TTD Decision: భక్తులకు శుభవార్త చెప్పడం వెనుక కారణం ఇదేనా..? పెరటాశి నెల అంటే ఏమిటీ..?

తిరుమల శ్రీవారు (ఫైల్)

Tirumala Temple: ఎక్కువగా భక్తులు చేరుకొనే అవకాశం ఉండటంతో ప్రకటన వెలువడకుండానే టిక్కెట్ల కోటను పెంచేసింది టీటీడీ (TTD). అంతేకాకుండా ఏకాంత సేవ సమయంలనూ మార్పులు చేసింది.

  • Share this:
    GT Hemanth Kumar, Tirupati, News18

    కోర్కెలు తీర్చే కోనేటి రాయుని దర్శనార్థం నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల (Tirumala Tirupati Devasthanam)కు చేరుకుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులు సర్వదర్శనం (Tirumala Sarva Darshanam), దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (Tirumala Special Entry Darshanam), విఐపి బ్రేక్, శ్రీవాణి ట్రస్ట్, ఆర్జిత సేవల ద్వారా స్వామి వారిని దర్శించుకుంటారు. ఇవన్నీ కరోనా విజృంభణ ముందువరకు... ప్రస్తుతం తిరుమలకు పరిమిత సంఖ్యలో భక్తులను తిరుమలకు అనుమతిస్తోంది టీటీడీ (TTD). ఆన్లైన్ ప్రత్యేక ప్రవేశ దర్శనం (Tirumala Online Darshan), సిపార్సు లేఖలు, శ్రీవాణి ట్రస్ట్, వర్చువల్ ఆర్జిత సేవ టిక్కెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. భారీ ఎత్తున శ్రీవారి సర్వదర్శనం పునఃప్రారంభించాలని టీటీడీకి విన్నతులు అందాయి. దీంతో టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy) సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కలిగేలా చర్యలు చేపట్టారు.

    సర్వదర్శనం టోకెన్లను సెప్టెంబర్ 8 వ తేదీ నుంచి చిత్తూరు జిల్లా (Chittoor District) వాసులకు ప్రయోగాత్మకంగా జారీ చేస్తూ వస్తున్నారు. ముందుగా రోజుకు 2వేల టిక్కెట్లను మాత్రమే టీటీడీ స్థానికులకు అందిస్తూ వచ్చింది. డిమాండ్ మరింత పెరగటంతో ఆ సంఖ్యను 4వేలుకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. అయితే నేటి నుంచి సర్వదర్శనం టోకెన్లు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకుండానే టిక్కెట్ల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉన్నపళంగా టిక్కెట్ల సంఖ్య పెంచడంలో ఓ బలమైన కారణం కూడా ఉందని అంటున్నారు.

    ఇది చదవండి: టాలీవుడ్ అంశంపై ప్రభుత్వం ఫోకస్.. ముద్రగడ లేఖతో మరో ట్విస్ట్.. క్లైమాక్స్ ఎంటీ..?


    పెరటాశి నెల కారణంగానేనా..?
    ఈ నెల అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన నెలగా భావిస్తారు. ముఖ్యంగా తమిళనాడు భక్తులకు ప్రఘాడ విశ్వాసం. సెలవులు లేకున్నా పెరటాశి నెల (తిరుమల వారలు)ల్లోని శనివారాల్లో తమిళనాడు భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకొని స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ మాసంలో తిరుమలకు భక్తుల తాకిడి అధికంగానే ఉంటుంది. తమిళనాడు నుంచే కాకుండా దక్షిణ భారత దేశంలోని ప్రజలు ఈ నెలను శ్రీవారికి ఎంతో విశిష్టమాసంగా భావిస్తారు. అందుకే తిరుమల వారాల్లో భక్తుల తాకిడి అనూహ్యంగా ఉంటుంది. ఇక శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించే మాసం కూడా ఇదే కావడం విశేషం.

    ఇది చదవండి: వయసు ఎనిమిదేళ్లు... లక్ష్యం ఎవరెస్ట్.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఐఏఎస్ తనయుడు..


    టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేయడం ద్వారా 8 వేల టిక్కెట్లకు అధిక సంఖ్యలో భక్తులు గుమ్మికూడే అవకాశం ఉంది. టీటీడీ ఏర్పాటు చేసిన క్యూలైన్ లలో భక్తులు ఒకరిపై మరొకరు తోసుకుంటూ ఉంటూ విడుదల చేసిన టిక్కెట్లకన్నా 10 రెట్లు ఎక్కువగా భక్తులు చేరుకొనే అవకాశం ఉండటంతో ప్రకటన వెలువడకుండానే టిక్కెట్ల కోటను పెంచేసింది టీటీడీ. సోమవారం నుంచి 8 వేల మంది భక్తులకు టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. ఇక ఏకాంత సేవ సమయంలోను మార్పులు తీసుకొచ్చింది టీటీడీ. లాక్ డౌన్ అమలు చేసిన నాటి నుంచి నేటి వరకు రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తూ వస్తున్న టీటీడీ ఆ సమయంలో మార్పులు తీసుకొచ్చింది. రాత్రి 12 గంటలకి ఏకాంత సేవ జరిపేలా నిర్ణయం తీసుకుంది.
    Published by:Purna Chandra
    First published: