TIRUPATI HOUSE OWNER REFUSED TO BRING TENANT DEAD BODY INTO HOME AS MLA HELPS THE DECEASED FAMILY IN CHITTOOR DISTRICT FULL DETAILS HERE PRN TPT
Very Sad: మానవత్వం మంటగలిసిపోతుందనడానికి ఇదే నిదర్శనం.. మరీ ఇంత దారుణమా..?
ప్రతీకాత్మక చిత్రం
Sad News: పెళ్లికి వెళ్లకపోయిననా పర్లేదు. ఓ వ్యక్తి అంతిమ యాత్రకు మాత్రం కచ్చితంగా వెళ్లాలని పెద్దలు చెప్పేవారు. అందులోనే జీవిత పరమార్ధం దాగి ఉందని భౌతిక ఖాయం ఖననం చేసే సమయంలో ఎవరైనా భూమిలో కలవాలనే సూత్రాన్ని నేర్చుకోవాలి అంటారు. ప్రస్తుత సమాజంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు.
మాయమవుతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ ఓ రచయిత రాసిన పాట ప్రస్తుత సమాజం తీరుకు అద్దం పడుతోంది. మనం బాగుంటే చాలు అవతలి వాళ్ళు ఎలా పోతే మనకెందుకులే అనే రోజులు ప్రస్తుతం నడుస్తున్నాయి. పక్కవాడు కష్టంలో ఉంటే కనీసం కన్నెత్తి చూసే పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. కరోనా కాలంలో అందరికీ జీవితం విలువ తెలిసొచ్చినా.. సాయమనే పదం అదరికీ అలవాటైనా.. కొందరి కరుడుగట్టిన హృదయాలు ఇంకా కరగలేదు. సరికదా మరింత కఠినంగా మారుపోతున్నారు. పెళ్లికి వెళ్లకపోయిననా పర్లేదు. ఓ వ్యక్తి అంతిమ యాత్రకు మాత్రం కచ్చితంగా వెళ్లాలని పెద్దలు చెప్పేవారు. అందులోనే జీవిత పరమార్ధం దాగి ఉందని భౌతిక ఖాయం ఖననం చేసే సమయంలో ఎవరైనా భూమిలో కలవాలనే సూత్రాన్ని నేర్చుకోవాలి అంటారు. ప్రస్తుత సమాజంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిపై మంచేమో కానీ.. కర్కశంగా వ్యవహరిస్తూ మానవత్వానికి మచ్చగా మారుతున్నారు. ఓ ఇంటి యజమాని చేసిన పనికి ఆపదకాలంలో ఉన్న ఆ పెద్ద కుటుంబం రోడ్డున పడింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన తెలిస్తే కన్నీళ్లు అవగావు.
వివరాల్లోకి వెళితే.., శ్రీకాళహస్తి పట్టణంలోని అగ్రహారంలో నివాసం ఉంటున్నారు మహబూబ్ బాషా, రేష్మ. మహబూబ్ బాషా ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అనారోగ్య కారణంగా కొన్నాళ్లు క్రిందట బాషా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. సొంతిల్లు లేని రేష్మ అద్దె ఇంట్లో ఉంటున్నారు. మహబూబ్ బాషా మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఇంటి యజమాని మాత్రం ఒప్పుకోలేదు. ఇంటి ముందు మృతదేహం పెడితే ఇంట్లోని వస్తువులను బయట పడేస్తానని బెదిరించాడు. యజమాని కర్కశత్వానికి భయపడ్డ రేష్మ ఏంచేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఇద్దరు పిల్లలతో భర్త మృతదేహంతో రోడ్డుపైనే దీనంగా కూర్చొని రోదిచింది.
ఘటనపై సమాచారం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హుటాహుటిన రైల్వే స్టేషన్ చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. దహన సంస్కారం నిమిత్తం రూ.15000 రూపాయలు అందజేశారు. ఆపద సమయంలో ఆదుకున్న ఎమ్మెల్యేకి మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరువిలపిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ఇల్లు లేని పేదవాళ్ళు చనిపోతే వారి అంతిమ సంస్కారాలు నిర్వహణకు ఓ కమ్యూనిటీ హల్ నిర్మిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఉచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.