హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala Temple: శ్రీవారి వివాహం ఎలా జరిగిందో తెలుసా..? పద్మావతి పరిణయోత్సవాల విశేషాలివే..!

Tirumala Temple: శ్రీవారి వివాహం ఎలా జరిగిందో తెలుసా..? పద్మావతి పరిణయోత్సవాల విశేషాలివే..!

శ్రీవారి కల్యాణోత్సవం (File)

శ్రీవారి కల్యాణోత్సవం (File)

Tirumala: సప్తగిరులు శ్రీవారి సాలకట్ల కళ్యాణోత్సవానికి ముస్తాబు అవుతోంది. శ్రీవారికి నిత్యం నిర్వహించే కల్యాణోత్సవం ఉండగా సాలకట్ల కల్యాణోత్సవం ఏంటని సందేహం రాక మానదు. ఏడాది పొడవున ఉత్సవాలు జరిగే తిరుగిరుల్లో పద్మావతి పరినయోత్సవాలకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఆకాశ రాజు శ్రీ పద్మావతి అమ్మవారు, వేంకటేశ్వరుని కళ్యాణం జరిపిన ముహూర్తాన నిర్వహించే వేడుకే పద్మావతి పరిణయోత్సవం.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

సప్తగిరులు శ్రీవారి (Tirumala Srivaru) సాలకట్ల కళ్యాణోత్సవానికి ముస్తాబు అవుతోంది. శ్రీవారికి నిత్యం నిర్వహించే కల్యాణోత్సవం ఉండగా సాలకట్ల కల్యాణోత్సవం ఏంటని సందేహం రాక మానదు. ఏడాది పొడవున ఉత్సవాలు జరిగే  తిరుగిరుల్లో పద్మావతి పరినయోత్సవాలకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఆకాశ రాజు శ్రీ పద్మావతి అమ్మవారు, వేంకటేశ్వరుని కళ్యాణం జరిపిన ముహూర్తాన నిర్వహించే వేడుకే పద్మావతి పరిణయోత్సవం. పద్మావతి.., శ్రీనివాసుల పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఇప్పటికే నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవం మాండపాన్ని సర్వాంగ సుందరంగా ఆలంకరిస్తున్నారు. వివిధ రకాల దేవతమూర్తుల ప్రతిమాలతో.., పండ్లు..పుష్పలతో ఆలంకరించి పరిణయోత్సవ వేదికను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. రేపటి నుంచి జరిగే శ్రీనివాసుని వివాహ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసారు టీటీడీ అధికారులు. నేటి నుంచి మూడు రోజుల పాటు పద్మావతీ పరినయోత్సవాలు రంగరంగా వైభవంగా సాగనున్నాయి.

అఖిలాండ కోటి బ్రంహాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన దివ్యదమం తిరుమల పుణ్యక్షేత్రం. శ్రీవారికి ఏడాది పొడవున ఏదోక ఉత్సవం నిర్వహిస్తూనే ఉంటారు ఆగమ పండితులు. తిరుగిరులలో ఎప్పుడు చూసినా పండుగ సందడి నెలకొని ఉంటుంది. ఏడాదికి ఒకమారు నిర్వహించే ఉత్సవాలలో పద్మావతి పరిణయోత్సవాలు ఒక్కటి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో ఈ ఉత్సవాన్ని టీటీడీ ఆనవాయితీగా నిర్వహిస్తుంది. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనుంది టీటీడీ. శ్రీ మహా విష్ణువుపై అలిగిన లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీవారు వరాహ క్షేత్రానికి చేరుకుంటారు.. అలసి స్పృహ తప్పి పడిపోయిన శ్రీనివాసుడిని ఆలనా పాలన బాధ్యతలను వరహస్వామి వారు వకుళమాతను పిలిచి అప్పగిస్తారు... వకులమాత సూపర్యాలతో తేరుకున్న శ్రీవారు తన గతాన్ని మరచిపోతారు.

ఇది చదవండి: ఏపీవైపు దూసుకొస్తున్న అసని.. ఈ జిల్లాలకు హై అలర్ట్.. ప్రభుత్వం అప్రమత్తం..


వకుళామతే శ్రీహరికి శ్రీనివాసుడని నామకరణం చేసింది. పుత్రునికోసం తపిస్తున్న వకుళమాత శ్రీనివాసుడిని కన్నబిడ్డ వల్లే అదరిస్తుంది. దీనితో స్వామి వారు వరాహ క్షేత్రంలోనే ఉండిపోతారు. అయితే ఒక రోజు వనవిహారనికి వచ్చిన పద్మావతి దేవిని గజారాజులు తరుముకోవడంతో వేంకటేశ్వరుడు వాటి భారీ నుండి పద్మావతి అమ్మవారిని రక్షించి కాపాడటం జరుగుతోంది. దీనితో స్వామి, అమ్మవార్లు ఒకరి మనసు మరొకరికి ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. తరువాత తన మనసులో మాటని శ్రీనివాసుడు వకుళమాతకు చెప్పడం పెళ్ళి కోసం ఆకాశరాజు వద్దకు రాయబారం పంపడం.. ఆయన పద్మావతి శ్రీనివాసులు కల్యాణానికి అంగీకరించడం జరుగుతుంది.

ఇది చదవండి: వంట నూనెలపై టెన్షన్ అక్కర్లేదు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం


కుభేరుని వద్ద వేంకటేశ్వరుడు అప్పు చేసి మరి వైశాఖ మాసంలో వివాహం చేసుకున్నారు. కుభేరుని వద్ద తీసుకున్నా అప్పుతో శ్రీనివాసుడు సకల దేవతలకు విందు భోజనం పెట్టాడట. తొలుత లక్ష్మీ నరసింహ స్వామి వారికి నివేదన సమర్పించిన వంటకాలను తిరుమలలోని పాండవ తీర్థం నుండి శ్రీశైలం వరకు బారులుగా కూర్చున్న దేవతలకు వడ్డించారట..! ఇలాగే స్వామి వారు కుభేరుని వద్ద తీసుకున్న అప్పు దేవతల విందుకు సరిపోయిందని వేంకటాచల మహత్యంలో పేర్కొనబడింది. వివాహ మహోత్సవం అనంతరం ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసుడిని పట్టపుఏగునుపై ఉరేగించారట. వీటికి నిదర్శనంగానే పద్మావతి పరిణయోత్సవంలో మొదటి రోజు స్వామివారు గజవాహనంపై తిరుమాడ వాధుల్లో ఊరేగుతూ నారాయణగిరి ఉద్యణవనంలో ఏర్పాటు చేసిన పరిణయోత్సవం మండపానికి చేరుకోవడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు.

ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అలాంటి వాహనాలకు నో ఎంట్రీ..! రూల్స్ మరింత కఠినం


మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్పవాల్లో మొదటి రోజు స్వామివారు గజవాహనంపై ఊరేగింపుగా ఆలయం ఎదురుగా ఉన్న వాహన మండపం నుండి నారాయణగిరి ఉద్యానవనంకు వరకూ ఊరేగింపుగా వెళ్తారు. స్వామి వారితో పాటుగా అమ్మవార్లు వేరు వేరు పల్లకీ పై ఉద్యానవనానికి చేరుకుంటారు. నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ మండపంలో స్వామి, అమ్మవార్లను కొలువు తీర్చి.. అగమ శాస్త్రోక్తంగా వివాహ తంతును నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడి అధికారులు అకాశరాజు తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా కొలువు తీర్చి పూలబంతుల సేవను నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఊయ్యాల్లో వేంచేపు చేసి ఊంజల్ సేవ నిర్వహిస్తారు. అనంతరం వేదపండితులు స్వామి, అమ్మవార్లకు వేదమంత్రోచ్ఛరణతో ఆవాహన చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారిని కీర్తిస్తూ భజన బృందాలు నృత్యాలు చేయడం జరుగుతుంది. పరిణయోత్సవ వేడుకలలో భాగంగా రెండవ రోజు ఆశ్వవాహనంపై మూడవ రోజు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.. వైభవోపేతంగా జరిగే పద్మావతి పరిణయోత్సవాన్ని తిలకించేందుకు టీటీడి భక్తులందరికీ అవకాశం కల్పిస్తుంది.

ఇది చదవండి: తిరుమల శ్రీవారికి ఎప్పుడు ఏ నైవేద్యం సమర్పిస్తారో తెలుసా..? భక్తులకు తెలియని విశేషాలెన్నో..!


ఇది వరకు ఎన్నడూలేనంతగా ఈ ఏడాది పరిణయ మండప వేదికను టీటీడి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. బంగారు కాంతులతో దగాదగా మెరిసే విధంగా బంగారు వరణంతో పరిణయోత్సవ వేదికను ఏర్పాటు చేయ్యడంతో పాటు దేశవిదేశాల నుంచి తెప్పించిన ప్రత్యేక పుష్పాలు, వివిధ రకాల పండ్లతో మండపంతో పాటు పరిణయ పరిసరాలను శోభాయిమానంగా తీర్చిదిద్దింది టీటీడీ. వేదిక పరిసరాలతో పాటు శ్రీవారి ఆలయాని విద్యుత్ దీపాలతో దేదీపమాన్యంగా ఆలంకరించారు. మరి ప్రత్యేకంగా పరిణయోత్సవ మండపంలో శ్రీ మహా విష్ణు దశావతారం, మండపంలోకి స్వాగతం పలికే విధంగా అష్టలక్ష్ముల వైభవం ప్రతిభింభింఛే విధంగా కొలువుదీర్చారు. మూడు రోజుల పాటు జరిగే శ్రీనివాసుడిని పరిణయ మహోత్సవం భక్తులను కనువిందు చేయనుంది. ఈ వివాహ తంతు ప్రక్రియను వీక్షించేందుకు వేలాదిగా భక్తులు హాజరయ్యే అవకాశం వుండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేశారు టీటీడి అధికారులు. పరిణయోత్సవ వేడుకలను పురస్కరించుకొని టీటీడి కళ్యాణోత్సవం, ఆర్జితబ్రహ్మోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహాస్రదీపాలంకరణ సేవలను మూడురోజుల పాటు రద్దు చేసింది.

First published:

Tags: Andhra Pradesh, Tirumala Temple, Tirumala tirupati devasthanam

ఉత్తమ కథలు