హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala Temple: ధనుర్మాసంలో శ్రీవారికి జరిగే ప్రత్యేక సేవలివే..! ఈ మాసంలో సుప్రభాతసేవ ఎందుకు ఉండదో తెలుసా...?

Tirumala Temple: ధనుర్మాసంలో శ్రీవారికి జరిగే ప్రత్యేక సేవలివే..! ఈ మాసంలో సుప్రభాతసేవ ఎందుకు ఉండదో తెలుసా...?

ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఉండేందుకు  జనవరి 1న, అలాగే వైకుంఠ పర్వదినాల సందర్భంగా జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనం మాత్రమే కల్పిస్తారు.  ఆ పది రోజుల్లో దర్శనాల కోసం  ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని టీటీడీ స్పష్టం చేసింది.

ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఉండేందుకు జనవరి 1న, అలాగే వైకుంఠ పర్వదినాల సందర్భంగా జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనం మాత్రమే కల్పిస్తారు. ఆ పది రోజుల్లో దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని టీటీడీ స్పష్టం చేసింది.

ధనుర్మాసం అంటేనే తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple) లో ఒక ప్రత్యేకత ఉంది. శ్రీనివాసుని అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. నిత్యం స్వామివారిని మేల్కొల్పే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, Tirupathi, News18

ధనుర్మాసం అంటేనే తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple) లో ఒక ప్రత్యేకత ఉంది. శ్రీనివాసుని అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. నిత్యం స్వామివారిని మేల్కొల్పే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. గురువారం మధ్యాహ్నం ధనుర్మాసం గడియలు ప్రారంభం కావడంతో ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ప్రాతినిధ్యం సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. కౌసల్య, సుప్రజా రామ సంధ్య ప్రవతథే అంటూ శ్రీవారిని మేల్కొల్పు ప్రారంభం అవుతుంది. కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతనికి బదులుగా తిరుప్పావై పఠనం చేసి శ్రీవారిని మేల్కొలుపుతారు ఆలయ అర్చకులు.

శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన ముప్పై పాసురాలనే గోదాదేవి పాసురాలు అంటారు. ధనుర్మాసంలో సుప్రభాతనికి బదులుగా ఒక్కో పాసురాని ముప్పై రోజుల పాటు పాటిస్తూ శ్రీవారిని మేల్కొలుపుతారు అర్చకులు. నెలరోజులపాటు నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి దళాలకు బదులుగా బిల్వపాత్రలతో నిర్వహిస్తారు. మరోవైపు శ్రీవారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసునికి కాకుండా శ్రీకృష్ణ భగవానుడికి ఈ నెల రోజులపాటు నిర్వహిస్తారు.

ఇది చదవండి: శ్రీవారి ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా..? అడుగడుగునా గోవిందుడి ప్రతిరూపాలే..!


ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేల పూజానివేదనలు నిర్వహిస్తారు. పరమభక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు మోహిని అవతారం సందర్భంగా శ్రీనివాసునికి శ్రీవల్లి పుత్తూరులో అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు.., చిలుకలతో పాటు గరుడ సేవలో అలంకరించే తులసి మాలలు స్వామి వారికి సమర్పిస్తారు. ఇంకా ధనుర్మాసంలో నెల రోజుల పాటు గోదాదేవి రాసిన పాసురలను పాటించడం అనతికాలంగా వస్తుంన సంప్రదాయం. తిరిగి జనవరి 15వా తేదీ సుప్రభాత సేవను పునరుదరిస్తారు.

ఇది చదవండి: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవకు ఎందుకంతటి ప్రాముఖ్యత..? ఈ పూజలో ఎన్ని ఘట్టాలుంటాయో తెలుసా..?


శుక్రవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేస్తుంది. కోవిడ్ కారణంగా ఇప్పటికే అన్ని సేవలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. తిరుప్పావైను ఏకాంతంగా బంగారు వాకిలి వద్ద పాటించనున్నారు వేదపండితులు.

ఇది చదవండి: అర్ధరాత్రి వింత శబ్దాలు.. లేచి చూస్తే అమ్మవారు ప్రత్యక్షం... పరుగులు పెడుతున్న జనం.. ఎక్కడంటే..!


ధనుర్మాసంలో స్వామి వారికీ ప్రత్యేక నైవేధ్యాని నివేదిస్తారు ఆలయ అర్చకులు. రోజు ఉదయం సాయంత్రం శ్రీవారికి దోసెలు నివేధిస్తు ఉంటారు. అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం దోసెలు కాకుండా.. బెల్లం పాకంలో ఉంచిన ప్రత్యేక దోసెలని నివేదిస్తారు అర్చక స్వాములు. శ్రీవారినికి అనుగుణంగా ప్రసాదాలు నివేదించడం ఆనవాయితీ ఉంది. స్వామి వారివైభోగమే వైభోగం అంటారు భక్తులు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Tirumala Temple, Tirumala tirupati devasthanam

ఉత్తమ కథలు