Extramarital Affair: ప్రియురాలి మోజులో భర్త... ఆమె భర్తతోనే మర్డర్ ప్లాన్ వేసిన భార్య.. చివరికి ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Extramarital Affair: భార్య తన భర్త ఎన్ని చిత్రహింసలు పెడుతున్నా సహిస్తుంది కానీ.. వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడాన్ని మాత్రం జీర్ణించుకోలేదు. అలాంటి ఓ భార్య తన భర్త చేసిన పనికి కఠిన నిర్ణయం తీసుకుంది.

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  రానురానూ బంధాలు బాంధవ్యాలకు విలువలేకుండా పోతోంది. పెళ్లి అనే పవిత్రమైన బంధాన్ని కాదని... వేరొకరితో శారీరక సంబంధాలు పెట్టుకోవడం సమాజంలో పెరుగుతూనే ఉంది. ఎన్ని అనర్ధాలు జరిగినా.. వాటిని పెడచెవిన పెట్టి తాత్కాలిక సుఖాలే ముఖ్యమన్నట్లుగా మారుతోంది నేటి ఆధునిక సమాజం. మెడలో మూడు ముళ్లు వేసినందుకు పుట్టింటిని వదిలి తనతో వచ్చిన భార్యకు విలువ ఇవ్వకుండా.. వేరే మహిళతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు కొందరు భర్తలు. ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్య అనే కనీస గౌరవం ఇవ్వకపోవడంతో ఎవరూ చేయని దారుణానికి ఒడిగట్టిందిగి ఓ ఇల్లాలు. వేధింపులు భరించలేక భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ బర్తతోనే కలిసి అతడ్ని చంపేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...అంనంతపురం జిల్లా పరిగికి చెందిన కృష్ణప్ప, అక్కమ్మలకు 20 ఏళ్ల క్రితం పెళ్లైంది. ప్రస్తుతం దంపతులు పరిగిలోనే నివాసముంటున్నారు.

  గత రెండేళ్లుగా ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తరచూ భార్యను తీవ్రంగా కొట్టేవాడు. ఐతే భర్త కృష్ణప్ప ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య అతడిపై నిఘా ఉంచింది. కొన్ని రోజుల తర్వాత ఆమె అనుమానం నిజమైంది. తన భర్త అదే గ్రామానికి చెందిన సావిత్రమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించింది. భర్త తనను చిత్రహింసలు పెట్టినా భరించిన అక్కమ్మ.. వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది.

  ఇది చదవండి: ఏపీ కర్ఫ్యూ సమయాల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే.. ఆ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్


  ఇదే విషయాన్ని కృష్ణప్ప వివాహేతర సంబంధం పెట్టుకున్న సావిత్రి భర్త వెంకటరణకు చెప్పింది. అతడు కూడా తన భార్య చేస్తున్న పనికి ఊళ్లో పరువు పోతోందని అక్కమ్మ వద్ద వాపోయాడు. అక్కమ్మ కూడా తన భర్త సంపాదనంతా సావిత్రమ్మకే పెట్టేస్తున్నాడని బాధపడింది. దీంతో ఇద్దరూ కలిసి కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీనికి పరిష్కారం కృష్ణప్పను చంపడమేనని భావించారు.

  ఇది చదవండి: సినిమా షూటింగ్ లో ప్రేమ... పెళ్లి పేరుతో రూమ్ కు తీసుకెళ్లిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..


  పక్కా ప్లాన్ తో ఇద్దరూ కలిసి జూన్ 10న కృష్ణప్పన్ను హత్య చేసి పరిగి చెరువులో పడేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అక్కమ్మే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్ని కోణాల్లో విచారించినా పోలీసులకు కేసు అంతుచిక్కలేదు. చివరకు అక్కమ్మ ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమెను విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకుంది. రోజూ చిత్రహింసలు పెడుతుండటం, వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తానే హత్య చేశానని.. ఇందుకు వెంకటరమణ సహకరించాడని జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. దీంతో పోలీసులు అక్కమ్మతో పాటు వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. భర్త వ్యసనాలను విసిగిపోయిన అక్కమ్మ అతడ్ని మార్చాల్సిందిపోయి దారుణానికి ఒడిగట్టి జైలుపాలైంది. మరోవైపు భార్యను అదుపులో పెట్టుకోలేకపోయిన వెంకటరమణ కూడా కటకటాలపాలయ్యాడు.

  ఇది చదవండి: భర్త చనిపోవడంతో మరొకరితో సహజీవనం.. వేరే వ్యక్తితో చనువు.. ఇది తెలిసిన ప్రియుడు ఏం చేశాడంటే..


  Published by:Purna Chandra
  First published: