హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: శ్రీవారికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు..? తలనీలాలు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే..!

Tirumala: శ్రీవారికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు..? తలనీలాలు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే..!

ఫైల్

ఫైల్

భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వరుడుకి ఎంతో భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తుంటారు. అసలు శ్రీవారికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు..? తలనీలాలు సమర్పిస్తే తమకు కలిగే పుణ్యఫలం ఏంటీ అనే విషయం చాలా మందిలో ఒక ప్రశ్నగా మిగిలింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tirumala, India

  GT Hemanth Kumar, News18, Tirupati

  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హిందూ సంప్రదాయం ప్రకారం హైందవ దేవాలయాల్లో పుట్టి సంవత్సరం పూర్తైన బిడ్డకు కేశఖండన చేయడం సంప్రదాయంగా వస్తుంది. చిన్న,పెద్ద, ఆడ, మగ అనే భేధం లేకుండా తమ ఇలవేల్పుకు తలనీలాలు సమర్పిస్తుంటాం.. ఇక భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వరుడుకి ఎంతో భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తుంటారు. దేశ విదేశాల నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తారు. ముందుగా తిరుమలకు చేరుకున్న భక్తులు స్వామి వారి దర్శనం‌కంటే ముందు టిటిడి ఏర్పాటు చేసిన కళ్యాణకట్టకు చేరుకుని భక్తి భావంతో తలనీలాలు సమర్పిస్తుంటారు..కానీ ఇప్పటి వరకూ తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు..?? తలనీలాలు సమర్పిస్తే తమకు కలిగే పుణ్యఫలం ఏంటీ అనే విషయం చాలా మందిలో ఒక ప్రశ్నగా మిగిలింది.

  ఒక్క తిరుమలేశుడికే కాకుండా, ఇతర దేవతామూర్తుల ఆలయాల్లో కూడా తలనీలాలు సమర్పించడం అనేది ఒక సాంప్రదాయంగా పాటిస్తుంటారు భక్తులు. హిందూ పురాణాల ప్రకారం మనిషి తన జీవిత కాలంలో చేసిన పాపలు, అహంకారం శిరోజాలకు అంటి ఉంటాయని, అలాంటి శిరోజాలను స్వామి వారికి సమర్పించడం ద్వారా చేసిన పాప కర్మలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని అనేక గ్రంధాల్లో పొందుపరిచారు. అంతేకాకుండా.. శిరోజాలు మనిషి అందానికి ప్రతీకగా చెపప్పుకుంటారు..., అలాంటి శిరోజాలను తొలగించుకోవడం ద్వారా అందం శాశ్వతం కాదని.. చెప్పడం ఒక కారణంగా చెప్తుంటారు.

  ఇది చదవండి: శ్రీవారికి సేవచేసే అరుదైన భాగ్యం ఈయనకు దక్కింది.. ఇంతకీ మణి ఏం చేస్తారో తెలుసా..?

  హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహంమైన మహిళ భర్త ఉండగా శిరోజాలను తలగించడం హిందూ సాంప్రదాయంకు విరుద్దమైనది కావడంతో.. మహిళలు మూడు కత్తెర్ల రూపంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక గర్భంలో ఉన్న శిశువు భూమి మీదకు మొదటగా తన తల ద్వారా బయటి ప్రపంచానికి వస్తాడు. అలాంటి సమయంలో శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ముడిపడి ఉంటాయని, అందుకనే జన్మించిన సంవత్సరంలు ఆ పసికందుకు కేశఖండన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా సాగుతుంది. శిరోజాలు పాపాలను కలిగివున్న కారణంగానే తమ‌ కష్టాలు తీరిస్తే భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు భక్తులు.

  ఇది చదవండి: శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉందా..? స్వామి వెనుక సొరంగం నిజమేనా.! న్యూస్18 ఎక్స్ క్లూజివ్..!

  శ్రీవారి గురించి అనేక, పురాణ గ్రంధాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం..! ఈ నేపథ్యంలో మహా విష్ణువు వైకుంఠాన్ని వదిలి శ్రీ వేంకటేశ్వరుడి రూపంలో భువికి వచ్చి పుట్టలో ఆవాసం ఏర్పరుచుకున్న సమయంలో గొడ్డలి పెట్టుకు గాయమైన శ్రీనివాసుడికి నీలా అనే భక్తురాలు ఎదురుపడి గాయానికి పసరు మందు పూసి గాయం భాగంలో తలగిన వెంట్రుకలను స్ధానంలో నీలా తన వెంట్రులను స్వామి వారికి అతికించి గాయానికి కట్టు కడుతుంది. నీలా భక్తికి మెచ్చిన శ్రీవారు.. తన దర్శనానికి విచ్చేసిన భక్తులు తనపై భక్తి భావంతో సమర్పించే తలనీలాలు నీలాకే చెందుతాయన్నారు. కలియుగాంతం వరకూ నీలాకు వెంట్రుకలు తొలగించబడిన స్ధానంలో తిరిగి మొలుస్తాయని స్వామి వారు వరం ఇచ్చారని, అందుకే ఆనాటి నుండి నేడి వరకూ తిరుమల క్షేత్రంలో నిరంతరాయంగా తలనీలాల తంతూ కొనసాగుతుందని ఆగమ పండితులు అంటున్నారు.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారికి ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా..? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చిట్టా ఇదే..!

  దేవునిపై భక్తితో తలనీలాలు సమర్పించే ప్రదేశంను కళ్యాణకట్ట అని పిలుస్తారు. వివిధ ప్రధాన ప్రాంతాల్లో కళ్యాణకట్టలను భక్తుల సౌఖర్యార్ధం ఏర్పాటు చేసిన టిటిడి. దాదాపు 1200 మంది క్షురకులతో కళ్యాణకట్టలో ఇరవై నాలుగు గంటల పాటు భక్తులు తలనీలాలు సమర్పించే శుభకార్యం నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. అందుకే పాపాల‌ మూటను తొలగించే స్వామిగా శ్రీ వేంకటేశ్వరుడు కలియుగంలో పాపాలను తొలగించేందుకు అవతరించారని పురాణాలు చెబుతున్నాయి.

  అందుకే శ్రీవారి సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది. పేద,ధనిక అనే స్థాయి బేధం లేకుండా అందరూ స్వామి వారికి ఎంతో భక్తిశ్రద్దలతో తమ కేశాలను సమర్పిస్తుంటారు భక్తులు.. ఇలా నిత్యం ఏడు కొండలపై తలనీలాలు సమర్పించే భక్తులతో కళ్యాణకట్టలు కిటకిట లాడుతూ ఉంటాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd news

  ఉత్తమ కథలు