M. Bala Krishna, Hyderabad, News18
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), రష్మిక (Rashmika Mandanna), ఫహద్ ఫాజిల్ (Fahad Fazil), సునీల్ (Sunil), అనసూయ (Anasuya) ప్రధాన పాత్రల్లో సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో వచ్చిన మూవీ పుష్ప.. ది రైజ్ (Pushpa Movie). శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పుష్ప సినిమా పూర్తిగా ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో చితరీకరించారు. ఎర్రచందనం ప్రత్యేకతలేంటి.. ఈ అరుదైన కలప స్మగ్లింగ్ ఎలా జరుగుతుందనే అంశాలనై డైరెక్టర్ సుకుమార్ ప్రధానంగా దృష్టి పెట్టారు. పుష్ప రీలీజై తర్వాత ఇప్పుడు ఎర్రచందనం పై అందరిల్లో ఆసక్తి నెలకొంది. అసలు ఎర్రచందనం మన రాష్ట్రంలో అక్కడడే ఎందుకు ఎక్కవగా లభిస్తుంది..? అసలు ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్ లో ఎందుకు అంత డిమాండ్..? మన రాష్ట్రంలో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా సాగుతుంది అనే అంశాలపై చర్చ జరుగుతోంది.
ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఎర్రచందనం తూర్పు కనుమలలో, ముఖ్యంగా ఆంధ్రలోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం అడవుల్లో మాత్రమే పెరుగుతుంది. ఎర్ర చందనాన్ని రెడ్ శాండిల్, శాండిల్ వుడ్ మరియు రూబీ రెడ్ అని కూడా పిలుస్తారు. ఈ కలప ఎరుపు రంగులో ఉండి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాదు అధిక ధృఢత్వం కలిగిన కలపగా దీనికి పేరుంది. జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ఈ కలపకు అధిక డిమాండ్ ఉంది. ఈ కలప చట్టపరమైన ఎగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ.., శేషాచలంలో పెరిగే ఎర్రచందనాన్ని మాఫియా అక్రమంగా స్మగ్లింగ్ చేస్తోంది. ఇందుకోసం పెద్ద నెట్ వర్కే ఉంది. ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారుల కళ్లుగప్పి స్మగర్లు ఈ విలువైన వృక్ష సంపదను దేశం దాటిస్తున్నారు. స్మగ్లింగ్ కారణంగానే గడిచిన రెండు దశాబ్దాల్లో ఆంధ్రాలో ఎర్రచందనం చెట్ల సంఖ్య 50% మేర తగ్గింది.
ఇక్కడే ఎందుకు పెరుగుతాయి..?
అయితే ఈ చెట్లు తూర్పు కనుమలలో మాత్రమే ఎందుకు పెరుగుతాయి..? రాయలసీమ ప్రాంతాన్ని ఎర్రచందన చెట్లకు అనువుగా మార్చే పరిస్థితులు ఏంటీ..? అనే అంశాలపై తిరుపతికి చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి ఎన్ నాగేశ్వరరావు న్యూస్18కి ఇలా చెప్పారు. “ఈ ప్రాంతంలో నేల చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ నేలలో నీటి శాతం, ఆమ్లత్వం, గాలి మరియు పోషకాల లభ్యత చాలా బాగుంటుంది. ఇవి ఇక్కడ ఎర్రచందన చెట్లు పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటు ఇలాంటి నేల మీకు మరెక్కడా కనిపించదు. ఈ రకమైన నేల ఈ ప్రాంతంలో ఎర్రచందనం పెరగడం సాధ్యపడుతుంది" అని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎర్రచందనం దక్షిణ అటవీ భూభాగంలో సుమారు 5,160 చదరపు కిలోమీటర్లు, తమిళనాడు, కర్ణాటకలోని కొంతభాగంలో విస్తరించి ఉన్నాయి. కడపలోని యోగి వేమన యూనివర్శిటీకి చెందిన వి రామబ్రహ్మం ఎర్రచందనం గురించి ఏమన్నారంటే… “ఇది 50-150 సెం.మీ వ్యాసంతో 8 మీటర్ల పొడవు వరకు పెరిగే తేలికపాటి డిమాండ్ గల మోడరేట్ సైజు చెట్టు. ఇది చిన్నతనంలో వేగంగా పెరుగుతుంది. మూడేళ్లలో 5 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఇది మంచును తట్టుకోలేదు. IUCN (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) తాజా నివేదిక ప్రకారం దాని ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా స్మగ్లింగ్ కు గురైయ్యే చెట్టుగా ఎర్రచందన ఉంది. ఇది ఇంత మొత్తంలో స్మగ్లింగ్ అవడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను ఎర్రచందనం కలప ధర దాదాపు రూ. 1.5 కోట్లు ఉండడమే. ఈ కలపను కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్, ఔషధాలు, రంగులు, సంగీత వాయిద్యాలు, ఫర్నీచర్ తయారీలో వినియోగిస్తారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్ లో ఈ కలపకు అంత డిమాండ్ ఉంది.” అని వివరించారు. తాజాగా పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా చేస్తారు.. చెట్లను నరికి అడవి నుంచి ఎలా తరలిస్తారు.. అనే అంశాలు చూపించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu arjun pushpa movie, Andhra Pradesh, Director sukumar, Red sandal