GT Hemanth Kumar, Tirupathi, News18
Tirumala: అనంత కోటి భక్తుల ఆరాధ్య దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వరుడుకి (Swamy Lord Venkateswara Swamy) అపురూపమైన కానుకలు.. ఎనలేని సంపదలు ఎంతో భక్తి శ్రద్దలతో శ్రీవారికి సమర్పిస్తారు భక్తులు.. కేవలం ఆంధ్ర్రప్రదేశ్ (Andhra Pradesh) , తెలంగాణ (Telangana)లతో పాటు వివిధ రాష్ట్రాల్లో శ్రీవారికి కోట్ల విలువచేసే మాన్యాలు ఉన్నాయి. కలియుగ వరదుని దర్శనార్థం అశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామి వారి స్వరూపాన్ని చూసి.. తన్మయత్వం చెంది ముడుపులు శ్రీవారి హుండీలో సమర్పిస్తారు. ఇలా హుండీలో సమర్పించిన కానుకలను పరకామణిలో లెక్కిస్తారు. వచ్చే కానుకలను రూపాయి నుంచి పెద్ద పెద్ద నోట్ల వరకు వేరు చేసి లెక్కిస్తారు. చిల్లర నాణేలను చిల్లర నిల్వ ఉంచే గోడౌన్ కు పంపుతారు. నోట్లను లెక్కింపు చేసి వివిధ బ్యాంకులలో జమ చేస్తారు. ఇక స్వామి వారికి సమర్పించే కానుకల్లో స్వదేశీ కరెన్సీతో పాటు.. విదేశీ కరెన్సీ సైతం భక్తులు సమర్పిస్తారు. ఆలా సమర్పించిన విదేశీ కరెన్సీ విలువ ఎంతో తెలిస్తే షాక్ తింటారు.
మనదేశం నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు.. విదేశీయులు వేంకటేశ్వరుని దర్శనార్థం వస్తుంటారు. వారు చెల్లించే కానుకలు హుండీలో తమ కరెన్సీ తో పాటే మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. వెంకన్నకు ఏటా అధికశాతం విదేశీ కరెన్సీ సైతం హుండీలో జమ అవుతున్నాయి. వీటిని ప్రత్యేకంగా వేరు పరిచి అధిక శాతం వచ్చే నోట్లను వచ్చే వరకు నిల్వ ఉంచుతారు.
ఇక విదేశీ నాణేలను టెండర్ ప్రక్రియ ద్వారా అమ్మకాలు చేపడుతారు. విదేశీ భక్తులు సమర్పించిన కరెన్సీ, నాణేలతో స్వామి వారి హుండీలో పరవళ్లు తొక్కుతోంది. కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు పోటెత్తున్నారు. ఏటా దాదాపు 2.5 కోట్ల మంది దేశ, విదేశాల నుంచి తిరుమలకు తరలివచ్చి వేంకటేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. పెద్దసంఖ్యలో భక్తులు సందర్శించే క్షేత్రంగా గుర్తింపుతో పాటు అత్యధిక ఆదాయం ఆర్జించే ఆలయాల జాబితాలోనూ తిరుమలదే అగ్రస్థానం.
ఇదీ చదవండి : మాచర్లలో అసలు ఏం జరిగింది అంటే? వారిని అదుపులోకి తీసుకున్నామన్న ఎస్పీ
దేశంలో ఏ ఆలయానికీ లేనివిధంగా ఇటీవల తిరుమల మరో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కరెన్సీ శ్రీవారి హుండీలో ప్రత్యక్షమవుతోంది. గతంలో దేశ సరిహద్దుల్లో ఉన్న దేశాల కరెన్సీ మాత్రమే హుండీల్లో కనిపించేవి. కానీ ప్రస్తుతం ముస్లిం దేశాలతో పాటు క్రైస్తవ దేశాల నాణేలు కూడా వస్తు న్నాయి. దీని ప్రకారం చూస్తే తిరుమలకు అంతర్జాతీయంగా భక్తుల తాకిడి పెరుగుతోందన్న విషయం అర్థమవుతోంది.
ఇదీ చదవండి : ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు.. సచివాలయ కన్వీనర్ల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే..
టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం... స్వామివారి హుండీ లెక్కింపులో భాగంగా 15 దేశాలకు చెందిన నాణేలను అధికారులు గుర్తించారు. ఈ నాణేల అమ్మకానికి అధి కారులు ఇటీవల టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. తొలుత బ్రిటన్, యూరో, కువైత్, థాయిలాండ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్ చెందిన నాణేలకు టెండర్లు పిలవగా రూ.1,14,85,814, శ్రీలంక, ఒమాన్, నేపాల్, దేశాలైన, ఖతర్, దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్కు చెందిన నాణేలు రూ.16,34,326 ధర పలికాయి. మొత్తంగా 15 దేశాలకు చెందిన కరెన్సీకి టెండర్ల ద్వారా టీటీడీకి రూ.1.31 కోట్ల ఆదాయం లభించింది. టెండర్లలో పాల్గొని హెచ్1గా ఎంపికైన కంపె నీలకు వాటిని అధికారులు అప్పగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirumala tirupati devasthanam, Tirupati