Secrets of Tirumala: శ్రీవారిని మలయప్ప అని ఎందుకు పిలుస్తారు... పంచబేర ఆరాధన అంటే ఏంటి..?

తిరుమల శ్రీవారు (ఫైల్)

Tirumala Temple: తిరుమల శ్రీవారికి మలయప్ప స్వామి అనే నామం శ్రీవారికి ఎందుకు వచ్చింది. నిత్య భోగాలు అందుకొనే భోగ రాయుడు ఎవరు..? అసలు శ్రీవారి ఆలయంలో ఎన్ని మూర్తులు ఉన్నాయో తెలుసా..?

 • Share this:
  GT Hemanth Kumar, Tirupati, News18

  Tirumala Tirupati Devasthanam: ఆనంద నిలయుడు ఆపద మొక్కుల వాడు...అనాధ రక్షకుడు, శ్రీనివాసుడు. ఇలా శతకోటి పేర్లతో శ్రీవేంకటేశ్వరుడిని (Lord Venkateswara) పిలుస్తారు భక్తులు. గోవిందుడు భక్త ప్రియుడు కాబట్టే ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. నిత్యం నిర్వహించే ఉత్సవాలలో పూజలు ఎవరు అందుకుంటారు. శ్రీ మలయప్ప స్వామి అనే నామం శ్రీవారికి ఎందుకు వచ్చింది. నిత్య భోగాలు అందుకొనే భోగ రాయుడు ఎవరు..? అసలు శ్రీవారి ఆలయంలో (Tirumala Temple) ఎన్ని మూర్తులు ఉన్నాయనేది ఎప్పుడూ ఆశక్తిని రేకెత్తించే అంశాలే. ప్రపంచ ప్రఖ్యాత హైదవ పుణ్యక్షేత్రం తిరుమల. ఇక్కడ ఆగమ శాస్త్ర అనుసారం శ్రీ వేంకటేశ్వరుడికి నిత్య కైంకర్యాల నుంచి సాలకట్ల ఉత్సవాలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు.శ్రీవారి ఆలయంలో నిర్వహించే పురాతన సంప్రదాయాలు, పూజా కైంకర్య విధానాలు, గర్భగుడిలో కోలువైనన్ని ఉత్సవ మూర్తులు ప్రపంచంలోనే ఏ ఆలయంలోనూ చూడలేము. గర్బాలయంలో స్వయం వ్యక్తమైన మూలవిరాట్ తో పాటు కొలువైన ఐదుగురు దేవతామూర్తులకు నిత్యం ప్రత్యేక పూజలు, నివేదనలు సాగుతున్నాయి.

  పంచబేర అంటే ఏమిటి..?
  శ్రీవారి ఆలయంలో కొలువైన ఉత్సమూర్తులకు వైఖానస ఆగమం, భగవత్ రామానుజ చార్యుల నియమాల ప్రకారం ఓక్కో మూర్తి ఒక్కోరకంగా పూజా విధానాలు నివేదనలు నిత్యం నిర్వహిస్తారు. అందుకే శ్రీవారికి నిత్యం ప్రత్యేక పూజా నివేదనలు చేసిన అర్చకులకు 16 సేర్ల బియాన్ని స్వామి వారు బుక్తిగా ప్రతిరోజూ ఇస్తారు. ప్రత నిత్యం పూజలు అందుకుంటున్న దేవతామూర్తుల్లో మొదటిది దృవబేర, రెండోవది కౌతుకబేర, మూడోవది ఉత్సవబేర, నాల్గోవది ఉగ్రబేర, ఐదోవది బలిబేరగా ఐదు రకాల ఉత్సవమూర్తులు శ్రీవారి ఆలయంలో కోలువై నిత్యపూజలు అందుకొంటున్నారు.

  ఇది చదవండి: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవకు ఎందుకంతటి ప్రాముఖ్యత..? ఈ పూజలో ఎన్ని ఘట్టాలుంటాయో తెలుసా..?


  శ్రీవారి మూలవిరాట్ విశేషాలివే..!
  తరతరాల చరిత్ర గల శ్రీవారి ఆలయంలో స్వామి వారికి పూర్వం నుండి నేటి వరకు వైఖానస ఆగమోక్తంగా పూజా కైంకర్యలు జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయంలో దివ్యశక్తులు ఇమిడి ఉండటానికి పంచబేరలు ఉండటమే ప్రధాన కారణమని శ్రీవారి ఆలయంలో తరతరాలుగా పని చేస్తున్న అర్చకులు పేర్కొంటున్నారు. తొమ్మిదన్నర అడుగుల ఎత్తుగల శాలిగ్రామ విగ్రహం తిరుమల కొండపై స్వయంగా వెలిసింది. దీన్నే ధృవ బేర అని అంటారు. నిత్యం పూజలు అందుకొంటూనే వారానికి ఓక్కసారి ఈ విగ్రహానికి అర్చకులు ఆగమపండితులు అతి పవిత్రంగా అభిషేకాలను నిర్వహిస్తారు. స్వయంగా స్వామివారే విగ్రహం రూపంలో వెలిసినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ విగ్రహాన్ని ఆలయంలో పని చేసే ప్రధాన అర్చకుడు తప్ప మరెవరూ తాకరాదు. అత్యంత శక్తి వంతమైన దివ్యస్వరూంతో కూడిన విగ్రహం అది. ఎంతో పవిత్రతో కూడుకున్న పఛ్చకర్పూరంను స్వామి వారికి నుదుటన నామాలుగా ధరింపజేస్తారు. ఈ సంప్రదాయం శ్రీవారి ఆలయంలో తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది.

  ఇది చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎందుకంత ప్రాముఖ్యత... వందల ఏళ్ల చరిత్ర ఏం చెబుతోదంటే..!


  1500 ఏళ్లుగా సాంప్రదాయం
  15 వందల సంవత్సరాల క్రితం సమవై అనే పల్లవరాణి సమర్పించిన 12 అడుగుల ఎత్తుగల వెండి విగ్రహం భోగ శ్రీనివాసమూర్తిగా పిలువబడుతోంది. శ్రీవారి గర్భాలయంలో మూలవిరాట్ పాదాల వద్ద ప్రతిష్టించారు. అప్పటి నుండి నేటి వరకు 1500ఏళ్లుగా నిత్యం పూజలందుకుంటోంది. దీన్నే కౌతుకబేర అంటారు. ప్రతి రోజూ తోమాల సేవలో పాలు కుంకుమ అభిషేకాలు జరుగుతాయి. అలాగే రాత్రి పూట ఏకాంత సేవ కూడ ఈ భోగ శ్రీనివాసమూర్తికే జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారం శ్రీవారి ఆలయంలో జరిగే సహశ్ర కలశాభిషేకం సేవ కూడా మూలవర్లకు ప్రతిభింబంగా ఈ స్వామికే జరుగుతుంది. అర్చకులు ఎంతో నియమ నిష్టలతో అత్యంత పవిత్రంగా పూజా కైకర్యలు నిర్వహిస్తారు. అయితే ఈ ఉత్సవ మూర్తిని ఆలయం లోపల నుండి బయటకు తీసుకురారు. పూజా కైకర్యాలు అన్ని ఆలయంలోనే జరుగుతాయి.

  ఇది చదవండి: శ్రీవారి ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా..? అడుగడుగునా గోవిందుడి ప్రతిరూపాలే..!


  “మలయప్పస్వామి” అనే పేరు ఎలా వచ్చిందంటే..!
  600 సంవత్సరాల క్రితం శ్రీమహవిష్ణువు అర్చకునిపై ఆవహించి శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిక్కులో ఒక లోయలోని రహస్య గుహ ఒకటి ఉందని దానిలో ఉన్న విగ్రహాలను తెచ్చి ఉత్సవమూర్తులుగా పూజా కైంకర్యాలు చేయాలని స్వామివారు నిర్దేశించారు. ఆ మేరకు అర్చకులు వెళ్ళి రహస్యగుహలోని ఉత్సవమూర్తులను తెచ్చి ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. అందుకే దీన్ని తమిళంలో ''మలై కని వుండ్రు పేరుమాల్'' అని పిలుస్తారు. మలై అంటే కొండ వంగినలోయలోని లబించిన విగ్రహాలు అని అర్ధం అందుకే స్వామికి మలయప్పస్వామిగా పిలుస్తుంటారు.

  ఇది చదవండి: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని దసరా ప్రత్యేక రైళ్లు... రూట్స్, టైమింగ్స్ ఇవే


  ఉత్సవమూర్తులు ఇవే...
  శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు, అలాగే నిత్య, వార, పక్షం, వార్షిక ఉత్సవాలన్నీ ఈ మలయప్పస్వామి వార్లకే జరుగుతాయి. ఉత్సమూర్తులు లభించిన 'కాలమానతిథి' ప్రకారం నాటి నుండి నేటి వరకు ఏ ఆలయంలో లేని విధంగా ప్రతి రోజూ ఆలయం వెలుపలకు వచ్చి మాడవీదుల్లో ఊరేగుతూ స్వామి వారు భక్తులను అనుగ్రహిస్తుంటారు. మలయప్పస్వామి లభించిన గుహ నేటికి తిరుమలలో శ్రీవారి ఆలయానికి ఈశాన్యంలో ఉంది. ఇది చాలా రహస్యమైంది. ఆప్రాంతాన్ని నేడు వైకుంఠ తీర్ధంగా పిలుస్తుంటారు.

  ఇది చదవండి: ఏపీలో రైతులకు శుభవార్త... ఈ పంటల సాగుకు ప్రోత్సాహం..


  ఉగ్ర శ్రీనివాస మూర్తి..
  దేశంలో ఏ ఆలయంలో లేని ఉగ్రశ్రీనివాస మూర్తి ప్రతిమలు ఒక్క తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రమే ఉన్నాయి. దీన్నే ఉగ్ర బేరగా పేర్కొంటారు. స్వామి వారు ప్రయోగచక్రంతో శ్రీదేవి భూదేవిలతో భక్తులకు దర్శమిస్తారు. అందువల్లే సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున ఈ స్వామిని ఊరేగిస్తారు. ప్రయోగచక్రం వలన నిత్యపూజలు అందుకొంటున్నా ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే ఆలయం వెలుపలకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కైశిక ద్వాదశి రోజున మాత్రమే స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

  ఇది చదవండి: కీలక పదవుల భర్తీకి సీఎం జగన్ కసరత్తు... లిస్టులో ఉన్న నేతలు వీళ్లేనా..?  బలిబేర
  శ్రీవారి ఆలయంలో తోమాల సేవ తరువాత బంగారు వాకిలి వద్ద ప్రతి రోజూ సంప్రదాయబద్దంగా కుబేర శ్రీనివాసునికి కొలుపు జరుగుతుంది. దీనినే బలిబేర అంటారు. కొలువులో మొదట రోజు పంచాంగం శ్రవణం చేస్తారు. అనంతరం శ్రీవారి హుండీ ద్వారా వచ్చే ఆదాయ వ్యయాలను చదివి వినిపిస్తారు. అలాగే భక్తులు ఇచ్చిన కానుకల వివరాలను అర్చకులు చదివి వినిపిస్తారు. బలిబేరలో కుబే శ్రీనివాసునికి వివరాలన్ని చదివి వివరించిన అర్చకునికి బుక్తిగా 16 శేర్ల బియ్యాన్ని ప్రతిరోజూ శ్రీవారు ఇస్తారు. దీన్ని మాత్ర దానంగా అనుగ్రహిస్తారు. శ్రీవారి ఆలయంలో కొలువైన కుబేర శ్రీనివాసుడు ఆలయంలో లోపల తప్ప బయటకురాడు. ఆలయంలో ఉంటూ నిత్య పూజా కైంకర్యాలు అందుకొంటుంటారు.

  ఇది చదవండి: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. టైమింగ్స్ లో మార్పులు.. ఎప్పటివరకంటే..!


  ఇలా శ్రీవారి ఆలయంలో ఐదు రకాల ఉత్సవ మూర్తులు నిత్య పూజా కైంకర్యాలు అందుకొంటున్నందున ఆలయంలో విశిష్టమై దివ్యశక్తులు నెలకొన్నాయని అర్చకులు విశ్వశిస్తున్నారు. మలయప్ప స్వామి లభించిన రహస్యగుహ నేటికీ ఉందని ప్రధాన అర్చకులకు పేర్కొంటున్నారు. ఇలాంటి విశిష్ట దేవతామూర్తులు కొలువైవున్నందునే శ్రీవారి ఆలయంలో దివ్యశక్తులు నెలకొన్నాయి. ఏ భక్తుడు వెళ్ళి స్వామిని దర్శించుకున్నా తిరిగి దర్శించుకొవాలన్నా ఆతృతే తప్ప బాగా దర్శించుకున్నామని సంతృప్తి ఉండదు. అందుకే తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
  Published by:Purna Chandra
  First published: