Home /News /andhra-pradesh /

TIRUPATI HERE ARE THE REASONS BEHIND SRI TALLAPAKA ANNAMACHARYA FAMILY OBJECTING SINGER SRAVA BHARGAVI CONTROVERSIAL SONG FULL DETAILS HERE PRN TPT

Sravana Bhargavi: శ్రావణ భార్గవి పాటలో ఏముంది..? అన్నమయ్య వారసుల అభ్యంతరాలేంటి..?

శ్రావణ భార్గవి వీడియో డిలీట్

శ్రావణ భార్గవి వీడియో డిలీట్

Singer Sravana Bhargavi: అసలు స్వామి వారికి అంకితం చేసిన పాటని శ్రావణ భార్గవి తన అందాన్ని చూపించుకోవడం ఏంటని అన్నమయ్య వంశస్థుల వాదన. ఇదే అంశంపై శ్రావణ బార్గవితో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు అన్నమయ్య వంశీకులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India
    GT Hemanth Kumar, News18, Tirupati

    పదకవితా పితామహుడు, తెలుగు మొట్టమొదటి వాగ్గేయ కారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. కలియుగ దైవంశ్రీవేంకటేశ్వరుని (Sri Venkateswara Swmay) నందకం లక్కమాంబ గర్భ సాయంలో ప్రవేశించి.. అన్నమయ్య (Annamayya) గా జన్మించి స్వామి వారికి ముప్పై రెండు వేల సంకీర్తనలు అంకితం చేశారు. స్వామి వారిని తప్ప వేరొకరిని తన సంకీర్తనలతో కీర్తించని వాడు అన్నమయ్య. ఒక్కో కీర్తన స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు చూపెడతాయి. మరికొన్ని స్వామి వారికి నిర్వహించే సేవ కైంకర్యాలు ఎలా చేస్తారో తెలుపుతాయి. స్వామి వారి వైభవం, తిరుమల (Tirumala) చరిత్ర ఇలా ఎన్నో కీర్తనలు అన్నమయ్య రచించినవే. 15వ శతాబ్దంలో శ్రీశ్రీదేవి, భూదేవిలతో శ్రీ మలయప్ప స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించిన.. కన్యాదానం చేశారు అన్నమయ్య. ఒకనాడు స్వామి వారి సన్నిధికి అన్నమయ్యతో వచ్చిన అన్నమయ్య పెద్ద కుమారుడు పెద్ద తిరుమల రాయుడు.. ఒకపరి ఒకపరి వైయ్యారమై అనే పాటను కీర్తించాడట. అప్పటి నుంచి ఆ కీర్తన స్వామి వారికీ అన్నమయ్య వంశస్థులు శ్రీవారి ఆలయం (Tirumala Temple) లో గాత్రం చేస్తున్నారు. ఇలా ఒక్కో కైంకర్యానికి ఒక్కో కీర్తన పడటం ఆనవాయితీ.

    శ్రావణ భార్గవి పాటలో ఏముంది..? 
    శ్రావణ భార్గవి ప్రముఖ సినీ గాయనిగా మనందరికీ సుపరిచితురాలే. సంప్రదాయ సంగీతంతో ముడిపడిన కుటుంబం.. అందులోనూ కుటుంబమంతా కళాకారులే. శ్రావణ భార్గవి.. సంప్రదాయ సంగీతంతో పాటుగా వెస్ట్రన్ సాంగ్స్ సైతం సినిమాల్లో పడుతూ వచ్చేది. సంప్రదాయ కళలో ఓ పాట పడాలని అనుకుందేమో..! అన్నమయ్య తనయుడు రచించిన ఒకపరి ఒకపరి వయ్యారమై అనే పాటను రీ క్రీట్ చేసింది. తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులతో పాటను చిత్రీకరించారు. మొదట లడ్డు జంతికలు తింటూ... పుస్తకం చదివినట్లు విజువల్స్ ఉండగా... మరో ఫ్రేములో కాళ్ళను చూపించారు. అనంతరం వెనుక నుంచి శ్రావణ భార్గవి చూస్తారు. మొదట్లో పడుకొని బుక్స్ చదివినట్లు చూపిస్తారు.ఈ పాటను మూడు రోజుల క్రితం శ్రావణ భార్గవి తన ఆఫీషియల్ యూట్యూబ్ పేజ్ లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ఆ పాటకు 3 లక్షల వ్యూస్ వచ్చాయి.

    ఇది చదవండి: కేశినేని కుటుంబంలో పొలిటికల్ వార్.., సోదరుడిపై ఎంపీ నాని పోలీస్ కంప్లైంట్..


    అన్నమాచార్యుల వంశస్థుల అభ్యంతరాలేంటి..?
    పెద్ద తిరుమల రాయుడు స్వామి వారిని కీర్తిస్తూ ఒకపరి ఒకపరి వైయ్యారమై అనే సంకీర్తన రచించారు. ఆ కీర్తనను ఇంతవరకు వేంకటేశ్వరస్వామి వారికి మాత్రమే పాడేవారు. ఇలా తనను తాను అందంగా చూపించుకోవడం కోసం శ్రావణ భార్గవి ఉపయోగించుకునే సరికి చాలా మంది భక్తులు జీర్ణించుకోలేకపోయారు. సాధారణ మహిళ చేసే పనులన్నీ చేస్తూ కనిపించింది. బొట్టు పెట్టుకోవడం, పుస్తకాలు చదవడం, నవ్వడం, కాళ్లు ఊపడం... ఇలా ప్రతిది స్లోమోషన్లో చూపించారు. ఆ పాటకు ఆమె కాళ్లు ఊపుతూ, ఆమె అందాన్ని వివిధ భంగిమల్లో చూపిస్తూ చిత్రీకరించడం తప్పు అని అన్నమయ్య వంశస్థులు ఆరోపణలు చేస్తున్నారు.


    ఇది చదవండి: ఏపీని వదలని వాన.. మరో రెండు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..


    అసలు స్వామి వారికి అంకితం చేసిన పాటని శ్రావణ భార్గవి తన అందాన్ని చూపించుకోవడం ఏంటని అన్నమయ్య వంశస్థుల వాదన. ఇదే అంశంపై శ్రావణ బార్గవితో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు అన్నమయ్య వంశీకులు. తమతో శ్రావణ భార్గవి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపణలు చేసారు. శ్రావణ భార్గవి బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారని.. సాధార‌ణంగా ఎవరైనా అన్నమాచార్యుల కీర్తను తీసుకుంటే ‘తిరు వేంకటా చలపతి’ అనే ముద్రతోనే ఏ కీర్తనను అయినా ఎండ్‌ చేస్తారు. కానీ అలా చేయకుండా ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ అన్న శృంగార కీర్తనను మేం ఎందుకు చేయకూడదు’ అని శ్రావ‌ణ భార్గవి ఎదురు ప్రశ్నించారని వెల్లడించారు. ఈ వివాదంపై తమ వంశం వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. అలాగే టీటీడీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. వారు ఏవైనా చర్యలు తీసుకుంటే సరే.. లేదంటే.. తాము ఏం చేయాలి అన్నదానిపై ఆలోచిస్తామన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు