Home /News /andhra-pradesh /

TIRUPATI HERE ARE THE SENSATIONAL TRUTHS BEHIND YS VIVEKANANDA REDDY MURDER CASE AS CBI RECORDS WATCHMAN STATEMENT FULL DETAILS PRN TPT

YS Viveka Murder Case: వైఎస్ వివేకాది సుపారీ హత్యే... వాచ్ మెన్ సంచలన స్టేట్ మెంట్

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy Murder Case) సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

    ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో సీబీఐ దర్యాప్తు సాగుతుండగా.. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. . వాచ్ మెన్ రంగయ్యన్ను పోలీసులు జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టగా ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. వైఎస్ వివేకాది సుపారీ హత్య అని.. ఇందులో కోట్లు చేతులు మారినట్లు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు  సమాచారం. హత్య కేసులో మొత్తం 9మంది ఉన్నట్లు రంగయ్య స్టేట్ మెంట్లో పేర్కొన్నట్లు సమచారం. వివేకా హత్యపై దాదాపు ఏడాదిన్నరగా సీబీఐ విచారణ జరుగుతోంది. గతంలో పలుసార్లు సీబీఐ విచారణ జరిగినా.. గత 47 రోజుల నుంచి నిర్విరామంగా విచారణ జరుగుతోంది. కడపలోనే మకాం వేసిన సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు.

    కడప సబ్ జైలు గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ సాగుతోంది. మధ్యలో పులివెందుల వెళ్లి కూడా విచారణ జరిపారు. ముఖ్యంగా వాచ్ మెన్ రంగయ్య, డ్రైవర్ తో పాటు ఇంట్లో పనిచేసేవారిని ప్రశించారు. ఈ క్రమంలో వాచ్ మెన్ రంగయ్యను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు అతడ్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రెండున్నర గంటల పాటు ఇచ్చిన స్టేట్ మెంట్లో రంగయ్య కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి..


    ఈకేసులో ఇప్పటివరకు వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రం గంగిరెడ్డి, పీఏ కృష్ణ రెడ్డి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, మాజీ డ్రైవర్ దస్తగిరి, వాచ్ మెన్ గా పనిచేస్తున్న రంగయ్య, ఇనాయతుల్లా అనే వ్యక్తితో పాటు ఉమామహేశ్వరరెడ్డి అనే మరొవ్యక్తిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అలాగే పులివెందులతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, శివారు ప్రాంతాలను కూడా పరిశీలించిన సీబీఐ కీలక ఆధారాలను సేకరించింది. ఇప్పుడు వివేకా హత్యకు సుపారీ ఇచ్చారని.. 9 మంది హస్తముందని చెప్పడం సంచలనంగా మారింది. హత్య జరిగిన రోజు ఆయన ఇంటికి ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చారని రంగయ్య చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ స్టేట్ మెంట్ లోని అంశాలు, ఇతర వివరాలను సీబీఐ ధృవీకరించలేదు.

    ఇది చదవండి: ఏపీలో ఆగస్టు 16న స్కూళ్లు ప్రారంభం.. సీఎం జగన్ కీలక నిర్ణయం


    దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడైన వైఎస్ వివేకానంద రెడ్డి గతంలో కడప ఎంపీగా, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు అనగా మార్చి 15న ఆయన పులివెందులలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను దారుణంగా నరికి హతమార్చారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం అప్పట్లో సిట్ ద్వారా దర్యాప్తుకు ఆదేశించగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన దర్యాత సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, CBI, Ys viveka murder case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు