Tirumala Prasadam: తిరుమల శ్రీవారికి ఎప్పుడు ఏ నైవేద్యం సమర్పిస్తారో తెలుసా..? భక్తులకు తెలియని విశేషాలెన్నో..!

బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీవేంకటేశ్వరుడు (Sri venkateswara Swamy) అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, పుష్పాలంకరణ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు. అంతకంటే మిక్కిలి ఆహార ప్రియుడు

బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీవేంకటేశ్వరుడు (Sri venkateswara Swamy) అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, పుష్పాలంకరణ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు. అంతకంటే మిక్కిలి ఆహార ప్రియుడు

  • Share this:
    GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

    బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీవేంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, పుష్పాలంకరణ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు. అంతకంటే మిక్కిలి ఆహార ప్రియుడు కలియుగ వరదుడు. వక్షస్థలంలో లక్ష్మి నివాసితుడైన శ్రీశ్రీనివాసుడికి నిత్య సేవల్లో సమర్పించే ప్రసాదాలు ఎన్ని. ఒక్కొకో రోజు స్వామివారికి ప్రత్యేకంగా ప్రసాదాలను నివేదిస్తారు. స్వామి వారికీ సమర్పించే ఒక్కో ప్రసాదం వాటికి అవే సాటిగా ఉంటాయి. అందరికి తెలిసిన లడ్డు, వడ, అప్పాలతో పాటుగా.... అతి కొద్దిమందికే తెలిసిన దోష, జిలేబి, మురుకు, పోలిలను ప్రత్యేకంగా నివేదిస్తారు. ప్రస్తుతం టీటీడీ జిలేబి-మురుకు ధరలను రూ. 100/- నుంచి రూ.500/- కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

    స్వామి వారి నివేదనకు నాటి రోజుల్లో మణులు, మాన్యాలు సమర్పించారు. ఆలయ గోడలపై శిల శాసనాల్లో ఎక్కువ బాగం ఏ ఏ రాజు ఏ ఏ ప్రసాదానికి ఎంత రొక్కం సమర్పిచారని, ఎన్ని మాన్యాలు ఇచ్చారనే వివరాలే అధికంగా ఉంటాయి. దీనిబట్టే చెప్పవచ్చు స్వామి వారి నైవేధ్యంకు ఎంత విశిష్టత ఉందోనని, 1933వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన నాటి నుంచి కూడా శ్రీ భగవత్ రామానుజాచార్యులు నిర్దేశించిన పూజ నియమాల ప్రకారం, ఆగమ శాస్త్రోక్తంగా స్వామి వారికి మిరాశి అర్చకులు నైవేద్యం సమర్పిస్తారు. శ్రీ వేంకటేశ్వరునికి త్రికాల నైవేద్యంవితరణ ఉంటుంది. నైవేద్య సమయాలను మొదటి గంట, రెండవ గంట, మూడవ గంటగా పిలుస్తారు. గురు శుక్ర వారలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు.

    శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు (Photo Credit: TTD)


    శ్రీవారికి నిత్యం నిర్వహించే సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అనేక రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలు నివేదనగా సమర్పిస్తారు. భగవంతుని దర్శనం అనంతరం అయన అనుగ్రహంగా భక్తులు భావించేది నైవేద్య ప్రసధమే. వెంకన్న దర్శన బాగ్యం అనంతరం శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులు శ్రీవారి అనుగ్రహంగా భావిస్తారు. భక్తులకు తెలియని ఎన్నో ప్రసాదాలను మూలమూర్తికి నివేదిస్తుంటారు. నిత్యం నిర్వహించే కైంకర్యాలను బట్టి స్వామి వారికి నివేదన సమర్పిస్తారు అర్చక స్వాములు. పాలు, వెన్న మొదలుకొని పొంగళ్ళు, పులిహోర, చక్కెర పొంగలి వంటి ఎంతో రుచికరమైన ప్రసాదాలను స్వామి వారికి నైవేద్య సమర్పణ చేస్తారు. కమ్మటి దోశలు ఘాటైన మిరియాల పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారని కొద్ది మందికి మాత్రమే తెలుసు.

    శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు (Photo Credit: TTD)


    శేషాద్రి నిలయునికి నిత్యం వైభవంగా నిర్వహించే ఉత్సవాలోనే కాదు నైవేద్య సమర్పణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. వైఖానస అగమోక్తంగా శ్రీవారికి ఇప్పటికి కట్టెల పొయ్య మీదే ప్రసాదాలను తాయారు చేస్తారు. విమాన ప్రదిక్షిణ మార్గంలో శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో ప్రధాన పోటు ఉంటుంది. ఈ పోటులోనే శ్రీ వేంకటేశ్వరునికి నైవేధ్యంగా సమర్పించే అన్నప్రసాదం, పిండి వంటలు తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని ముందుగా క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహ స్వామి వారికీ నైవేద్యం సమర్పించిన అనంతరం శ్రీవారికి గంటానాధాల మధ్య నైవేద్యం సమర్పిస్తారు. ఆ తరువాత శ్రీ వారి ఆలయంలోని పరివర దేవత మూర్తులకు, ఆలయం ఏదురుగా ఉన్న భేడి ఆంజనేయ స్వామి వారికీ నైవేధ్య సమర్పణ జరుగుతుంది. స్వామి వారికి 50 రకాలకు పైగా నైవేద్యాలు సమర్పిస్తుంటారు. శ్రీ వేంకటేశ్వరుని దర్శనం అనంతరం చెక్కర పొంగలి, పులిహోర, దద్దోజనం, మిరియాల పొంగలి, చిన్న లడ్డులను భక్తులకు అందిస్తారు. వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు... వడ, దోస, జిలేబి, పెద్ద లడ్డు, మురుకు, పెద్ద వడ, తదితర ప్రసాదాలను అందజేస్తారు.

    శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు (Photo Credit: TTD)


    శ్రీవారికి సుప్రభాత సమయంలో గో క్షీరం, వెన్న, చక్కెరను నివేదిస్తారు. అనంతరం బంగారు సింహాసనంపై వేంకటేశ్వరుని వెంచేపు చేసి కొలువు (దర్బార్) లో బెల్లంతో కూడిన నువ్వుల పిండిని నివేదిస్తారు. పిమ్మట జరిగే మొదటి నివేదన మొదటి గంటల్లో పెరుగు, వెన్న, మీగడతో తయారు చేసిన మాత్రా అని పిలువబడే ప్రసాదాన్ని ఒడులో అంటే పగిలిన కుండలో ఉంచి గర్భాలయంలో తీసుకెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు. ప్రతి నైవేద్య సమయంలోనూ కులశేఖర పడి వద్దనే ఉంచి పులిహోర, దద్దోజనం, కదంభం, క్షీరాన్నం నివేదిస్తారు. మధ్యాహ్నిక ఆరాధన అనంతరం రెండవ గంటల్లో నిత్య అన్నప్రసాధాలతో పాటుగా శుద్దన్నం, పాయసం, సీరాను నైవేద్యంగా పెడతారు.

    కళ్యానోత్సవం అనంతరం స్వామి వారికీ లడ్డూలు, వడలు, అప్పాలు, దోశతో పాటు చక్కర పొంగలి, పొంగలి, దద్దోజనం, పులిహోరను సమర్పిస్తారు. ఆ తరువాత నిర్వహించే డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలో చక్కర, గసగసాలు, కలకండ, జీడిపప్పు, బాదంపప్పు, ఎందు ద్రాక్ష, ఎందు కొబ్బరితో తయారు చేసే పంచాకజ్జయం అనే ప్రసాదాన్ని సమర్పిస్తారు. సాయంత్రం నిర్వహించే తోమాల సేవలో తోమాల పడి దోశలతో పాటు ముళహోర, కదంభం నైవేద్యంగా సమర్పిస్తారు. అష్టోత్తర శత నామార్చన జరిగిన తరువాత రాత్రి నివేదన మూడవ గంటలో చక్కర పొంగలి, పోగాలి, కదంభం, ముళహోర వంటి అన్నప్రసాదాలు నివేదన చేస్తారు. అనంతరం తిరువీసం గంటలో చక్కర పొంగలి నివేదిస్తారు. స్వామి వారి పవళింపు సేవలో బాగా కాచి చలర్చిన చక్కర వేసిన పాలు, పండ్లు,పంచాకజ్జయం, మేవా (పంచామృతం) నివేదింపబడుతుంది.

    తిరుమల ప్రతినిత్యం పంగడ సందడితో శోబయమనంగాను నిత్యోత్సవంతో కోలాహలంగా ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో నైవేద్యాన్ని స్వామి వారికి ప్రత్యేకంగా సమర్పిస్తారు. శ్రీవారికి ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజలో పెద్ద వడలు, లడ్డులు అన్నప్రసాదంగా నివేదిస్తారు. బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకంలో క్షీరాన్నంతో పాటుగా నిత్యం సమర్పించే అన్నప్రసాదాలను నైవేద్యంగా పెడుతారు . ఇక గురువారం జరిగే తిరుప్పావైవడ సేవలో 420 కేజిల బియ్యంతో తాయారు చేసిన పులిహోరను రాశుసుగా అమర్చి నివేదిస్తారు. చాటంత పెద్ద జిలేబిలు, మురుకులు కుడా తిరుప్పావడ సమయంలో నివేదన చేస్తారు. శుక్రవారం నాడు పోళీలు, సుగీలను స్వామికి సమర్పిస్తారు. ఇక ఆదివారం నాడు ఆదివారం ప్రసాదం అనే చలిపింది ప్రసాదాన్ని ప్రత్యేకంగా నివేదిస్తారు.

    అంతేకాక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ప్రత్యేక పర్వదినాల్లో దోశలు, శనగపప్పుతో చేసిన గుగ్గిళ్లను నివేదిస్తారు. పెసరుపప్పు పణ్ణారం పానకంను ప్రత్యేక నైవేద్యంగా స్వామి వారికీ సమర్పిస్తారు. నెల రోజుల పాటు జరిగే దర్నుర్మాస వ్రతంలో బెల్లం దోశలను వెంకన్నకు నివేదిస్తారు. ఇలా స్వామి వారికి జరిగే నిత్య, పక్ష, వార, మాస, సంవత్సరాది ఉత్సవలో ప్రత్యేకంగా నివేదనలు ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరుడు తన చూపులతో ఆ పదార్థాలన్నింటిని పవిత్రం చేసి, ఆస్వాదించి, తన భక్త శేషాన్ని ప్రసాదాలుగా భక్తులకు ప్రసాదిస్తాడు. ఆ దివ్యప్రసాదాలు స్వీకరించిన భక్తులకు పుష్టి, తుష్టి, సంతుష్టీ కలుగుతాయి. దానితోపాటు ఎన్నో కోరికలు నెరవేరడంతోపాటు వారి వారి అంతుబట్టని రోగాలు ఇట్టే మాయం అవుతాయి. ఆరోగ్యం సంపూర్ణంగా కలుగుతుంది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

    ప్రస్తుతం టీటీడీ తిరుమలలో విక్రయించే చిన్న లడ్డు ధర రూ.50లకు విక్రయిస్తోంది టీటీడీ. ఇక పెద్ద లడ్డు (కళ్యాణం లడ్డు) రూ.200కు విక్రయిస్తున్నారు. స్వామి వారికీ కల్యాణోత్సవం నివేదించే వడ రూ. 100కు, దోశ రూ.10కి, అప్పం 20కి విక్రయిస్తున్నారు. భక్తులకు అత్యంత డిమాండ్ జిలేబి ప్రసాదం జిలేబి-మురుకు సెట్టును రూ.100/- కు విక్రయిచ్చేంది. ప్రస్తుతం జిలేబి-మురుకు ధర రూ.500/-కు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. మిగిలిన అన్నప్రసాదాలు అన్ని ఉచితంగానే అందిస్తోంది టీటీడీ.
    Published by:Purna Chandra
    First published: