార్మికులున్నట్లు తెలుస్తోంది. క్వారీలో బ్లాస్ట్ జరిపేందుకు వాహనంలో జిలెటిన్ స్టిక్స్ తరలిస్తుండగా ప్రమావదవశాత్తు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కూలీల మృతదేహాలు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా తునాతునకలయ్యాయి. జిలెటిన్ స్టిక్స్ తీసుకొస్తున్న వాహనం కూడా ముక్కలుముక్కలైంది. ఆ ప్రాంతమంతా రక్తపు మడుగులత భీతావాహంగా మారింది. ప్రమాదంలో పలువురకి తీవ్రగాయాలయాయ్యా.. గాయపడ్డవారిని పోలీసులు ఆస్స్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఇక్కడ బ్లాస్ట్ జరపడానికి అనుతులున్నాయా..? జిలెటిన్ స్టిక్స్ తీసుకురావడంలో ఏమైనా పొరబాటు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను సీఎంఓ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం జగన్.., బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
పేలుడు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. ముగ్గురాళ్ల గనిలో రాయి తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు పలువురు మృతి చెందడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమన్న చంద్రబాబు.. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ సమయంలో మైనింగ్ కు ప్రభుత్వం ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఎటువంటి పరిహారం ఇచ్చారో ఇక్కడ కూడా అదే విధమైన పరిహారం అందించి బాధిత కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh