GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
రాయలసీమలో రత్నాలు, వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మిన నేల. రాయలోరి కాలంలో సంపన్న సీమలో ఎన్నో విలువైన వజ్రాలు, బంగారం నిల్వలు ఉండేవని పూర్వికులు చెపుతుంటారు. రాయలసీమలో ఇప్పుడు చెప్పబోయే ప్రాంతం గురించి మనకు పూర్వికులు చెప్పాల్సిన అవసరం లేదు. వేలు విలువ చేసే రంగురాళ్ల నుంచి లక్షలు, కోట్లు విలువచేసే వజ్రాలు దొరుకుతున్నాయను రోజు వింటున్నాం. రాయలసీమ జిల్లాలోని ఏ ప్రాతంలో వజ్రాలు దొరుకుతున్నాయి...?? తొలకరి చినుకులు నేలను తాకగానే వజ్రాలు ఎందుకు బయటకు వస్తున్నాయి...?? అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఏమిటి..?? వజ్రం పొదిగిన ఆభరణాలకు ఎంతో ఖరీదైనవి. ఇది సామాన్యునికి దొరకని అరుదైన ఆభరణం. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు వజ్రాలు మార్కెట్ లో లభిస్తుంది. సంపన్నులు., పెద్ద వ్యాపార వేతల దగ్గర మాత్రమే ఈ నాణ్యమైన అత్యంత ఖరీదైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఉంటాయి. అయితే అనంతపురం కర్నూలు జిల్లాలో రైతుల పాలిట వరంగా మారుతున్నాయి.
నష్టాల ఊబిలో కూరుకు పోయిన రైతన్నను సంపన్నులుగా మారుస్తున్నాయి రంగురాళ్ళూ, వజ్రాలు. కర్నూలు జిల్లా తుగ్గలిలోని జొన్నగిరి, అనంతపురం జిల్లా వజ్రకరూర్ లో వర్షాలు పడ్డాయి అంటే చాలు, వజ్రాలకు ప్రాణం వచ్చినట్లే. మట్టి పొరల్లో దాగి ఉన్న వజ్రాలు వర్షం పడ్డప్పుడు మట్టి పొరల నుంచి బయటకు దర్శనమిస్తున్నాయి. అందుకోసమే సమీప ప్రాంతంలో నివసించే బడుగు బలహీన వర్గాల నుంచి సంపన్నుల వరకు వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే వజ్రాల కోసం వేట, మట్టిలో దాగున్న మాణిక్యాల కోసం వేరే జిల్లా నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి పెద్దఎత్తున ప్రజలు పొలాల్లో వజ్రాలు వెతకడానికి వస్తుంటారు. ఇలా వచ్చిన వారికి వజ్రం దొరికితే వారికే సొంతమవుతుంది ఆ వజ్రం. జొన్నగిరి చుట్టుపక్క గ్రామాల రైతులు వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉదయం నుండి వజ్రాల వేట కొనసాగిస్తారు. దొరికిన వారు లక్షాధికారి అవుతారు. దొరకని వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెతుకుతూనే ఉంటారు. ఇక్కడ లభ్యం అయ్యే వజ్రాలు కొనేందుకు బడా వజ్ర వ్యాపారాలు తిష్ట వేసుకొని కూర్చుంటారు.
ఇది చదవండి: ఇక్కడ అందరూ ఉన్మాదులే.. ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
అయితే కోట్లు విలువ చేసే విలువైన వజ్రాలను అక్కడి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత భారీ మొత్తంలో వజ్రాలు దొరికినా అక్కడి రెవెన్యూ అధికారులు దరిదాపులకి కూడా వెళ్లరు. పోలీస్ స్టేషన్ కు 200 మీటర్ల పరిధిలో ఈ తతంగం జరుగుతున్న పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. రోడ్డుపై వెళ్లే వాహనాలకు వేలకు వేలు ఫైన్ లు విధించే పోలీసులు తమ పోలీస్ స్టేషన్ సమీపంలో వజ్రాల వ్యాపారం జరుగుతున్న పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండి పడుతున్నా ఇటు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులుగానీ చూసి చూడంగానే వస్తున్నారు. భూగర్భంలో ఎలాంటి ఆభరణాలు, వజ్రాలు, రంగురాళ్ళు, ఇతర నిధి నిక్షేపాలు దొరికినా అది ప్రభుత్వానికి మాత్రమే సొంతమవుతుంది. ఇలాంటి చట్టాలను ఉల్లంఘించిన ప్రభుత్వం, ప్రభుత్వ రెవెన్యూ అధికారులు, పోలీసులు నోరు మెదపడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు.
“నేను కర్నూలు జిల్లాలో నివాసం ఉంటున్నా.., గత ఐదు సంవత్సరాలుగా తుగ్గలి మండలంలోవజ్రాల వేటకుకోసం వెళ్తూ వస్తున్నా.. నా ముందే చాల మందికి లక్షల విలువ చేసే వజ్రాలు దొరికాయి. నాకు ఆ వజ్రం దొరికే వరకు ప్రయత్నాలు సాగిస్తాను.'
- గణేష్, కోడుమూరు
వజ్రాల వెనుక మిస్టరీ ఇదే..!
'భూమిపైనా ఉన్న పొరల్లో వజ్రం ఏర్పడుతుంది అనేది కేవలం కల్పితం మాత్రమే. వజ్రం తాయారు కావడానికి కొన్ని ప్రత్యేక పరిస్ధిర్హులు అవసరం ఉంది. 1500 కిలోమీటర్ల లోతులోని భూగర్భ పొరలో కొన్ని ట్రినియల్స్ ఉష్ణోగ్రత నడుమ వజ్రాలు ఏర్పడుతాయి. భూమిపైనే అత్యంత గట్టిగా ఉండే వజ్రం అగ్నిపర్వతాల్లో పొంగే లావా ద్వారా కింబర్ లైట్ పైప్స్ ద్వారా భూమి పొరలపైకి వస్తాయి. సహజంగా వీటిపై ఎక్కువ మొత్తంలో దుమ్ము ధూళి కప్పేయడంతో ఇవి బయటకు కనపడవు. వర్షం పడిన సమయంలో అవి శుద్ధి అయ్యి మిలమిల మెరవడంతో అవి వజ్రం అని గుర్తించగలుగుతాం. రాయలసీమలోని జొన్నగిరి, వజ్రకరూరు ప్రాంతాల్లో కింబర్ పైప్స్ ఉండటం ద్వారా అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి. చిన్న చిన్న వజ్రాల నుంచి కోట్ల విలువ చేసే వజ్రాల వరకు ఆ ప్రాంతాల్లో దొరుకుతుంటాయి. ఇవి 3.5 ట్రిలియన్స్ సంవత్సరాల ముందు పొరల్లో నుంచి భూమిపైకి వచ్చినవే.'
- టీవీ.కృష్ణ రెడ్డి, జియాలజి రిటైడ్ ప్రొఫెసర్, ఎస్వీయు
అత్యంత విలువైన వజ్రాల చరిత్ర
''వజ్రం అంటేనే మనకు ముందుగా గుర్తుకువచ్చే పేరు కో-ఇ-నూర్. ఇది ఎంతో అత్యంత విలువైన వజ్రంగా భావిస్తాం. ఈ వజ్రాన్ని కాకతీయ రాజవంశం కాలంలో భారతదేశంలోని కోళ్లూరు గనులలో తవ్వినట్లు తెలుస్తోంది. తొలిసారిగ కో-ఇ-నూర్ వజ్రాన్ని కొలత వేసినప్పుడు 186 పాత క్యారెట్లు (191 మెట్రిక్ క్యారెట్లు లేదా 38.2 గ్రా) ఉందని గుర్తించారు. ఇది ధరించిన రాజులకు అదృష్టం వరించక పోవడంతో ఇంగ్లాండ్ రాణి క్వీన్ విక్టోరియా కిరీటంలో పొదిగారు. ఈ కారణంగా కోహినూర్ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947, 1953వ సంవత్సరంల నుంచి భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. దీని విలువ సుమారు ప్రపంచసంలోని ప్రజలంతా ఒక్కరోజు ఖర్చుకు సమానం అంటున్నారు చరిత్రకారులు, జియాలజీస్ట్ లు.
హోప్ డిమాండ్:
క్యారట్లేలలో కో-ఇ-నూర్ డిమాండ్ కన్నా 5 క్యారరెట్ల అధికంగా ఉండే విజ్రం హోప్ డైమండ్. గుల్లూరులోని కొల్లూరు మైన్స్ లో ఈ డైమండ్ ను అప్పట్లో కనుగొన్నారు. ఈ డైమండ్ ప్రపంచ ప్రఖ్యాత గోల్కొండ డైమండ్స్ నుండి ఒకటి. 1666 లో ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ టావెర్నియర్ బ్లూగా ఈ వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు ప్రారంభ రికార్డుల ద్వారా తెలుస్తోంది. టావెర్నియర్ బ్లూ కత్తిరించి ఫ్రెంచ్ బ్లూ (లే బ్లూ డి ఫ్రాన్స్) ను ఇచ్చింది, దీనిని టావెర్నియర్ 1668 లో కింగ్ లూయిస్ XIV కి విక్రయించాడు. 1791 లో దొంగిలించబడింది, తిరిగి లభ్యం అయింది. వాషింగ్టన్ సాంఘిక ఇవాలిన్ వాల్ష్ మెక్లీన్కు విక్రయించారు, అతను తరచూ ధరించేవాడు. దీనిని 1949 లో న్యూయార్క్ రత్నం వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశాడు. దీనిని 1958 లో యునైటెడ్ స్టేట్స్ యొక్క నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ప్రదర్శనలో ఉంది. ఇలా మన దేశంలో రీజెంట్ డైమండ్స్, డ్రీయా-ఇ- నూర్ డైమండ్, ఉర్లోవ్ డైమండ్, ది నిజాం డైమండ్, డ్రేస్డెన్ గ్రీన్ డైమండ్, నాస్సక్ డైమండ్ లు ఎంతో అమూల్యమైన, విలువైన వజ్రాలు ప్రాచుర్యం పొందాయి.''
- శివకుమార్., ఆర్కియాలజి, తిరుపతి
అయితే అనంతపురంలోని వజ్రకరూరులో జియాలజికల్ సర్వే అఫ్ ఇండియా వారు ఓ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వజ్రాల కోసం ఇక్కడ పరిశోధనలు చేస్తుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Rayalaseema