Home /News /andhra-pradesh /

TIRUPATI HERE ARE THE TIPS FOR PILGRIMS WHEN GETS HEALTH PROBLEMS DURING TIRUMALA TIRUPATI TOUR FULL DETAILS HERE PRN TPT

Tirumala Updates: తిరుమలలో ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇలా చేయండి.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు..

అయితే అక్టోబర్ నెల మొత్తానికి టోకెన్లు జారీ చేస్తున్నా..? ఈ నెలలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ రోజుల్లో కేవలం సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తామని, సర్వదర్శనం మాత్రమే అమలులో ఉంటుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసింది.

అయితే అక్టోబర్ నెల మొత్తానికి టోకెన్లు జారీ చేస్తున్నా..? ఈ నెలలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ రోజుల్లో కేవలం సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తామని, సర్వదర్శనం మాత్రమే అమలులో ఉంటుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసింది.

Tirumala: శ్రీవారి దర్శనార్థం తిరుమలకి విచ్చేసిన భక్తులు ఒకానొక సందర్బంలో తీవ్ర అస్వస్థతకు గురవుతుంటారు. నడకమార్గం నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు సరైన అవగాహనా లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారి కోసమే ఈ టిప్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India
    GT Hemanth Kumar, News18, Tirupati

    అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలసిన దివ్య క్షేత్రం తిరుమల (Tirumala Temple). కోరుకున్న కోర్కెలు తీర్చిన శ్రీనివాసునికి మొక్కులు చెల్లించుకోవడానికి, స్వామిని క్షణకాలం పాటు దర్శించుకోవడం కోసం రోజుకు కొన్ని వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇలా స్వామి వారి దర్శనార్థం తిరుమలకి విచ్చేసిన భక్తులు ఒకానొక సందర్బంలో తీవ్ర అస్వస్థతకు గురవుతుంటారు. నడకమార్గం నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు సరైన అవగాహనా లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారి కోసమే ఈ టిప్స్. తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. గుండె పోటు, పాము కాటు, ఇతర అస్వస్థలకు చికిత్స అందించేందుకు నిపుణులైన డాక్టర్ లు నిత్యం అందుబాటులో ఉంటారు.

    తిరుమలలో వివిధ ప్రాంతాలలో ప్రాధమిక చికిత్స కేంద్రాలు ఉన్నాయి. ఇక నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్స్ రే., వివిధ వ్యాధులకు అవసరమైయే ఔషధాలు తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. గుండె చికిత్స కోసం ప్రత్యేకంగా అపోలో వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక యూనిట్ ఉంది. తీవ్ర అస్వస్థతకు గురై... మెరుగైన వైద్యం కావాల్సి వస్తే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు అస్వస్థతకు గురైతే ప్రాణదానం స్కిం ద్వారా ఉచిత వైద్యం అందిస్తుంది టీటీడీ.

    నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులు వైకుంఠం 1&2 క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రతి క్యూ కాంప్లెక్స్ లోను ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు ఉంటాయి. మీరు దర్శనానికి వెళ్తున్న క్యూలైన్ వెళ్తున్న సమయంలోను... కంపార్టుమెంట్ లో వేచి ఉన్న సమయంలో టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ, శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు. ఒకవేళ మీరు., లేదా మీ కుటుంబ సభ్యులు., కంపార్టుమెంట్ లో అస్వస్థతకు గురైతే వెంటనే అక్కడ ఉన్న శ్రీవారి సేవకులను సంప్రదించాలి.

    తీవ్ర అస్వస్థతగా అనిపిస్తే.. విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించడం ద్వారా.. క్యూలైన్ కాంప్లెక్స్., వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలకు తరలిస్తారు. తద్వారా ప్రధమ చికిత్స అనంతరం పర్వాలేదు అనుకుంటే దర్శనానికి వెళ్ళాలి. లేదంటే అంబులెన్స్ ద్వారా వెంటనే అశ్విని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. గుండె సంబంధిత వ్యాధి ఉంటె.... అశ్వినిలో ప్రత్యేక అపోలో యూనిట్ ద్వారా చికిత్స పొందవచ్చు. ఇక పాము కాటుకు ప్రత్యేక ఇంజెక్షన్స్ అశ్విని ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి.

    నడక మార్గంలోనూ ప్రధమ చికిత్స కేంద్రాలు
    స్వామి వారి దార్శనికి వచ్చే భక్తులు అధిక భాగం నడక మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు. నాగక మార్గం గుండా తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రాధమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసింది టీటీడీ. నడుచుకుంటూ తిరుమలకు వెళ్తున్న సమయంలో అస్వస్థతకు గురైన.... నిరసించిన ప్రాధమిక చికిత్స కేంద్రం ద్వారా వైద్యం పొందవచ్చు. నొప్పుల నుంచి ఇతర సమస్యలకు చికిత్స అందించేందుకు 24/7 వైద్యులు., సిబ్బంది అందుబాటులో ఉంటారు. తీవ్ర అస్వస్థతకు గురైతే... విజిలెన్స్ సిబ్బందిని సంప్రదించడంద్వారా లైఫ్ సపోర్ట్ కలిగిన అధ్యధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అంబులెన్స్ సహాయంతో తిరుపతి స్విమ్స్ కు తరలిస్తారు.

    అందుబాటులో టీటీడీ, అపోలో అంబులెన్స్
    తిరుమలలో మూడు 108 వాహనాలతో పాటుగా టీటీడీ అంబులెన్స్, అపోలో 24/7 అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి. టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి లేదా 108కి సమాచారం అందించడం ద్వారా 10 నిమిషాల్లో మీ వద్దకు అంబులెన్స్ వాహనంవచ్చేస్తుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు. ఒకవేళ పరిస్థితి విషమిస్తే... నేరుగా తిరుమల నుంచి స్విమ్స్, రుయా ఆసుపత్రికి వెళ్ళవచ్చు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd

    తదుపరి వార్తలు