Home /News /andhra-pradesh /

TIRUPATI HERE ARE THE SENSATIONAL FACTS BEHIND TIRUMALA SIRVARI TEMPLE FULL DETAILS HERE PRN TPT

Tirumala Facts: శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉందా..? స్వామి వెనుక సొరంగం నిజమేనా.! న్యూస్18 ఎక్స్ క్లూజివ్..!

తిరుమల శ్రీవారు

తిరుమల శ్రీవారు

Tirumala Facts: శ్రీవారికి నిజమైన కురులు ఉంటాయని విపరీతమైన ప్రచారం సాగుతోంది. అందులో ఆ కురులు చిక్కే పడవని అంటుంటారు. ఇక శ్రీవారి భుజకీర్తుల వద్ద, వీపు భాగంలో తడిగానే ఉంటుందని అంటారు. ఆ ప్రదేశంలో సముద్ర గోషా వినపడుతుందని సోషల్ మీడియా (Social Media) లో ప్రచారం సాగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirupati, India
  GT Hemanth Kumar, News18, Tirupati

  గోవిందా..! గోవిందా..! ఆపద మొక్కుల వాడ.., అనాధ రక్షక గోవిందా..! గోవిందా..! అంటూ సప్త గిరులు మారుమ్రోతుంటాయి. కలియుగంలో దుష్ట శిక్ష., శిష్ట రక్షణార్థంలో ఇలా వైకుంఠంలో అర్చావతారా మూర్తిగా సాలగ్రామ శిలగా వేసిలారు శ్రీ శ్రీవేంకటేశ్వరుడు (Sri Venkateswara Swamy). లక్ష్మీ దేవి కోసం వైకుంఠాన్ని వీడి భువికి చేరిన శ్రీ శ్రీనివాసుడు.. శ్రీ పద్మావతి పరిణయం అనంతరం ఇలా వైకుంఠంలో స్వామ్యం వ్యక్తమైన వెలసారని..వేంకటాచల మహత్యం, ఆగమ శాస్త్రం, ఇతర పురాణ ఇతిహాసాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే స్వామి వారి దర్శనార్థం క్రమేభి భక్తుల సంఖ్యా ఘననీయంగా పెరుగుతోంది. స్వామి వారి ఆలయం చుట్టూ.. గర్భాలయంలో మనం చూడని ప్రదేశాల్లో కొన్ని వాదనలు సోషల్ మీడియా (Social Media) లో  చూస్తుంటాం. ముఖ్యంగా సాలగ్రామ రూపంలో వెలసిన శ్రీవారికి నిజమైన కురులు ఉంటాయని విపరీతమైన ప్రచారం సాగుతోంది. అందులో ఆ కురులు చిక్కే పడవని అంటుంటారు.

  ఇక శ్రీవారి భుజ కీర్తుల వద్ద, వీపు భాగంలో తడిగానే ఉంటుందని అంటారు. ఆ ప్రదేశంలో సముద్ర గోషా వినపడుతుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. స్వామి వారి వెనుక భాగంలో పెద్ద సొరంగ మార్గం ఉందని... ఆ సొరంగమార్గంలోనే పూలను వేస్తుంటారనే వాదన కూడా ఉంది. స్వామి వారి వెనుకవైపు వెళ్లే సాహసం ప్రయత్నం చేయరని అంటుంటారు. ఇక స్వామి వారి ఆలయానికి యోజనం దూరంలో ఒక ఊరు ఉంటుందని.., ఆ ఊళ్లో మగవారు పై వస్త్రం ధరించరని.. అక్కడ నుంచి మాత్రమే శ్రీవారికి పూలు, పెద్ద పెద్ద పుష్ప హారాలు సమర్పిస్తారనే జానపదం సాగుతోంది. అసలు ఇవన్నీ ఎంతవరకు నిజం..? సామజిక మాధ్యమాలలో చేస్తున్న ప్రచారం ఎంతవరకు సరైనది. అలాంటి అపోహాలపై న్యూస్18తో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు అపోహాలపై వివరణ ఇచ్చారు.

  ఇది చదవండి: శ్రీవారి వైభవోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు..? ఆ ఉత్సవాల ప్రాముఖ్యత ఇదే..!


  ప్రశ్న: శ్రీవారికి నిజమైన కురులు ఉన్నాయా.. అవి చిక్కే పడవా..? ఇందులో వాస్తవం ఎంతా..?
  జవాబు: సాక్షాత్ శ్రీ మహా విష్ణువే దీవిని విడి భువిపై అర్చావతార మూర్తిగా... సాలగ్రామ రూపంలో తిరుమలలో వెలిశారు. స్వామి వారు బంగారు, వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆభరణాలతో శిలా రూపమై స్వయం వ్యక్తమై అందరికి దర్శనం ఇస్తున్నారు. విగ్రహ రూపంలో ఉన్న స్వామి వారికి చిక్కు పడని జుట్టు ఉంది అనటం కేవలం అపోహలు మాత్రమే. స్వామి వారి కురులు విగ్రహంలోనే అంతర్భాగం. నిజమైన కురులు ఉంటాయి అనటం కేవలం అపోహ మాత్రమే.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారికి ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా..? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చిట్టా ఇదే..!


  ప్రశ్న: స్వామి వారి భుజకీర్తుల వద్ద., వీపు భాగంలో ఎల్లపుడు తేమ ఉంటుందా..? అక్కడ చెవులు పెట్టి వింటే సముద్ర గోష వినపడుతుందా..?
  జవాబు: శ్రీ శ్రీ వేంకటేశ్వరుడు తిరుమలలో సాలగ్రామ రూపంలో దర్శమిస్తాడు. కొందరు.. స్వామి వారి విగ్రహంపై తేమ ఉంటుందని అంటూ ప్రచారం చేస్తుంటారు. అంతే కాదు.. స్వామి వారి భుజకీర్తులు., వీపు భాగంలో వద్ద చెవి పెట్టి వింటే సముద్ర ఘోష వినపడుతుందని అంటారు. అసలు ఇలాంటివన్నీ కల్పితాలే. పూర్వం స్వామి వారి పాదాల చెంత విరజా నది ఉంటుందని.. అప్పట్లో ఇక్కడ నీరు వచ్చేదని చెప్పేవారు. కానీఇప్పుడు విరజా నది ఘోష కూడా వినపడదు.

  ఇది చదవండి: టీటీడీ కొత్త ఐడియా.. భక్తుల కోసం వర్చులవ్ క్యూలెన్.. రెండు గంటల్లోనే దర్శనం.. పూర్తి వివరాలివే..!


  ప్రశ్న: స్వామి వారి వెనుక భాగంలో సొరంగం ఉందా..? స్వామి వారికి అలంకరించిన పుష్పలు అక్కడే వేస్తారా..?
  జవాబు: శ్రీవారి గర్భాలయంలో స్వరంగా మార్గం ఉందని అంటారు. అక్కడ పూలను వేస్తారనే ప్రచారంఉంది. నిజానికి శ్రీవారి ఆలయంలో ఎలాంటి సొరంగ మార్గం ఉండదు. స్వరంగా మార్గం ఉంటేనే కదా అక్కడ పూలను వేయడానికి. ప్రసాదాలు వితరణ చేసే స్థలంలో పూల బావి ఉంది. ఆ పూల బావిలో పుష్పాలను వేసిన అనంతరం వాటిని తీసుకెళ్లి మానవ పాదాలు తగలని ప్రదేశంలో భూమిలో నిమర్జనం చేయడం జరుగుతుంది.

  ఇది చదవండి: తిరుమలలో ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇలా చేయండి.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు..


  ప్రశ్న: స్వామి వారి వెనుక భాగంలోకి ఎవరూ వెళ్లరు.. అక్కడ వెళ్ళాలి అంటే భయపడతారని చెప్పే మాటల్లో నిజం ఎంత..?
  జవాబు: శ్రీవారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటాం. ముఖ్యంగా అభిషేక సమయంలో మిరాశీ అర్చకులు.. పరిచారకుల సహాయంలో స్వామి వారి గురువారం జరిగే ఆభరణాలు సడలింపుకు., శుక్రవారం జరిగే అభిషేక సేవకు వెనుక భాగంలో అర్చకులు ఉంటాం. అలాంటి ప్రచారం వాస్తవం కాదు.

  ఇది చదవండి: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆ కష్టాలకు చెక్.. టీటీడీ కీలక నిర్ణయం..


  ప్రశ్న: శ్రీవారి ఆలయానికి ఒక్క యోజన దూరంలో ఓ గ్రామం ఉంది.. ఆ గ్రామం నుంచే వచ్చే పూల హారాలు స్వామికి వినియోగిస్తారు అందులో నిజం ఎంత..?
  జవాబు: శ్రీవారి ఆలయానికి ఒక్క యోజనం దూరంలో ఒక రహస్య గ్రామం ఉందనేది కేవలం కల్పితంమాత్రమే. శ్రీవారికి సమర్పించే ప్రతిఒక్క పుష్పము విరాళ రూపంలో భక్తులు సమర్పిస్తారు. బెంగళూరు, చెన్నై, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పూలను స్వామి వారికి వినియోగిస్తారు. స్వామి వారికీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పుష్పలను గార్డెన్ సిబ్బంది.. హారాలుగా మలిచి తెచ్చిన వాటిని స్వామి వారికి అలంకరిస్తాము.  సోషల్ మీడియాలో తిరుమల శ్రీవారి ఆలయం పై వచ్చే ఇలాంటి ప్రచారం కేవలం కల్పితాలు మాత్రమే. అపోహలు నివృత్తి చేయడం కోసమే న్యూస్18 ప్రత్యేక కథనం.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు