హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: తిరుమల శ్రీవారికి వెన్న, నెయ్యి, పాలు ఎలా వస్తాయో తెలుసా..? అక్కడి గోవుల విశిష్టతలివే..!

Tirumala: తిరుమల శ్రీవారికి వెన్న, నెయ్యి, పాలు ఎలా వస్తాయో తెలుసా..? అక్కడి గోవుల విశిష్టతలివే..!

తిరుమల శ్రీవారు

తిరుమల శ్రీవారు

TTD: అనంత కోటి భక్తుల కొంగుబంగారమై శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన ఇల వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రం. శ్రీవారికి గో మాతకు విడతీయరాని అవినాభావ సంభంధం ఉంది. శ్రీ మహా విష్ణువు శ్రీ లక్ష్మీ అమ్మవారి విరహితుడై... అమ్మవారి జడ కోసం ఏడుకొండలపై వెతుకులాట సాగించాడు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirumala, India

  GT Hemanth Kumar, News18, Tirupati

  అనంత కోటి భక్తుల కొంగుబంగారమై శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన ఇల వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రం. శ్రీవారికి గో మాతకు విడతీయరాని అవినాభావ సంభంధం ఉంది. శ్రీ మహా విష్ణువు శ్రీ లక్ష్మీ అమ్మవారి విరహితుడై... అమ్మవారి జడ కోసం ఏడుకొండలపై వెతుకులాట సాగించాడు. ఇంతకీ అమ్మవారు కనిపించక పోవడంతో ఓ పుట్టలో తల దాచుకున్న శ్రీవారికి ఓ గోమాత నిత్యం పాలను అందిస్తూ శ్రీ శ్రీనివాసుడి ఆకలిని తీర్చేదని పురాణాలూ చెప్తున్నాయి. కలియుగంలో దుష్ట శిక్షణ-శిష్ట రక్షణార్థం వెలసిన స్వామి వారికీ వివిధ ప్రసాదాలు తాయారు చేస్తారు.  ఈ ప్రసాదాలు, కైంకర్యాలు సైతం వైఖానస మహర్షి రచించిన ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తుంటారు వేదపండితులు. శ్రీవారి కైంకర్యాలకు స్వచ్ఛమైన స్వదేశీ ఆవు పాలతోనే నిర్వహించాలనే నియమం ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగి...నిత్య సేవలకు వినియోగించుకొనే పాలను ఎక్కడ నుంచి సేకరిస్తారు. నెయ్యి., వెన్నను ఎక్కడ నుంచి తీసుకువస్తారు...?

  వేదాల్లో ఎంతో ప్రాముఖ్యం ఉన్న దేశీయ గోవుల సంరక్షణార్థం., స్వామి వారి కైంకర్యాలు నిమిత్తం టీటీడీ శ్రీవెంకటేశ్వర గో సంరక్షణ శాలను స్థాపించింది. తిరుపతి- చంద్రగిరి గిరి మార్గంలోని తుమ్మలగుంటకు సమీపంలో 1956వ సంవత్సరంలో ఈ గో సంరక్షణ శాలను టీటీడీ ప్రారంభించింది. స్వామి వారికీ నిత్య సేవలైన.... సుప్రభాతం సేవలో నవనీతం (వెన్న), తోమాల సేవలో (పాలు), ఇతర ప్రసాదాల్లో వినియోగించుకునే పాలను టీటీడీ ఈ గో సంరక్షణ శాలలో ఉత్పత్తి చేస్తుంది. రోజుకు సుమారు తొమ్మిది వందల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. దేశవాళీ గో జాతులను ఇక్కడ సంరక్షిస్తున్నారు.

  ఇది చదవండి: శ్రీవారికి సేవచేసే అరుదైన భాగ్యం ఈయనకు దక్కింది.. ఇంతకీ మణి ఏం చేస్తారో తెలుసా..?

  దేశంలో గల 14 రకాల గో జాతులలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పుంగనూరు.. ఒంగోలు జాతులు., తమిళనాడుకు చెందిన ఉంబలాచారి.. తాంగయ్యాన్., గుజరాత్ కు చెందిన గీర్..కాంక్రీజ్, పంజాబ్ కు చెందిన సాహీవాల్ జాతి, హర్యానాకు చెందిన హర్యాన్, థార్పార్కర్, కర్ణాటకకు చెందిన హాలికర్, కేరళకి చెందిన వేచూర్ క్యాట్ జాతులతో పాటు మరికొన్ని విశేష జాతులు ఉన్నాయి. ఈ ఆవులకు సేంద్రీయ పద్దతుల్లో పండించిన ఆహారాన్ని ఆహారాన్ని అందిస్తారు. వాటికీ కావాల్సిన పోషకాలు మెండుగా ఉండేలా పచ్చ గడ్డి., ఇతర మొక్కలతో కలసిన మేతను వేస్తారు. ఈ ఆహారాన్ని పశువైద్య నిపుణులు సూచించే సైంటిఫిక్ ఆహారాన్నే అందిస్తారు.

  వయస్సు., వాటి ఎత్తును బట్టి ఎంత మేరకు ఆహారం అవసరమో అంత మేరకు ఇస్తుంటారు.

  ఇది చదవండి: బ్రహ్మోత్సవాల నుంచి తిరుమలలో కొత్త బస్సులు.. ఈ రూట్లలో అందుబాటులోకి.. వివరాలివే..!

  సంప్రదాయం ప్రకారం... సుప్రభాత సేవ, ఏకాంత సేవకలో నవనీతం ఎంతో ముఖ్యమైనది. స్వామి వారికీ వినియోగించే ప్రసాదాలు అన్ని శాస్త్రబద్ధంగా ఉండాలి. గోశాలలో ఉన్న దేశి వాలి గోవుల ద్వారా స్వీకరించిన స్వచ్ఛమైన పాలు సుప్రభాతం., తోమాల ఏకాంత సేవలో నిర్వహిస్తారు. ఇక శుక్రవారం ఉదయం నిర్వహించే అభిషేక సేవకు 250 లీటర్ల పాలను తిరుపతి గోశాల నుంచి తిరుమలకు తీసుకెళ్తారు. ఇక స్వామి వారికీ నైవేధ్యంగా వినియోగించే.. బెల్లం పాయసం, పాల్ పాయసంకు పాలను వినియోగిస్తారు.

  ఇది చదవండి: తిరుమల లడ్డూకి అంత చరిత్ర ఉందా..? లడ్డూ ప్రసాదం ఎలా ప్రారంభమైందంటే..!

  బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే స్నాపన తిరుమంజనం., చక్రస్నానంకు వినియోగించే పాలు., పెరుగు  తిరుపతి గోశాల నుంచి తిరుమలకు పంపుతారు. ఇక నిత్య కైంకర్యల్లో వినియోగించే పెరుగు రోజుకు 150 లీటర్లు శ్రీవారు ఆలయానికి పంపుతారు. ఒక్క శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి ఆలయానికి సుమారు 50 లీటర్లు అవసరం అవుతుంది.

  ఇది చదవండి: శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉందా..? స్వామి వెనుక సొరంగం నిజమేనా.! న్యూస్18 ఎక్స్ క్లూజివ్..!

  టీటీడీ గో సంరక్షణ శాలలో విరాళం రూపంలో ఇచ్చిన ఆవులను పరిరక్షిస్తున్నారు. దూడ ఆకలి తీరిన అనంతరం మిగిలిన పాలను శ్రీవారి కైంకర్యాలకు వినియోగిస్తారు. ఇలా రోజు దినసరి ప్రక్రియగా నిర్వహిస్తుంది. పశువైద్య యూనివర్సిటీ వైద్యులు., టీటీడీ సహకారంతో క్రాస్ బ్రీడింగ్ ప్రక్రియ సైతం ప్రారంభిస్తున్నారు.

  "శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు...టీటీడీ అధీనంలో ఉన్న ఆలయాలకు నిత్యం పాలు., పెరుగు., వెన్న తిరుపతి గోశాల నుంచి పంపుతున్నాను. 14 రకాల దేశవాళీ గో జాతులను సంరక్షిస్తూ వాటి ద్వారా వచ్చే పాలను శ్రీవారి కైంకర్యాలకు నిర్వహిస్తున్నాం. గో ఆధారిత వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. విసిటింగ్స్ కు వస్తున్న విద్యార్థులకు గోవు యొక్క ప్రాముఖ్యత., పాడి పరిశ్రమపై అవగాహనా కల్పిస్తున్నాం. గో ముయంతో సేంద్రియ ఎరువులను తాయారు చేసి రైతులకు అందిస్తున్నాం. బెలోన పద్దతిలో పల నుంచి పెరుగును, పెరిగి నుంచి వెన్నను., వెన్న నుంచి నెయ్యిని తాయారు చేసే ప్రక్రియ ప్రారంభించాం" అని గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి న్యూస్18 తో చెప్పారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd

  ఉత్తమ కథలు