Nellore Issue: రెండు నెలల క్రితం వీడియో.. ఇప్పుడు వైరల్.. అతడికి-ఆమెకు మధ్య ఏం జరిగింది..?

యువతిపై దాడి చేస్తున్న వెంకటేష్

Extramarital Affair: యువతిపై అనుమానం పెంచుకున్న వెంకటేష్.. రెండు నెలల క్రితం ఆమెను కొత్తూరు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను విచక్షణారహితంగా కొడుతూ తన స్నేహితులతో కూడా సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడు.

 • Share this:
  ఈ రోజుల్లో ఏ క్రైమ్ వార్త చూసినా దాని వెనుక ఖచ్చితంగా ప్రేమ వ్యవహారమో., వివాహేతర సంబంధమో (Extramarital Affair) ఉంటోంది. సోషల్ మీడియా (Social Media)లో వైరల్ గా మారిన ఓ వీడియో ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లా (Nellore District)లో ఓ యువతి.. ఓ వ్యక్తి దారుణంగా కొడుతుండగా.. ఆ దృశ్యాన్ని మరో ఇద్దరు వీడియో తీసి పైశాచికానందం పొందారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదానికి కూడా వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ సంబంధంలో వచ్చిన అభిప్రాయబేధాలు, అనుమానాలు యువతిపై దాడికి దారితీశాయి.

  వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు నగరంలోని రామకోటయ్య నగర్ కు చెందిన మల్లికార్జున కుమారుడు పల్లాల వెంకటేష్ టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి నెల్లూరుకే చెందిన బాధిత యువతితో గతంలో పరిచయం ఉంది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రస్తుతం బాధితురాలు చైతన్యపురి నగర్లోని ఓ అపార్ట్ మెంట్లో భర్తతో కలిసి నివాసముంటోంది. పెళ్లైన తర్వాత కూడా వెంకటేష్ తో సంబంధం కొనసాగిస్తోంది.

  ఇది చదవండి: ఏపీలో కరెంటు బిల్లులు ఎందుకు పెరిగాయి..? ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏమిటి..?


  ఈ క్రమంలో యువతిపై అనుమానం పెంచుకున్న వెంకటేష్.. రెండు నెలల క్రితం ఆమెను కొత్తూరు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను విచక్షణారహితంగా కొడుతూ తన స్నేహితులతో కూడా సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో తీవ్రంగా కొట్టాడు. ఆమె చేతిగాజులు పగిలి రక్తంకారుతున్నా పట్టించుకోకుండా దాడి చేశాడు. ఈ దృశ్యాలను వెంకటేష్ స్నేహితులు కొమరిక మనోహర్, కొఠారి శివ ఫోన్లో చిత్రీకరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

  ఇది చదవండి: సీబీఐ కోర్టులో జగన్ కు ఊరట.. రఘురామ పిటిషన్ కొట్టివేత


  ఇటీవల శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో ఇలాంటి ఘటన జరిగింది. కొప్పల కమల అనే మహిళ.. రైల్వే గ్యాంగ్ మెన్ గా పనిచేస్తున్న సంపతిరావు దేవరాజ్ అనే వ్యక్తితో పెళ్లికి ముందే సంబంధం పెట్టుకుంది. 2005లో రాజమండ్రికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. దేవరాజ్ కు కూడా పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. ఐతే పెళ్లైన తర్వాత కూడా ప్రియుడి మోజులో ఉన్న కమల.. భర్తను వదిలేది దేవరాజ్ వద్దకు వెళ్లింది. 2012 నుంచి అతడితోనే సహజీవనం చేస్తోంది.

  ఇది చదవండి: మోసాల్లో ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’... వీళ్లను నమ్మితే దిమ్మతిరిగి బొమ్మ కనబడుద్ది..!


  ఐతే 9ఏళ్ల నుంచి పెళ్లి చేసుకోమని దేవరాజ్ పై కమల ఒత్తిడి చేస్తోంది. ఇటీవల అతడ్ని నిలదీయడం మొదలుపెట్టింది. దీంతో ఆమెను ఎలాగైనా అంతమొందించాలని స్కెచ్ వేసిన దేవరాజ్.. ఆమెను నమ్మించి బొరిగిపేట గ్రామానికి తీసుకెళ్లాడు. గ్రామ శివారులో ఆమెపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. ప్రాణభయంతో పరుగులు పెట్టిన ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సాయంతో ఆస్పత్రికి వెళ్లిన కమల చికిత్స చేయించుకోని పోలీసులను ఆశ్రయించింది.
  Published by:Purna Chandra
  First published: