TTD: టీటీడీ విషయంలో రూటు మార్చిన ఏపీ సర్కార్..! స్పెసిఫైడ్ అథారిటీ నియామకం వెనుక ఆంతర్యం ఇదేనా..?

తిరుమల ఆలయం (ఫైల్)

టీటీడీ పాలకమండలి (TTD Board) గడువు ముగిసి.., లేదా ప్రభుత్వం అతర్గతంగా పాలకవర్గాన్ని రద్దు చేసిన నాడు పాలకవర్గం నిర్వహించే విధులను నిర్వర్తించడం కోసం స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు.

  • Share this:
    GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

    టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగియడంతో స్పెసిఫైడ్ అథారిటీ అఫ్ టీటీడీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 21వ తేదీన పూర్వ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవి కాలం ముగియడంతో బోర్డు కాలపరిమితి కూడా ముగిసింది. అయితే పాలకమండలి సభ్యులకు మరో మూడు నెలల పదవి కాలం ఉన్నా చైర్మన్ కాలపరిమితిని ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే పరిపాలన కారణాల దృష్ట్యా నూతన పాలకమండలి నియామకం జరిపే వరకు స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఏడవ సారి...ఈ స్పెసిఫైడ్ అథారిటీ నియామకం జరిగింది. ఇందులో ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 7వ స్పెసిఫైడ్ ఆథారిటీని ఈవో కేఎస్ జవహర్ రెడ్డి చైర్మన్ గా, కన్వీనర్ గా అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం.

    కొత్త పాలకవర్గంపై కొంత స్పష్టత వచ్చినా సభ్యుల ఎంపిక కొంత సందిగ్దత నెలకొంది. సభ్యుల ఎంపిక కొలిక్కి రాకపోవడంతో నియామకంలో కొంత ఆలస్యం నెలకొంటోంది. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల ముంచి సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులను ఎంపిక చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియలో జాప్యం జరగటంతో మరో వారం పదిరోజుల్లో సభ్యుల నియామకంపై ఫైనల్ జాబితా రూపొందించనున్నట్లు సమాచారం. దీంతో స్వల్ప వ్యవధి కోసమే స్పెసిఫైడ్ అథారిటీ ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో దేవాదాయశాఖ ప్రినిసిపాల్ సెక్రెటరీని స్థాయి అధికారిని స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా నియమించే వారు. ఆ శాఖ కమీషనర్, టీటీడీ ఈవో సభ్యులుగా నియమించే వారు. తాత్కాలిక స్పెసిఫైడ్ కమిటీ కావడం వల్లే....ఈవో, అదనపు ఈవో ను నియమించినట్లు సమాచారం.

    ఇది చదవండి: బాబాయిని హస్తినకు పంపే యోచనలో సీఎం జగన్..? ఆ జీవో వెనుక అసలు నిజం ఇదేనా..?


    స్పెసిఫైడ్ అథారిటీ అంటే ఏంటి..?
    టీటీడీ పాలకమండలి గడువు ముగిసి.., లేదా ప్రభుత్వం అతర్గతంగా పాలకవర్గాన్ని రద్దు చేసిన నాడు పాలకవర్గం నిర్వహించే విధులను నిర్వర్తించడం కోసం స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. ఈ స్పెసిఫైడ్ అథారిటీ కాలపరిమితి కనిష్ఠంగా ఏడాది ఉంటుంది. ఒకవేళ పాలకమండలి వేసే యోచన లేకపోతే.., మరో ఏడాది పొడిగింపుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయొచ్చు. పాలకమండలి లేని సమయంలో కచ్చితంగా స్పెసిఫైడ్ అథారిటీ ఉండాలన్న రూల్స్ కూడా లేవు. రెండు లేని సమయంలో పాలనా సాగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఆరుసార్లు స్పెసిఫైడ్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఏర్పడ్డ అథారిటీ ఏడవది.. 1995, 1999-2002 మధ్యకాలంలో, 2006లో మరో మారు, 2010-11 నడుమ, 2014-2015 మధ్య కాలంలో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

    ఇది చదవండి: అదే జరిగితే ఒక్కో స్టూడెంట్‌కు రూ.కోటి ఇవ్వాలి.. ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు హెచ్చరిక..


    ఆశావహులను బుజ్జగించే ప్రయత్నం
    టీటీడీ పాలకమండలి చైర్మన్ గా 2019 జూన్ 22వ తేదీన వైవీ సుబ్బారెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ కాలపరిమితి ముగియడంతో తమకు అవకాశం ఇవ్వాలని ఆశావహులు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు దపాలు సీఎంను కలసి కీలకమైన చైర్మన్ పదవిని ఇచ్చి స్వామి వారి సేవచేసుకొనే భాగ్యం కల్పించాలని కోరుతున్నారట. దీంతో పాలకమండలి చైర్మన్ పదవిని వేరొకరికి ఇవ్వని అనుకున్న మరొకరని బుజ్జగించాల్సిన పరిస్థితి నెలకుంటోంది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఆశావహులు బుజ్జగించి మరొక ఏడాది వైవీ సుబ్బారెడ్డినే నియమిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఆయనకు మరో పదవిని కట్టబెడతారన్న ప్రచారమూ లేకపోలేదు.
    Published by:Purna Chandra
    First published: